BB5 Updates: బరాబర్ గా మొదలై మునుగుతూ తేలుతూ ముగిసిన వీకెండ్ ఎపిసోడ్..!!

* ప్రోమోలో ఉన్న ఫైర్ ఎపిసోడ్ లో మిస్ అయిందా..!?

Sandeep Reddy
Updated on: 3 Oct 2021 1:43 PM IST
Bigg Boss 5 Telugu 2nd October 2021 Episode Highlights | Bigg Boss 5 Updates
X

BB5 Updates: బరాబర్ గా మొదలై మునుగుతూ తేలుతూ ముగిసిన వీకెండ్ ఎపిసోడ్..!!

BB5 Updates: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 శనివారం ఎపిసోడ్ ప్రోమోలో చూపించినంత ఫైర్ లేకపోగా ఇంటి సభ్యుల విషయంలో నాగార్జున బరాబర్ మాట్లాడలేదని ప్రేక్షకులకు కనిపించింది. ఇక శనివారం ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే రోజులాగే సిరి హనుమంత్ షణ్ముఖ్ జస్వంత్ వెంటే ఉండటం.. తను సరిగ్గా మాట్లాడకపోతే ఏడుస్తూ తన బాధని ఆర్జె కాజల్ కి చెప్పడం శనివారం ఎపిసోడ్ లో కూడా యధావిధిగా జరిగిపోయింది. ఒకవైపు సిరి హనుమంత్ ని షన్ను ఎంతగా దూరం పెట్టాలని ప్రయత్నించిన చివరికి నాగార్జున ముందు వచ్చేసరికి ఇద్దరూ పక్కపక్కనే ప్రేక్షకులకు దర్శనం ఇచ్చారు.

నామినేషన్ లో ఉన్న ఎనిమిది మంది ఇంటి సభ్యులలో మొదటగా యాంకర్ రవి సేఫ్ అవగా ఆ తరువాత ప్రియ, అర్జె కాజల్, సన్నీలు శనివారం ఎపిసోడ్ లో సేఫ్ అయి ఈ వారం ఎలిమినేషన్ నుండి బయటపడ్డారు. ఇక నాగార్జున ఇంటి సభ్యులు ఈ వారం ఎవరు తప్పు చేశారని భావిస్తే లేచి నిలబడి ఆ కారణాన్ని చెప్పాలని అనడం.. అందుకు ఎవరు తప్పు చేయలేదని భావించి ఎవరు నిలబడకపోవడం.. ఆ తరువాత మరొకసారి నాగార్జున అడిగేసరికి జెస్సి నిలబడి తాను హౌస్ కెప్టెన్ గా తన పనులను సరిగ్గా నిర్వర్తించలేకపోయానని తన తప్పును నాగ్ ముందు ఒప్పుకుంటాడు.

లోబో ఈ వారం నామినేషన్ ప్రక్రియ సమయంలో ప్రవర్తించిన తీరుకు నాగార్జున ఆగ్రహం అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ ఇంట్లో అందరూ సమానమేనని ఇక్కడ విల్లా, బస్తీ అంటూ ఎలాంటి తేడాలు లేవని ఎవరి ఆట వాళ్లు సరిగ్గా ఆడాలని.. అలాగే ఎదుటివారితో మాట్లాడే సమయంలో గొంతు చించుకొని అరవాల్సిన అవసరం లేదంటూ లోబోతో పాటు ఇంటి సభ్యులను హెచ్చరిస్తాడు నాగ్.

కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇచ్చిన "నెగ్గాలంటే తగ్గాల్సిందే" టాస్క్ లో బరువు తగ్గిన జంటలకు చిన్న గిఫ్ట్ ఇస్తూ సర్ ప్రైస్ చేసిన నాగ్.. ఈ టాస్క్ లో సన్నీ- మానస్ జంటని అందరికంటే ఎక్కువగా బరువు తగ్గారని పొగుడుతూనే వారిద్దరికీ మూడవ స్థానం ఇవ్వడానికి గల కారణం మాత్రం ప్రేక్షకులకు అర్ధం కాలేదు.

బిగ్ బాస్ హౌస్ లో అందరు సమానం అంటూనే సన్నీ - మానస్ జంట విషయంలో బరాబర్ న్యాయం ఎందుకు చేయలేదో అని సోషల్ మీడియాలో నాగార్జునపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఆదివారం ఎపిసోడ్ లో యనీ మాస్టర్, సిరి హనుమంత్, నటరాజ్ మాస్టర్ తో పాటు లోబోలలో నుండి డేంజర్ జోన్ నుండి బయటపడి ఎవరు సేఫ్ అవుతారో.. ఎవరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ ను విడిచి వెళ్ళిపోతారో తేలనుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story