BB5 Telugu: సిరితో శన్ముఖ్ కట్.. సిరి హనుమంత్ హర్ట్

* బిగ్ బాస్ 5 తెలుగు గురువారం ప్రోమో విడుదల

Sandeep Reddy
Updated on: 23 Sept 2021 4:43 PM IST
Bigg Boss 5 Telugu 22nd September 2021 Episode Highlights
X

బిగ్ బాస్ తెలుగు (ఫోటో: స్టార్ మా)

BB5 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 బుధవారం కెప్టెన్సి పోటీదారుల కోసం బిగ్ బాస్ ఇచ్చిన హైదరాబాదీ అమ్మాయి - అమెరికా అబ్బాయి టాస్క్ లో యాంకర్ రవికి బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ని రవి విజయవంతంగా పూర్తి చేయడంతో కెప్టెన్ గా పోటీదారునిగా నిలబడే అవకాశం ఉన్నట్లు తాజాగా గురువారం విడుదలైన ప్రోమోని చూస్తే అర్ధమవుతుంది. మ్యారేజ్ బ్రోకర్ క్యారెక్టర్ లో శన్ముఖ్ జస్వంత్ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

జెస్సీతో టాస్క్ మధ్యలో జరిగిన సంభాషణలో సిరి హనుమంత్ గురించి ప్రస్తావించిన శన్ముక్.. సిరి సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు అనిపిస్తుందని.. ముందులాగా తను యూనిక్ గా ఉండట్లేదని తన పక్కన బెడ్ నుండి కూడా మారాలని ఉందని చెప్పడంతో పాటు తనకి కొన్ని రోజులపాటు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు జెస్సీతో శన్ముఖ్ తన అభిప్రాయాన్ని పంచుకుంటాడు. ఇక గురువారం విడుదలైన ప్రోమో ప్రకారం యాంకర్ రవితో పాటు జెస్సి, శ్వేతావర్మ, శ్రీరామచంద్రలు స్విమ్మింగ్ పూల్ నుండి కెప్టెన్ అనే ఇంగ్లీష్ లెటర్స్ ని తీసుకొని పేర్చే విధంగా ఇచ్చిన "స్విమ్ జర స్విమ్" టాస్క్ లో పాల్గొనబోతున్నట్లు కనిపిస్తుంది.

ఇప్పటికే మనకు యాంకర్ రవి బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్ టాస్క్ విజయవంతంగా పూర్తిచేయడంతో కెప్టెన్ పోటీదారుడిగా ఎంపిక అయిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం ప్రోమోలో కనిపించినట్లు రవితో పాటు జెస్సి, శ్వేతావర్మ, శ్రీరామచంద్రలు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చినందుకు గాను కెప్టెన్ పోటీదారులుగా ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈవారం బిగ్ హౌస్ లో ఈ నలుగురిలో ఎవరో ఒకరు కెప్టెన్ గా ఎంపిక అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క శన్ముఖ్ జశ్వంత్ బుధవారం అనుకున్నట్లుగానే గురువారం ఎపిసోడ్ లో సిరి హనుమంత్ ని కాస్త దూరం పెట్టడానికి ప్రయత్నిచాడు.. దీంతో సిరి కన్నీరుమున్నీరవడం గురువారం ఎపిసోడ్ లో చూడబోతున్నాం.



Sandeep Reddy

Sandeep Reddy

Next Story