BB5 Promo: కిడ్స్ వర్సెస్ అడల్ట్స్.!? మరోసారి మాటలతో నామినేషన్లను బద్దలుకొట్టారు

* నామినేట్ చేస్తే సేఫ్ గేమ్.. మాట్లాడితే కిడ్స్ అంటూ ఇంటి సభ్యుల వాదోపవాదాలు

Sandeep Reddy
Updated on: 20 Sept 2021 4:30 PM IST
Bigg Boss 5 Telugu Promo Released on Monday 20 09 2021
X

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రోమో(ఫోటో: స్టార్ మా)

BB5 Telugu Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రెండో వారం ఎలిమినేషన్ లో భాగంగా ఉమాదేవి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. ఆదివారం మొదట సరదాగా ఒక్కో హౌస్ మేట్ మరొక సభ్యుడితో డాన్స్ లతో బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. తన కోపమే తనకు శత్రువు అన్నట్టుగా ఉమాదేవి మాట్లాడిన బూతులకు, హౌస్ లో ప్రవర్తించిన తీరుకు చివరగా బాధపడిన ప్రేక్షకుల నుండి ఆశించినంతగా ఓట్లురాక హౌస్ నుండి బయటికి ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో నామినేషన్ ప్రక్రియ మరోసారి హాట్ హాట్ గా కనిపిస్తుంది. ఎవరిని నామినేట్ చేయాలో వారి పేరు ఉన్న బోర్డుని బద్దలుకొట్టి ఎందుకు నామినేట్ చేశారో దానికి కారణం చెప్పాలి.

అయితే ప్రోమో ప్రకారం సన్నీ..ప్రియని, నటరాజ్ మాస్టర్ ..ఆర్జే కాజల్ ని, విశ్వా.. నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక మరోసారి నిప్పులాంటి మాటలతో మన్డే రోజు నామినేషన్స్ ఎపిసోడ్ మారుమ్రోగనుంది. ఇంటి సభ్యులు మొదటి నుండి తమ వయస్సు గురించి మాట్లాడుతూ తన కన్నా చిన్నవాళ్ళని ఏదో ఒకరకంగా కరివేపాకులా తీసి పారేస్తుండటం.., అదేవిధంగా మిగిలిన వాళ్ళు కూడా వారికి గట్టిగానే సమాధానం ఇస్తుండటంతో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరి సోమవారం జరగబోయే ఎపిసోడ్ లో ఎవరు పిల్లచేష్టలతో కనిపించబోతున్నారో.., ఎవరు పెద్ద మనసుతో ప్రవర్తించబోతున్నారో వేచిచూడాల్సిందే..!!

Sandeep Reddy

Sandeep Reddy

Next Story