Bigg Boss 5 Promo: పే బ్యాక్ టైం లో నవ్వించిన సన్నీ

Bigg Boss 5 Promo: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు శనివారం ప్రోమో విడుదల

Sandeep Reddy
Published on: 6 Nov 2021 5:36 PM IST
Bigg Boss Season 5 Telugu Saturday Episode Promo 06th November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss 5 (ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Promo: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 వీకెండ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ వారం కెప్టెన్సీలో భాగంగా సూపర్ విలన్స్, సూపర్ హీరోస్ టీంలో ఇంటి సభ్యులు ఇచ్చిన ఛాలెంజ్ లను విజయవంతంగా పూర్తి చేసిన రవి, శ్రీరామచంద్రలకు ఇది పే బ్యాక్ టైం అంటూ హోస్ట్ నాగార్జున ఒక అవకాశం ఇవ్వడం ప్రోమోలో చూశాము. మొదటగా కెప్టెన్సీ టాస్క్ లో రవి గేమ్ ఆడిన విధానాన్ని నాగార్జున మెచ్చుకోవడం చూశాము.

ఇక రవి.. శన్ముఖ్ జస్వంత్ ని ఎంపిక చేసుకొని రకరకాల జ్యూస్ తయారు చేసి తాగమని ఇవ్వడం అది శన్ముఖ్ జస్వంత్ తాగడం ప్రోమోలో చూశాము. ఆ తరువాత శ్రీరామచంద్ర.. విజే సన్నీని ఎంపిక చేసుకొని అదే విధంగా జ్యూస్ ఇవ్వడం.. అది కాస్త పూర్తవకముందే పచ్చిమిర్చి, ulligadda తినాలని ఇవ్వడంతో ఏదో జన్మలో నువ్వు నాకు మొగుడివి అయ్యే ఉంటావంటూ కామెడీ చేయడం తాజా ప్రోమోలో చూడొచ్చు.

ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్న విజే సన్నీ, సిరి హనుమంత్, శ్రీరామచంద్ర, ప్రియాంక సింగ్, విశ్వ, ఆర్జే కాజల్, జెస్సీ, రవిలలో ఈ వారం ఎవరు సేవ్ అవుతారో..ఎవరు ఎలిమినేట్ అయిబిగ్ బాస్ ఇంటిని వదిలి వెళ్తారో ఈ వీకెండ్ ఎపిసోడ్ తో తేలనుంది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story