Bigg Boss 5 Telugu Updates : మంచోడు అంటూనే సన్నీని ముంచేశారా..!!

Bigg Boss 5 Telugu 30th September 2021 Episode Highlights | Bigg Boss 5 Updates
x

మంచోడు అంటూనే సన్నీని ముంచేశారా..!!

Highlights

* గురువారం బిగ్ బాస్ 5 తెలుగు ఎపిసోడ్ హైలైట్స్

BB5 Updates: బిగ్ బాస్ సీజన్ 5 గురువారం ఎపిసోడ్ బాహుబలి - కట్టప్ప మధ్య జరిగిన వెన్నుపోటు సన్నివేశాన్ని గుర్తుచేసింది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఒక్కో టాస్క్ లో గెలిచి సన్నీ-మానస్, శ్రీరామచంద్ర-హమిదా, విశ్వా - యాంకర్ రవి ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. గురువారం ఎపిసోడ్ లో పవర్ బటన్ నొక్కిన శ్వేతావర్మ - ఆనీ మాస్టర్ జంట రోప్ టాస్క్ కి తమ ప్రత్యర్ధిగా శన్ముఖ్ జస్వంత్ - సిరి హనుమంత్ లను ఎంపిక చేసుకొని ఆ రోప్ టాస్క్ లో గెలిచి శ్వేతావర్మ జంట విజేతగా నిలుస్తారు.

ఆ గేమ్ తో బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ముగియడంతో ఇంటిసభ్యులలో అందరికంటే ఎక్కువగా బరువు తగ్గిన జంటలలో మొదటి స్థానంలో సన్నీ - మానస్, రెండో స్థానంలో శ్రీరామచంద్ర - హమిద, మూడో స్థానంలో శ్వేతావర్మ - ఆనీ మాస్టర్ లు నిలుస్తారు. బిగ్ బాస్ మూడు జంటలో నుండి ఒక్కోకరిని మాత్రమే కెప్టెన్ రేసులో నిలబడాలని ఆదేశించడంతో సన్నీ, శ్రీరామచంద్ర, శ్వేతవర్మలు "కత్తులతో సావాసం" టాస్క్ కి సిద్ధమవుతారు. ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు ఎవరైతే కెప్టెన్ గా వద్దనుకుంటున్నారో అతనికి కత్తి పొడిచి కారణం చెప్పాల్సి ఉంటుంది. ఈ టాస్క్ తో బిగ్ బాస్ ఇంటి సభ్యుల రకరకాల మనస్థాత్వాలు బయటపడ్డాయి.

బుధవారం వరకూ బిగ్ బాస్ హౌస్ లో సన్నీ మంచోడు మంచోడు అని చెప్పిన సభ్యులే అతడిని కెప్టెన్ గా వద్దు అంటూ విచిత్ర కారణాలతో కత్తిపోట్లు పొడిచారు. ఇక సన్నీని కత్తితో పొడిచిన ఇంటి సభ్యుల విషయానికొస్తే.. మొదటి నుండి సేఫ్ గేమ్ ఆడుతున్నావు.. నాతో సరిగ్గా మాట్లాడట్లేదు.. కలవట్లేదు అంటూ నామినేషన్ లో చెప్పిన కారణాలనే అటుతిప్పి ఇటుతిప్పి పండుగ రోజు కూడా పాత చింతకాయ పచ్చడే అన్నట్టు మరోసారి పాతకారణాన్నే చెప్పి కత్తిపోటు పొడిచింది ప్రియ. యాంకర్ రవి కమాండింగ్ గా ఉండాలని.. అది నువ్వు చేయలేవని ఒక సిల్లీ కారణం చెప్పడం.., లోబో అసలు చెప్పడానికి ఏ కారణం లేదు అంటూనే కత్తిపోటు పొడవడం జరిగింది.

ఇక శన్ముఖ్ జస్వంత్ ఈ టాస్క్ జరుగుతున్న సమయంలో సన్నీని కెప్టెన్ గా చూడాలని ఉంది అని చెప్పితీరా సమయానికి సన్నీవద్దంటూ మరో కారణం చెప్పి చేసిన కత్తిపోటు తరువాత అందరు అనుకున్నట్లుగానే సిరి హనుమంత్ కూడా శన్ముఖ్ జస్వంత్ ని ఫాలో అయి సన్నీని ఫేక్ స్మైల్ అంటూ టార్గెట్ చేయడం.. ఆ తరువాత సన్నీ మంచోడే కాని ఇంతటితో సన్నీకి తనకి మధ్య జరిగిన అన్నింటికీ ఫుల్ స్టాప్ పడుతుందని సిరి హనుమంత్ ఇంటి సభ్యులతో చెప్పడంలోని ఆమె మాటల తేడాని, ప్రవర్తనని ప్రేక్షకులు గమనించారు.

విశ్వా.. మొదటి రెండు వారాలలో ఆటలో.. మాటలో చూపిన పెర్ఫార్మన్స్ చివరి రెండు వారాల్లోకి వచ్చే సరికి అటు ఆటలో ఆవేశం తగ్గి.., మాటల్లో పెరిగినట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ముగ్గురు ఇంటి సభ్యులు చెప్పిన ప్రకారం శన్ముఖ్ జస్వంత్ - సిరి హనుమంత్ లు కలిసి ఆడుతున్నారని, ఒకరులేకపోతే మరొకరు ఒంటరిగా ఆడలేరని చేసిన కామెంట్స్ ని నిజం చేస్తున్నట్లుగానే సిరి ప్రతిసారి శన్ముఖ్ పక్కనే ఉండటం, మాట్లాడిన, ఏడ్చినా శన్ను ఏమనుకుంటాడో అని ఫీల్ అవడం చూస్తే సిరి హనుమంత్ అసలు బిగ్ బాస్ హౌస్ కి టైటిల్ కోసం వచ్చిందో.. శన్ను కోసం వచ్చిందో అర్ధంకాక ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు.

ఇలా ఇంటి సభ్యులలో చాలావరకూ సన్నీని కెప్టెన్ గా వద్దునుకోని కత్తిపోటు పొడిచినా ఈ వారానికి సన్నీ బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ కాలేకపోయిన గురువారం ఎపిసోడ్ ని చూసిన ప్రేక్షకుల మనసులో మాత్రం అతడు మంచి స్థానాన్ని పొందాడనే అర్ధం అవుతుంది. గురువారం ఎపిసోడ్ లో శ్రీరామ చంద్ర కెప్టెన్ గా గెలువగా హమిదా రేషన్ మేనేజర్ గా ఎంపిక అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories