BB5 Latest Promo: ఎవరు వరస్ట్.. ఎవరు బెస్ట్..!?

BB5 Promo: ఎవరు వరస్ట్.. ఎవరు బెస్ట్..!?

Sandeep Reddy
Published on: 15 Oct 2021 6:31 PM IST
Bigg Boss 5 Telugu Friday Latest Promo Released Today 15 10 2021
X

BB5 Promo: ఎవరు వరస్ట్.. ఎవరు బెస్ట్..!? (ఫోటో: స్టార్ మా) 

BB5 Promo: బిగ్ బాస్ సీజన్ 5 శుక్రవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ వారం బెస్ట్ పెర్ఫర్మార్ తో పాటు వరస్ట్ పెర్ఫర్మార్ ని ఎంపిక చేసుకునే ప్రక్రియని ఈరోజు ఎపిసోడ్ లో చూడనున్నాము. రెండు రోజుల పాటు జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యుల మధ్య జరిగిన వాదోపవాదాలు, బిగ్ బాస్ నియమాలను అతిక్రమించిన విషయాలను దృష్టిలో పెట్టుకొనే ఈరోజు ఎవరు వరస్ట్.., ఎవరు బెస్ట్ అని ఇంటి సభ్యులు డిసైడ్ అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ ప్రక్రియలో భాగంగా వరస్ట్ పెర్ఫర్మార్ గా లోబోని జెస్సీ, ఆనీ మాస్టర్ ఎంపిక చేయగా, జెస్సీని రవి అసలు ఇంట్లో నువ్వు ఉన్నట్టే అనిపించట్లేదంటూ వరస్ట్ పెర్ఫర్మార్ గా ఎంపిక చేస్తాడు. విశ్వా.. రవిని, శ్రీరామచంద్ర, సిరి హనుమంత్ ఇద్దరూ ఆనీ మాస్టర్ ని, ఆర్జే కాజల్.. రవిని, మానస్.. సిరి హనుమంత్ ని, రవి.. జెస్సిని వరస్ట్ పెర్ఫర్మార్ గా ఎంపిక చేసినట్టు తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా అర్ధమవుతుంది. మరో ప్రోమోలో ప్రియ, శ్వేతవర్మ మధ్య కిచెన్ లో హాట్ వాటర్ కి సంబంధించిన విషయంలో గొడవ జరగడం ఈరోజు ఎపిసోడ్ లో చూడనున్నాము.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story