BB5 Telugu Highlights: ఆవేశంలో శన్ముఖ్, జెస్సీ.. ఆలోచించి మాట్లాడుమన్న శ్రీరామ్

BB5 Telugu Highlights: బిగ్ బాస్ సీజన్ 5 అయిదో వారం నామినేషన్ లు సీక్రెట్ గా మొదలై సీరియస్ గా ముగిశాయి.

Sandeep Reddy
Updated on: 5 Oct 2021 12:28 PM IST
Bigg Boss 5 Telugu 4th October 2021 Episode Highlights | Bigg Boss 5 Updates
X

BB5 Telugu Highlights: ఆవేశంలో శన్ముఖ్, జెస్సీ.. అలోచించి మాట్లాడుమన్న శ్రీరామ్

BB5 Telugu Highlights: బిగ్ బాస్ సీజన్ 5 అయిదో వారం నామినేషన్ లు సీక్రెట్ గా మొదలై సీరియస్ గా ముగిశాయి. నామినేషన్ కి ముందు సిరి హనుమంత్, షణ్ముఖ్ జశ్వంత్ మాట్లాడుకుంటూ నాలుగో వారం నామినేషన్ లో అందరికంటే ఎక్కువ ఓట్లు నీకే వచ్చాయని తనకి అనిపిస్తుందని శన్ముఖ్ అనడం.. అందుకు సిరి కూడా నిజమే కావొచ్చని ఒక చిన్న నవ్వుతో అతడికి సమాధానం చెబుతుంది..

నాగార్జున చెప్పినట్టు ఒక దగ్గర కూర్చొని కబుర్లు చెప్పకుండా నీ గేమ్ నువ్వు ఆడాలని శన్ముఖ్ సిరికి చెబుతాడు.. ఆ తరువాత శ్వేత వర్మ, జెస్సి, శన్ను ఒక గ్రూప్ గా.., అర్జె కాజల్, మానస్ ఒక గ్రూప్ గా కూర్చొని ఈ వారం ఎవరిని నామినేట్ చేయాలో అని మాట్లాడుకుంటారు. ఇక నామినేషన్ ప్రక్రియని ప్రారంభించిన బిగ్ బాస్ మునుపటిలా ఇంటి సభ్యులను ప్రత్యక్షంగా నామినేషన్ చేయకుండా.. కన్ఫేషన్ రూమ్ కి ఒక్కొక్కరిని పిలిచి ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో ఇద్దరి పేర్లను చెప్పాలని బిగ్ బాస్ జెస్సి నుండి నామినేషన్ ప్రక్రియని మొదలుపెట్టాడు. ఇంటి సభ్యులు ఎవరు ఎవరిని నామినేట్ చేశారనే వివరాల్లోకి వెళితే..

జెస్సి - రవి, లోబో

సన్నీ - ప్రియ, శన్ముఖ్

విశ్వా - జెస్సీ, శన్ముఖ్

కాజల్ - రవి, సన్నీ

లోబో - శన్ముఖ్, మానస్

రవి - జెస్సి, శన్ముఖ్

ప్రియాంక - హమీదా, లోబో

సిరి - రవి, హమీదా

ఆని - రవి, విశ్వా

శన్ను- విశ్వా, మానస్

హమీదా - ప్రియ, శన్ముఖ్

శ్వేతా - కాజల్, మానస్

ప్రియ - శన్ముఖ్, సన్నీ

మానస్ - జెస్సి, శన్ముఖ్

శ్రీరాం - జెస్సి, శన్ముఖ్

నామినేషన్ పూర్తైన తర్వాత బిగ్ బాస్ ఈ వారం నామినేట్ అయిన ఒక్కో ఇంటి సభ్యున్ని పిలిచి ఎవరు వాళ్ళను నామినేట్ చేశారో ఇంటి సభ్యుల ముందు రివీల్ చేస్తాడు. ఐదో వారం నామినేషన్ లో ఎక్కువ మంది ఇంటి సభ్యులు శన్ముఖ్ జస్వంత్ ని నామినేట్ చేయగా ఇక వరుసగా యాంకర్ రవి, జెస్సి, లోబో, విశ్వ, మానస్, సన్నీ, ప్రియలు ఈ వారం నామినేట్ అయ్యారు.

నాలుగు వారాల తర్వాత మొదటిసారి నామినేట్ లో నిలిచిన శన్ముఖ్ ఈరోజు నుండి మనం అంటే ఏంటో చూపిద్దామని జెస్సితో మాట్లాడుకోవడం.. ఆ తరువాత ఒక సందర్భంలో కిచెన్ లో పని చేయాల్సిన విషయంలో కెప్టెన్ శ్రీరామచంద్రతో జెస్సి అనవసరంగా గొడవపడటం జరుగుతుంది. అయితే అక్కడ జరిగిన విషయం తెలియని శన్ముఖ్, ఆర్జే కాజల్, సిరి హనుమంత్.. కెప్టెన్ శ్రీరామచంద్రతో మాట్లాడిన తీరు ఇంటి సభ్యులకు కూడా కోపం తెప్పించింది.

నాలుగు వారాల వరకు సైలెంట్ గా ఉన్న శన్ముఖ్ ఈసారి నామినేషన్ లోకి వచ్చేసరికి ఆవేశంతో ఆలోచన లేకుండా అసలు విషయం తెలియక మాట్లాడాడని అతనికి జెస్సికి మధ్య జరిగిన సంభాషణతో అర్ధమవుతుంది. ఇప్పటికే పలువురు హౌస్ మేట్స్ ఇంట్లో చిన్నపిల్లోడిలా జెస్సి ప్రవర్తిస్తాడని చెప్పినట్టుగానే సోమవారం కూడా తను మాట్లాడిన మాటలకు, తన తోటి సభ్యులతో ప్రవర్తించిన తీరు చూస్తే పిల్లాడిలాగే ప్రేక్షకులకు సోమవారం ఎపిసోడ్ లో కనిపించింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story