BB5 Telugu: ఆవేశంతో ఊగిపోయిన నటరాజ్ మాస్టర్.. ఆటతో ఆకట్టుకున్న సన్నీ

* బిగ్ బాస్ సీజన్ 5 శుక్రవారం ఎపిసోడ్ హైలైట్స్

Sandeep Reddy
Updated on: 25 Sept 2021 1:58 PM IST
Bigg Boss 5 Telugu 25th September 2021 Episode Highlights | Bigg Boss 5 Updates
X

 బిగ్ బాస్ తెలుగు సీజన్ 5(ఫోటో: స్టార్ మా) 

BB5 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో నటరాజ్ మాస్టర్ ని తన సతీమణి నీతూ శ్రీమంతం వీడియోతో బిగ్ బాస్ సర్పైస్ ఇచ్చాడు. ఆ వీడియో చూసిన నటరాజ్ మాస్టర్ తో పాటు ఇంటి సభ్యులు కూడా భావోద్వేగానికి గురైయ్యారు. అటు లోబోతో పాటు విశ్వా తన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకొని కంటతడి పెట్టుకున్నారు.

అంతకు ముందు బిగ్ బాస్ లక్సరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా నటరాజ్ మాస్టర్ విశ్వా ఒక్కడినే మొదట టాస్క్ ఆడాలంటూ సపోర్ట్ చేయడం ఆ టాస్క్ లో విశ్వా విఫలం అవడంతో ఆ తరువాత విజే సన్నీ, రవి, ఆనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్ మధ్య జరిగిన సంభాషణలో సన్నీపై సూటిపోటి మాటలతో తన ఆవేశాన్ని నటరాజ్ మాస్టర్ పరోక్షంగా చూపించిన సందర్భంలోనూ సన్నీ సంయమనం పాటించి తన ఆటతోనే నటరాజ్ మాస్టర్ కి సమాధానం ఇచ్చాడు. లక్సరీ బడ్జెట్ టాస్క్ లో సన్నీ అద్భుత ప్రదర్శన కనబరచగా, యాంకర్ రవి, శ్రీరామచంద్ర, శన్ముక్ జస్వంత్ లు ఫర్వాలేదనిపించారు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఆటలో పార్టిసిపేట్ చేయక, చేసేవాళ్ళని చేయనీయకుండా ఆట ముగిసిన తరువాత అందరికి మినిమం కామన్ సెన్స్ గురించి క్లాసులు పీకే నటరాజ్ మాస్టర్ పై ఉన్న ఇంటి సభ్యులకు ఉన్న కొద్దిపాటి రిలేషన్ రోజురోజుకు కూడా తగ్గిపోతుందని చెప్పడానికి రవి, సిరి హనుమంత్, జస్వంత్, ఆర్జే కాజల్ మధ్య సంభాషణతో పాటు సన్నీ, జెస్సీ, ప్రియ మాట్లాడుకున్నదాన్ని బట్టి అర్ధమవుతుంది. ఇక హౌస్ లో వరస్ట్ పెర్ఫర్మార్ గా మానస్ కు ఎక్కువ ఓట్లు రావడంతో బిగ్ బాస్ ఆదేశంతో జైలుకు వెళ్తాడు. ఆ తరువాత ఒకపక్క ప్రియాంక సింగ్, మానస్ మధ్య ఒక ట్రాక్, హమిదా, శ్రీరామచంద్ర మధ్య మరో లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు వారి మాటల్లోనే అర్ధం అవుతుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story