Bigg Boss 5 Telugu: షటప్ అంటున్న ప్రియాంక.. నేను ఉండలేను అంటున్న శన్ముఖ్

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు లో రోజుకో గొడవతో హౌస్ అంత హాట్ హాట్ గా మారిపోతుంది.

Sandeep Reddy
Updated on: 11 Sept 2021 4:29 PM IST
Bigg Boss 5 Telugu Fourt Episode Updates of Shanmukh Jaswanth Comments on Karthika Deepam UmaDevi
X

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు (ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 లో రోజుకో గొడవతో హౌస్ అంత హాట్ హాట్ గా మారిపోతుంది. హౌస్ లోకి ఎంటర్ అయి నాలుగు రోజులే అయిన ఎవరు ఏంటో అని కంటెస్టంట్ లకు కొద్దికొద్దిగా అర్ధం అవుతుంది. రెండో రోజు నుండే మొదలైన ఈ మాటల యుద్ధం ఎలాంటి అవాంతరాలు లేకుండా నాలుగో రోజు సాగింది... బిగ్ బాస్ బెస్ట్ పర్ఫర్మార్, వరస్ట్ పర్ఫర్మార్ ని ఎంపిక చేసుకోమని ఇచ్చిన టాస్క్ లో ప్రియాంక సింగ్, ఉమాదేవి మధ్య మాట మాట పెరిగి పెద్ద రచ్చే జరిగింది. మొదట లోబోని తన కామెడీతో అందరిని నవ్విస్తాడని అతను ఈ హౌస్ లో బెస్ట్ పర్ఫర్మార్ గా ఎంపిక చేసిన ప్రియాంక సింగ్.. ఆ తర్వాత ఉమాదేవిని వరస్ట్ పర్ఫర్మార్ గా ఎన్నుకుంది.

దీంతో వీరిద్దరి మధ్య జరిగిన గొడవలో ఉమాదేవి ప్రియాంక సింగ్ ఒకరిపై ఒకరు అరుచుకోగా.. ప్రియాంక షటప్ అంటూ ఘాటుగా స్పందించడంతో హౌస్ వాతావరణం మరింత వేడిక్కింది. తరువాత తన తప్పును తెలుసుకొని క్షమాపణలు చెప్పింది ప్రియాంక. ఇక ఈ టాస్క్ లో హౌస్ అందరిలో బెస్ట్ పర్ఫర్మార్ గా విశ్వ, వరస్ట్ పర్ఫర్మార్ గా జెస్సి ఎంపిక అయ్యారు. మరోపక్క మూడు రోజుల్లో అంతగా కనిపించని శన్ముఖ్ జస్వంత్ నాలుగో రోజు అభిమానులకు కాసేపు దర్శనం ఇచ్చాడు. తనకు ఇంత మంది మధ్యలో ఎప్పుడు లేనని ఈ బిగ్ బాస్ తనకు సెట్ అవదని, తను బైటికి వెళ్లి వీడియోలు చేసుకోవడమే కరెక్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. హౌస్ లో ఉమా గారిని నామినేట్ చేయక తప్పు చేశానని బాధపడ్డాడు. తన కోపం, ఈగో వల్ల అందరు ఇబ్బందిపడుతున్నారని..తన తల్లి పేరు కూడా అదే అవడం వలన నామినేట్ చేయలేకపోయానని శన్ముఖ్ వాపోయాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story