BB5 Telugu Latest Promo: కాలు దువ్విన విశ్వా.. కాజేసిన జెస్సీ

* మంగళవారం బిగ్ బాస్ 5 ప్రోమో విడుదల

Sandeep Reddy
Published on: 5 Oct 2021 6:31 PM IST
Bigg Boss 5 Telugu Latest Promo Released on 5th October 2021 | Bigg Boss 5 Promo
X

బిగ్ బాస్ 5 తెలుగు (ఫోటో: స్టార్ మా)

BB5 Telugu Latest Promo: సోమవారం నామినేషన్ ప్రశాంతంగా మొదలై ఒకరిపై ఒకరు అరుస్తూ ముగిసిన.. ఆ వేడి కాస్త మంగళవారం ఎపిసోడ్ లో కూడా కొనసాగనుంది. శన్ముఖ్ జస్వంత్ మాట్లాడిన రూల్స్ బుక్ కి శ్రీరామచంద్ర తన స్టైల్ లో కౌంటర్ ఇవ్వనున్నాడు. మరోపక్క ఆర్జే కాజల్.. యాంకర్ రవి, లోబోలపై చేసిన కామెంట్స్ కాస్త హౌస్ లో సీరియస్ గా మారి ఒకరిపై ఒకరు అరుచుకోవడం తాజాగా మంగళవారం విడుదలైన ప్రోమోలో చూశాము.

బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా రవి, సన్నీలను రాజులుగా నియమించి సన్నీ ప్రజా.. రవి ప్రజా అంటూ రెండు జట్లుగా ఇంటి సభ్యులు టాస్క్ లో పాల్గొననున్నారు. అయితే ఈ టాస్క్ లో యాంకర్ రవి తరపున విశ్వా.. సన్నీ తరపున మానస్ లు కుస్తీ పోటీలో పాల్గొననున్నారు. ఆ సమయంలోనే శన్ముఖ్ జస్వంత్, జెస్సీ, సిరి హనుమంత్ యాంకర్ రవి తరపున టీం దాచుకున్న నాణేలను కాజేయడం తాజా ప్రోమోలో చూడొచ్చు. నాణేలు దొంగతనం అయిన విషయం తెలిసిన విశ్వా.. సన్నీ టీం సభ్యులపై సీరియస్ అవడం మంగళవారం ఎపిసోడ్ లో చూడనున్నాము.

ఈ కెప్టెన్ టాస్క్ లో భాగంగా సన్నీ టీంలో శన్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్, జెస్సి, మానస్, లోబో.. యాంకర్ రవి టీంలో శ్రీరామ్ చంద్ర, హమీదా, ప్రియాంక సింగ్, ఆర్జే కాజల్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ సోమవారం నామినేషన్ వేడి చల్లారక ముందే కెప్టెన్సీ టాస్క్ తో మరోసారి ఇంటి సభ్యుల మధ్య మంటలు పుట్టించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story