BB5 Telugu Promo: శన్ముఖ్ వచ్చివారం అయింది.. ఆట మొదలుపెట్టరా అంటున్న నాగ్

Sandeep Reddy
Updated on: 11 Sept 2021 5:47 PM IST
Bigg Boss 5 Telugu First Weekend Promo Released
X

బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో (ఫోటో: స్టార్ మా)

BB5 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 5 లో శనివారం బాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శనివారం ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో సరదాగా ముచ్చటించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఒక్కో కంటెస్టంట్ తో మాట్లాడిన నాగార్జున అందరికి తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చాడు. ఫస్ట్ కెప్టెన్ సిరిని పొగుడుతూనే విజే సన్నీపై సరదాగా సెటైర్ వేశాడు నాగ్. ఇక కాజల్ ని బిగ్ బాస్ హౌస్ లో నువ్వు హౌస్ మేటేనని రేడియో జాకీ కాదని కామెడీ చేయడంతో పాటు హౌస్ లో లోబో చేసే ఎంటర్టైన్మెంట్ కి చప్పట్లతో ప్రశంసించాడు. ఇక సింగర్ శ్రీరామ్.. హమీదాని బాధలో ఉన్నపుడు ఓదార్చిన తీరును మెచ్చుకున్న నాగార్జున.. శన్ముఖ్ జశ్వంత్ ని "అరే ఏంట్రా ఇది.. కొంచెం కనబడురా వచ్చివారం అయింది.. ఆట మొదలుపెట్టరా" అంటూ చేసిన కామెంట్స్ తో బిగ్ బాస్ హౌస్ లో నవ్వులు తెప్పించాడు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story