Bigg Boss 5 Telugu: మాటలతో ఆకట్టుకున్న సన్నీ, లోబో.. ఏడ్చేసిన జెస్సీ

* బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదటిరోజే అటు గొడవలతో మొదలై ఓదార్పులతో ముగిసింది.

Sandeep Reddy
Updated on: 21 Sept 2021 11:37 AM IST
Bigg Boss 5 Telugu Day 1 Highlights and Nominated Contestants List
X

బిగ్ బాస్ తెలుగు 5

Bigg Boss 5 Telugu: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదటిరోజే అటు గొడవలతో మొదలై ఓదార్పులతో ముగిసింది. ఈ వారం నామినేషన్ లో భాగంగా ఇచ్చిన డస్ట్ బిన్ టాస్క్ లో కొంతమంది కాంటెస్టంట్ లు తమ మాటలతో అభిమానులను సంపాదించుకోగా, మరికొంత మంది ఎవరిని ఎందుకు నామినేట్ చేస్తున్నారో కూడా సరైన కారణాలు చెప్పలేకపోయి మీరు స్ట్రాంగ్ కాంటెస్టంట్ కాబట్టి నామినేట్ చేస్తున్నాం అంటూ చెప్పే సిల్లీ రిజన్స్ చెప్పి మెళ్లిగా తప్పించుకున్నారు.

మొదటి రోజు బిగ్ బాస్ హౌస్ విషయానికొస్తే.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక సోషల్ మీడియాలో పలువురి కాంటెస్టంట్ లను ట్రోలింగ్ చేస్తున్నా సోమవారం జరిగిన నామినేషన్ టాస్క్ తో కాంటెస్టంట్ లపై ప్రేక్షకులకు అభిప్రాయాలు మారాయి. అందులో ముఖ్యంగా సీరియల్ నటుడు విజే సన్నీని ట్రోల్ చేసిన నామినేషన్ ప్రక్రియలో తన మాటలతో, పద్దతిగా ప్రవర్తించి మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఎంటర్టైన్మెంట్ విషయానికొస్తే లోబో హౌస్ మెంబర్స్ ని తన హైదరాబాదీ యాసతో కామెడీ చేస్తూ ప్రేక్షకులను నవ్వించాడు.

ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ ఆర్జె కాజల్ తో చేసిన సంభాషణలో కాస్త ఉద్వేగానికి లోనవడం, జెస్సీ నామినేట్ అయినందుకు చిన్న పిల్లాడిలా ఏడవడం టాస్క్ తర్వాత సన్నీ, లోబోలు జెస్సిని ఓదార్చడంతో మొదటి రోజు బిగ్ బాస్ ముగిసింది. ఈ వారం నామినేట్ అయిన సభ్యులలో జెస్సీ, సరయు, ఆర్జే కాజల్, యాంకర్ రవి, మనాస్, హమిదాలు ఉన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story