BB 5 Telugu: సింహం vs గుంటనక్క., బస్తీ vs విల్లా అంటూ సాగిన నామినేషన్ ప్రక్రియ

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ (ఫోటో: స్టార్ మా)
* హాట్ హాట్ గా సాగిన బిగ్ బాస్ 5 తెలుగు సోమవారం నామినేషన్ ప్రక్రియ
BB 5 Telugu Highlights: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగింది. బిగ్ బాస్ ఇంటి సభ్యులు సోమవారం నామినేషన్ లో భాగంగా ఎక్కువ మంది లోబో, నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేశారు. మొదటగా నామినేషన్ ప్రకియని ప్రారంభించిన ప్రియ.. సన్నీ సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తుందనే కారణంతో నామినేట్ చేయగా, లోబోని తనతో సరిగ్గా మాట్లాడట్లేదని నామినేట్ చేసింది. ఆ తరువాత లోబో.. ప్రియ నా ఫస్ట్ లవ్ గురించి చెప్పిన సందర్భంలో సినిమా స్టొరీలా ఉందే అంటూ ఎగతాళిగా మాట్లాడిందని తన 14ఏళ్ళ ప్రేమ నిజమని అలా మాట్లాడటం నాకు నచ్చలేదని ప్రియ పైకి గట్టిగా అరుస్తూ ఫైర్ అయ్యాడు. ఆ కోపంలో మొదట జనాల వల్లనే ఈ స్థాయికి వచ్చాను అంటూనే ఒక సందర్భంలో "ఐ డోంట్ కేర్ విత్ జనాలు" అంటూ నోరుజారి ప్రియని నామినేట్ చేశాడు.
ఇక సిరి హనుమంత్ ని ఆర్జే కాజల్ తన లవ్ స్టొరీ చెప్తున్న సమయంలో వెటకారంగా నాకు ఆకలి అవుతుందని చెప్పినట్లు భావించిన లోబో ఆ విషయంలో సిరి హనుమంత్ ని నామినేట్ చేశాడు. ఇక ఆ తరువాత యాంకర్ రవి తాను తలెత్తుకోడానికి కూడా సిగ్గుపడుతున్నానని, నా మాటల వల్ల బాధపడిన ముగ్గురుకి క్షమాపణ చెప్పాలని ప్రియ, లహరి షరి తో పాటు తన తల్లికి క్షమాపణలు చెప్పి బాధపడ్డాడు. యాంకర్ రవి నటరాజ్ మాస్టర్ తో జరిగిన సంభాషణలో గుంట నక్క ఎవరూ అని అడగగా నీకు తెలుసుకదా ఎవరో అంటూ కాస్త వారిద్దరి మధ్య మాటల యుద్ధం నడించింది.
మరోపక్క విశ్వ.. నటరాజ్ మాస్టర్ మధ్య సింహం, పిల్లి అంటూ డైలాగ్ వార్ నడిచింది. విశ్వా నామినేషన్ రోజు పిల్లిలా నామినేట్ చెయ్యొద్దు అంటూ తన వద్దకు వస్తాడని.. తాను సింహాన్ని అంటూ "సింహంతో వేట.. నాతో ఆట కష్టం" అంటూ సినిమా డైలాగ్స్ తో తన అత్యుత్సాహాన్ని ప్రదర్శించినట్లు కనిపించింది. శన్ముఖ్ జస్వంత్ లోబోని నామినేట్ చేయగా మరోసారి వీరిద్దరి మధ్య చిన్నపాటి మాటలయుద్ధం జరిగింది. నేను బస్తీ.. నువ్వు విల్లా అన్నట్లుగా సాగిన సంభాషణలో శన్ముక్ అందరం కష్టపడే వచ్చాము ప్రతిసారి మనం ఎక్కడి నుండి వచ్చామనే విషయం చెప్పుకోవాల్సిన అవసరం లేదు లోబో అంటూ తన స్టైల్ లో శన్ముఖ్ సమాధానం ఇచ్చాడు.
ఎవరు ఊహించని విధంగా శన్ముఖ్ యాంకర్ రవి వల్ల ఏదో ఒక రకంగా తనకు తాను మారిపోతున్నానని ఫీల్ అయి నామినేట్ చేశాడు. ఇలా ఒకరిపై ఒకరు రకరకాల కారణాలు చెప్తూ నామినేషన్ ప్రక్రియని ముగించారు. ఇక సోమవారం నటరాజ్ మాస్టర్, లోబో, యాంకర్ రవి, సన్నీ, ఆర్జే కాజల్, ఆనీ మాస్టర్, సిరి హనుమంత్, ప్రియలు నామినేషన్ లో ఉన్నారు. ఈ వారం ఓటింగ్ లో గెలిచి బిగ్ బాస్ హౌస్ లో నిలిచేది ఎవరో..ఓడి బిగ్ బాస్ హౌస్ ని విడిచేది ఎవరో తెలియాలంటే ఈ ఆదివారం వరకు వేచిచూడాల్సిందే.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
YV Subba Reddy: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనం అయ్యే వరకు ఓపికతో...
29 May 2022 10:59 AM GMTAxis Bank: యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకి బ్యాడ్‌న్యూస్.. జూన్ 1...
29 May 2022 10:30 AM GMTSeediri Appalaraju: టీడీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారు
29 May 2022 10:00 AM GMTపెద్దపల్లి జిల్లా RFCLకి కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు
29 May 2022 9:40 AM GMTPakistani Drone: సరిహద్దులో అనుమానాస్పద డ్రోన్.. కూల్చేసిన భద్రతా...
29 May 2022 9:06 AM GMT