BB 5 Updates: ఆటతో అలరించి.. మాటలతో మురిపించిన సన్నీ - మానస్

* బుధవారం జరిగిన ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచిన సన్నీ - మానస్ జంట

Sandeep Reddy
Updated on: 30 Sept 2021 9:14 AM IST
Bigg Boss 5 Telugu 29th September 2021 Episode Highlights | Bigg Boss 5 Updates
X

సన్నీ - మానస్ (ఫోటో: స్టార్ మా)  

BB 5 Updates: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 బుధవారం జరిగిన గెలవాలంటే తగ్గాల్సిందే కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు ఒక్కో జంట ఒక్కో రకంగా వర్క్ అవుట్ చేస్తూ కనిపించింది. ఇందులో ముఖ్యంగా సన్నీ- మానస్ లు అర్ధరాత్రి వరకూ సరదాగా మాట్లాడుకుంటూ నడుస్తూ బరువు తగ్గడానికి తమవంతు కష్టపడ్డారు.

ఇక ఆకలితో ఉన్న వాళ్ళు బయటి నుండి ఎవరైనా ఒక బిర్యానీ ప్యాకెట్ ఉండే హౌస్ లోకి వెయ్యండి అంటూ వారిద్దరి మధ్య జరిగిన కామెడీ సంభాషణ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే బిగ్ బాస్.. హౌస్ లో ఉన్న మొత్తం ఫుడ్ ని తీసుకెళ్ళడంతో ఆకలితో అలమటిస్తున్న ఇంటి సభ్యులలో అన్నం విలువ తెలియజేస్తూ విశ్వ, లోబో, నటరాజ్ మాస్టర్, యాంకర్ రవి చేసిన స్కిట్ బుధవారం ఎపిసోడ్ లో మనం చూడవచ్చు.

ఇక ఇంటి సభ్యులలో కొందరు ఫుడ్ విషయంలో బిగ్ బాస్ నియమాలను అతిక్రమించడం వలన తన పనిలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ప్రస్తుతం ఇంటి కెప్టెన్ గా ఉన్న జెస్సీతో పాటు అతనికి జంటగా ఉన్న ఆర్జే కాజల్ ని ఈ వారం కెప్టెన్సీ టాస్క్ నుండి పక్కనపెట్టడంతో ఇంటి సభ్యులపై జెస్సీ తన కోపాన్ని చూపడంతో పాటు తన వల్లే ఈ తప్పు జరిగినందుకు ఆర్జే కాజల్ కు జెస్సీ క్షమాపణలు చెబుతాడు.

బజర్ సౌండ్ రాగానే పవర్ బటన్ ని విశ్వా టచ్ చేయడం.. వారికి ప్రత్యర్ది జంటగా ప్రియ - ప్రియాంక సింగ్ లను ఎంపిక చేసుకొని వారిపై విశ్వ - యాంకర్ రవి జంట టాస్క్ లో గెలుపొందుతారు.

మరోపక్క నామినేషన్ ప్రక్రియ రోజు నుండి యాంకర్ రవి వల్ల నేను ఏదో రకంగా మారుతున్నానని చెబుతూ వస్తున్న శన్ముఖ్ జశ్వంత్ బుధవారం ఎపిసోడ్ లో కూడా యాంకర్ రవితో అదేమాట చెబుతాడు.

ఫుడ్ లేక ఆకలితో ఉన్న లోబో కిచెన్ లోని వేస్టేజ్ లో ఏదైనా ఫుడ్ దొరుకుతుందో అని వెతకడం చూసి ఇంటి సభ్యులు షాక్ అవుతారు.

ఆ తరువాత పవర్ బటన్ నొక్కిన విజె సన్నీ.. తమకు పోటీగా నటరాజ్ మాస్టర్ - లోబోలను ఎంచుకుంటారు. మునుగుతుందా.. తెలుతుందా టాస్క్ లో సన్నీ - మానస్ జంట గెలవడంతో కెప్టెన్సీ టాస్క్ లో పోటీదారులుగా శ్రీ రామచంద్ర - హమిదా, విశ్వా- యాంకర్ రవితో పాటు ముందంజలో నిలిచారు.

చివర్లో బిగ్ బాస్ ఇంటి సభ్యుల కోసం మటన్ బిర్యానీ పంపడం ఆ బిర్యానీని మానస్ - సన్నీ, శన్ముఖ్, శ్రీరామచంద్ర జంటలు తినకుండా బరువు తగ్గడం కోసం పడే కష్టాలు.., సన్నీ హమిదా మధ్య జరిగే సరదా సంభాషణ బుధవారం ఎపిసోడ్ లో ప్రేక్షకులను మెప్పించాయి. మొత్తంగా చూసుకుంటే బుధవారం ఎపిసోడ్ లో మానస్ - సన్నీ అటు మాటలతోను..ఇటు ఆటతోనూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొని హైలైట్ గా నిలిచారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story