BB5 Telugu: ఓట్ల వేటలో ఓడిన సింహం.. ఆసక్తికరంగా ఐదో వారం నామినేషన్

* నాలుగో వారం నామినేషన్ లో ఎలిమినేట్ అయిన నటరాజ్ మాస్టర్ * సోమవారం నామినేషన్ పక్రియ ప్రోమో విడుదల చేసిన బిగ్ బాస్ టీం

Sandeep Reddy
Published on: 4 Oct 2021 3:08 PM IST
Bigg Boss 5 Telugu Latest Promo Released 04 10 2021
X

బిగ్ బాస్ సీజన్ 5 (ఫోటో: స్టార్ మా)

BB5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 నాలుగో వారం నామినేషన్ లో భాగంగా ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో డేంజర్ జోన్ లో ఉన్న లోబో, ఆనీ మాస్టర్, సిరి హనుమంత్, నటరాజ్ మాస్టర్ లలో నుండి చివరికి నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు.

బిగ్ బాస్ మొదలయ్యాక మొదటి రెండు వారాలు కాస్త సైలెంట్ గానే ఉన్నా నటరాజ్ మాస్టర్ మూడోవారం నుండి హౌస్ లో ఇంటి సభ్యులకు రకరకాల జంతువుల పేర్లతో పోల్చడంతో పాటు నామినేషన్ సమయంలో తనకి తానుగా సింహాన్ని అంటూ చెప్పుకుంటూనే విశ్వతో మాట్లాడిన సందర్భంలో సింహంతో వేట నాతో ఆట ప్రమాదమంటూ సినిమా డైలాగ్స్ చెప్తూ కాస్త యాక్షన్ చేసిన అది కాస్త వారం ముగిసేసమయానికి ఓవర్ యాక్షన్ గా మిగిలి చివరికి హౌస్ నుండి వెళ్ళిపోయాడు.

ఇక ఈ ఆదివారంతో గుంటనక్క, నత్త, ఊసరవెల్లి, ఎలుగుబంటి అని ఇంటి సభ్యులకు పేరు పెట్టిన నటరాజ్ మాస్టర్ ఇంటి నుండి ఎలిమినేట్ బైటికివెళ్లి వేట ముగించగా..మిగిలిన ఇంటి సభ్యులు మాత్రం సోమవారం నుండి నామినేషన్ తో ఆటను మొదలుపెట్టారు.. నటరాజ్ సింహం మాత్రం ప్రేక్షకుల ఓట్ల వేటలో ఓడి బలైపోయింది.

తాజాగా విడుదలైన సోమవారం ప్రోమోలో బిగ్ బాస్ నామినేషన్ పక్రియ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా జరగనున్నారు. అందుకు గానూ ఇంటి సభ్యులను ఒక్కోక్కరిని కన్వెన్షన్ రూమ్ కి పిలిచి ఇంటి సభ్యులలో ఇద్దరిని నామినేట్ చేయాలని సూచిస్తాడు. ఇక అందులో భాగంగా ఇంటిసభ్యులు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే లోబో.. శన్ముఖ్ జస్వంత్ ని, జెస్సీ.. యాంకర్ రవిని, శన్ముఖ్ జస్వంత్.. విశ్వని, ప్రియ.. లోబో లేదా సన్నీని, యాంకర్ రవి.. జెస్సీని, శ్రీరామచంద్ర మాత్రం శన్ముఖ్, జెస్సీ, సిరి హనుమంత్ లలో ఒకరిని నామినేట్ చేయనున్నట్లు తెలుస్తుంది.

ఇక ఇప్పటివరకు తనని ఎవరు నామినేట్ చేస్తే వాళ్లనే ఎంచుకునే ఆర్జే కాజల్ కి మాత్రం ఈసారి నామినేషన్ ప్రక్రియలో ఎవరిని నామినేట్ చేయాలో ఎంచుకోవడానికి కాస్త ఇబ్బందిపడేలా ఉంది. ఈ వారం నామినేషన్ లో దాదాపుగా చివరి వారంలో నామినేట్ అయిన ఇంటి సభ్యులే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story