BB5 Telugu: నన్ను, నా కూతురిని ట్రోల్ చేస్తున్నారు.. యాంకర్ రవి భార్య ఆవేదన

Sandeep Reddy
Published on: 21 Nov 2021 2:06 PM IST
Bigg Boss 5 Telugu Contestant Ravi Wife Nithya Hurts About Trolling in Social Media
X

నన్ను, నా కూతురిని ట్రోల్ చేస్తున్నారు.. యాంకర్ రవి భార్య ఆవేదన

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్ యాంకర్ రవిని కొంతమంది సోషల్ మీడియాలో కావాలనే ట్రోల్ చేస్తున్నారని అతని సన్నిహితులు చెబుతున్నారు. బుల్లితెరపై వచ్చే రియాలిటీ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ సహజమే కాని వాటికి కొన్ని హద్దులు ఉంటాయి. తమకి నచ్చిన ఇంటి సభ్యుడిని పొగడటానికి మరొకరిని తక్కువ చేసి మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు ఒకవేళ అలా చేసిన గేమ్ లో భాగంగా తమకి నచ్చని ఆ కంటెస్టెంట్ ని తిట్టినా పర్లేదు కాని.. వారి కుటుంబ సభ్యులను ఈ విషయంలోకి లాగి అనవసరమైన కామెంట్స్ చేయడం మాత్రం మంచి పద్ధతి కాదనే చెప్పాలి.

తాజాగా ఇదే విషయంపై స్పందించిన యాంకర్ రవి భార్య నిత్య మాట్లాడుతూ కావాలనే కొంతమంది సోషల్ మీడియాలో నా పేరును, నా కూతురు పేరును తీసుకొస్తూ ట్రోల్ చేస్తున్నారని.., ఇలా చేయడం క్రీడాస్ఫూర్తి అనిపించుకోదని అసలు ఎందుకు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారో కూడా అర్ధం కావట్లేదని రవి భార్య నిత్య బాధ పడింది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో తన మైండ్ గేమ్ తో ఆడుతూ కొన్ని సందర్భాలల్లో ఇంటి సభ్యుల గురించి ముందు ఒకలాగా.., వెనుక ఒకలాగా అనవసరంగా మాట్లాడిన అది గేమ్ వరకే చూడాలి తప్ప ఆ గేమ్ తో ఎలాంటి సంబంధం లేని ఆ కంటెస్టెంట్ ఇంటి సభ్యులను ట్రోల్ చేసేవరకు వెళ్ళడం సరైనది కాదు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story