Bigg Boss 4 Telugu Winner: మాల్దీవ్స్ లో బిగ్ బాస్ ఫేం అభిజిత్

Bigg Boss 4 Winner: బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ మాల్దీవ్స్ లో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు.

Kranthi
Updated on: 9 March 2021 4:53 PM IST
Bigg Boss Telugu 4 Winner
X

ఇమేజ్ సోర్స్: ట్విట్టర్

Bigg Boss 4 Telugu Winner: బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ మాల్దీవ్స్ లో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలను అభిజిత్ తన ఇన్ట్సాగ్రామ్ లో పోస్టు చేశాడు. దీంతో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో సినీ, టీవీ సెలబ్రిటీల ప్రచారంతో మాల్దీవులకు వెళ్లే వాళ్ల సంఖ్య కూడా భారీగా పెరిగిది. అభిజిత్ సినిమా ఎపుడు వస్తుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అభిజిత్‌ మాత్రం పలు కారణాలు చెప్తూ తన దగ్గరకు వచ్చిన కథలను రిజెక్ట్‌ చేస్తున్నాడని సమాచారం. దీంతో ఫ్యాన్స్‌ కొంత నిరుత్సాహపడ్డారు. అయితే తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అభిజిత్‌ ఏకంగా నాగార్జునతో డీల్‌ కుదుర్చుకున్నాడట. అవును, నాగ్‌ సొంత సంస్థ‌ అన్నపూర్ణ స్టూడియోస్‌తో ఓ మూడు సినిమాలు చేసేందుకు అభిజిత్‌ సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎంత వరకు నిజమో కొన్ని రోజులు అయితే తేలిపోతుంది. ఈ లోగా మల్దీవ్స్ చుట్టేసే పనిలో పడ్డాడు అభిజిత్ ఆ వీడియోలు మీ కోసం...



Kranthi

Kranthi

Next Story