BB5 Latest Promo: ఫుడ్ విలువ తెలుసుకుంటున్న బిగ్ బాస్ ఇంటి సభ్యులు

* బుధవారం ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో విడుదల చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5

Sandeep Reddy
Published on: 29 Sept 2021 3:24 PM IST
Bigg Boss 5 Telugu Latest Promo Released 29 09 2021 | Bigg Boss Season 5 Updates
X

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు (ఫోటో: స్టార్ మా)

BB5 Telugu Promo: మంగళవారం బిగ్ బాస్ హౌస్ నుండి ఫుడ్ తీసుకువెళ్తున్న సమయంలో కామెడీ చేస్తూ వెకిలి నవ్వులు నవ్విన ప్రతి ఒక్కరికి బుధవారం జరగబోయే ఎపిసోడ్ లో అదే ఫుడ్ విలువ తెలిసిందని తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్ధం అవుతుంది.

మంగళవారం ఎపిసోడ్ లో ఆర్జే కాజల్ తో పాటు మరికొంత మంది ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్ నుండి అన్ని ఆహారపదార్థాలు తీసుకువెళ్ళినపుడు ఎస్ ఎస్ అంటూ సంతోషపడిన ఇంటి సభ్యులకు మంగళవారం సన్నీ చెప్పిన మాటలు గుర్తువస్తున్నాయని యాంకర్ రవి ప్రతి నిమిషం ఫుడ్ విలువ తెలుస్తుందని మాట్లాడిన మాటల్లో అర్ధం అవుతుంది.

లోబో తన ఆకలిని భరించలేక డస్ట్ బిన్ లో ఏదైనా ఫుడ్ ఉందో అని వెతకడం చూసిన ఇంటి సభ్యులు అతన్ని చూసి ఎమోషనల్ అయ్యారు. ఇక అంతకు ముందు ఇంటిసభ్యులు బిగ్ బాస్ చెప్పిన నియమాలను అతిక్రమించి ఆహారాన్ని తీసుకున్నారని బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ గా ఉన్న జెస్సి తో పాటు తన జంటగా ఉన్న ఆర్జే కాజల్ ని కూడా కెప్టెన్ పోటీదారుల నుండి తొలగించింది.

దీంతో జెస్సి కోపంతో ఆరుస్తూ ఉండటం, ఆర్జే కాజల్ బాధ పడటం జరుగుతుంది. మరోపక్క జెస్సీ అందరిని అన్న అంటూ పిలవడం నచ్చని శన్ముఖ్ జస్వంత్.. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఎవరిని అన్నా అని పిలవాల్సిన అవసరం లేదని పేరుపెట్టి పిలిస్తే సరిపోతుందని సలహా ఇస్తాడు.

ఇక ఈరోజు ఆకలితో అలమటించే ఇంటి సభ్యులతో పాటు ఆనందంతో కేఎఫ్ సి చికెన్ తినే ప్రియాంక సింగ్ ని చూడొచ్చు. ఇప్పటికే కెప్టెన్సి టాస్క్ పోటీ నుండి జెస్సీ, ఆర్జే కాజల్ తొలగిపోవడంతో పాటు, నటరాజ్ మాస్టర్ - లోబో ఓడిపోవడంతో వెనుకంజలో ఉన్నారు. ఇక రానున్న టాస్క్ లో ఎవరు గెలిచి మానస్ - హమిదా జంటకి పోటీ ఇస్తారో.. లేదా బరువు తగ్గి కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతారో చూద్దాం..!!


Sandeep Reddy

Sandeep Reddy

Next Story