Shanmukh Jaswanth: సిరి వల్లే రన్నరప్ గా నిలిచా.. దీప్తితో గొడవ అయితే 2 నెలలు మాట్లాడుకోం

* బిగ్ బాస్ 5 బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శన్ముఖ్ జస్వంత్

Sandeep Reddy
Published on: 21 Dec 2021 1:53 PM IST
Bigg Boss 5 Telugu Contestant Shanmukh Jaswanth Latest Interview in  Bigg Boss 5 Buzz
X

Shanmukh Jaswanth: సిరికి వల్లే రన్నరప్ గా నిలిచా.. దీప్తితో గొడవ అయితే 2 నెలలు మాట్లాడుకోము

Shanmukh Jaswanth: బిగ్ బాస్ సీజన్ 5 రన్నరప్ గా నిలిచిన శన్ముఖ్ జస్వంత్ తాజాగా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో తన 105 రోజుల బిగ్ బాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చాడు. "టైటిల్ వరకు వెళ్లి రన్నరప్ గా రావడం ఎలా ఉందని" అరియానా అడిగిన ప్రశ్నకి శన్ముఖ్ జస్వంత్ తాను ముందే రన్నరప్ అవుతానని ఊహించినట్టు తెలిపాడు. ఇక 11వ వారం వరకు బిగ్ బాస్ విజేతగా నిలుస్తానని నమ్మకం ఉండేదని కాని ఆ వారంలో సిరి హనుమంత్ తో జరిగిన గొడవ వల్ల కొంతవరకు లో గా ఫీల్ అయ్యానని ఆ తరువాత టైటిల్ గెలవడం కష్టమేనని అనిపించినదన్నాడు.

ఇక అభిమానులకు నచ్చడం వల్లనే తాను రన్నరప్ గా ఉన్నానని చెప్పిన శన్ముఖ్ జస్వంత్ హౌస్ లో నేను నాలాగే ఉన్నానని తెలిపాడు. సిరి హనుమంత్ తో కలిసి ఉండటం నన్ను ఎక్కడో తగ్గిస్తుందని అనుకున్నానని కాని ఫేక్ గా ఉండలేను కాబట్టి తప్పలేదన్నట్లుగా శన్ముఖ్ అన్నాడు. నాలుగు వారాలు కూడా నేను బిగ్ బాస్ హౌస్ లో ఉండలేనని మా నాన్న చెప్పాడని..ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే నేను కూడా 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉండగలుగుతానని అస్సలు అనుకోలేదని తెలిపాడు.

ఇక బిగ్ బాస్ హౌస్ లోకి సిరి హనుమంత్ తల్లి వచ్చి మా హగ్గుల గురించి మాట్లాడినపుడు అరే ఏంట్రా అన్న ఫీలింగ్ అనిపించిందని శన్ముఖ్ చెప్పుకొచ్చాడు. ఇంటికి వెళ్ళాక దీప్తి రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పావా అని అరియానా అడిగిన ప్రశ్నకి శన్ముఖ్ నవ్వుతూ.. మాములుగానే నాపై అలుగుతుందని.. తాను ఏమనుకుంటుందో వెళ్తే గాని తెలియాలన్నాడు. 5 ఏళ్ళ రిలేషన్ లో దీప్తితో గొడవ అయినప్పుడు 2,3 నెలలు మాట్లాడుకోకుండా ఉంటామని చెప్పుకొచ్చాడు.

ఇక సిరి హనుమంత్ వల్ల తప్ప సన్నీతో నాకు ఎప్పుడు గొడవ జరగలేదని.. టాప్ 5 లో విజె సన్నీ ఉంటాడని ముందే అనుకున్నాను కాని విన్నర్ అవుతాడని మాత్రం ఊహించలేదని చెప్పాడు. సిరి హనుమంత్ గురించి మాట్లాడుతూ "సిరి నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడంతో పాటు సిరి హనుమంత్ కి నా ఫ్యాన్స్ వల్ల 50 శాతం ఓట్లు పడొచ్చని శన్ను తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సిరికి కనెక్ట్ అవడం వల్లే టైటిల్ ని కోల్పోయి రన్నరప్ గా నిలిచానని శన్ముఖ్ జస్వంత్ తన మనసులోని మాట బయటపెట్టాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story