ఆసక్తికరంగా మారిన చివరి వారం ఎలిమినేషన్.. నో కాంప్రమైజ్ అంటున్న బోల్డ్‌ బేబీ

ఆసక్తికరంగా మారిన చివరి వారం ఎలిమినేషన్.. నో కాంప్రమైజ్ అంటున్న బోల్డ్‌ బేబీ
x
Highlights

బిగ్‌ బాస్‌ నాల్గో సీజన్‌కు ఇంకా పదిరోజులే టైం ఉంది. ఇదే చివరి ఎలిమినేషన్‌ అందుకే ఈ వారం నామినేషన్ ఘట్టం చాలా ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. ఒకరి...

బిగ్‌ బాస్‌ నాల్గో సీజన్‌కు ఇంకా పదిరోజులే టైం ఉంది. ఇదే చివరి ఎలిమినేషన్‌ అందుకే ఈ వారం నామినేషన్ ఘట్టం చాలా ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. ఒకరి బయటికి వెళ్లిపోగా ఎవరు టాప్‌5లో ఉంటారో అని ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అయితే ఈ చివరి రోజుల్లో ప్రేక్షకులకు మరింత కనెక్ట్‌ అయ్యేందుకు కంటెస్టెట్లతో బిగ్‌బాస్‌ గేమ్స్ అడిపిస్తున్నాడు. ఈ ఆటల్లో ఎవరికి ఎవరు తగ్గకుండా కంటెస్టెంట్లు రఫ్ఫాడిస్తున్నారు. ఇక మధ్య మధ్యలో ఇంటి సభ్యులకు డిష్యూం డిష్యూం అవుతోంది. ఇన్నాళ్లు ప్రేమలు కురిపించుకున్న వాళ్లు సైతం కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అంతా టైటిల్‌ మహిమ మరీ గురువారం బిగ్‌బాస్‌ హౌస్‌లో జరిగిన హంగామా.. హైరానా ఎంటో మన బిగ్‌బాస్‌ హైలైట్స్ లో తెలుసుకుందాం.

అధికారం.. ఓపిక అంటూ ఇంటిసభ్యులను పరీక్షపెట్టిన బిగ్‌బాస్‌ ఇప్పుడు ఏకాగ్రత టాస్క్‌ ఇచ్చారు. బిగ్‌బాస్‌ ఇచ్చిన పనిని చేస్తూ తోటి ఇంటిసభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ 30నిమిషాల సమయాన్ని గెస్‌ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో కూడా అరియానా దుమ్మురేపేసింది. ఆఖరి వారంలో తానే స్ట్రాంగ్ అంటూ నిరూపించుకుంది ఈ బోల్డ్‌ అమ్మాయి.

ఇంటిసభ్యుల ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రేక్షకులకు హింట్‌ ఇవ్వడానికి బిగ్‌బాస్‌ వారితో చిన్న చిన్న గేమ్స్ ఆడిస్తున్నాడు. అందులో భాగంగా ఏకాగ్రత టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్ బజర్‌ మోగగానే మోనాల్ ఆట మొదలుపెట్టేసింది. జీరాను కౌంట్‌ చేయడం, తొక్కతీయడం స్ట్రార్ట్ చేసింది. ఇక అభిజిత్, హారిక, అరియానా ఒక‌దానికొక‌టి సంబంధం లేని ప్రశ‌్నలు వేస్తుంటే చిలిపి సమాధానాలు చెబుతూ హౌస్‌లో నవ్వులు కురిపించింది మోనాల్. ఈ టాస్క్‌లో మోనాల్‌కు హెల్ప్‌ చేసేందుకు అఖిల్‌, సోహైల్‌ విశ్వప్రయత్నాలు చేశారు. మిగ‌తావాళ్లు ప‌సిగ‌ట్టారు. కానీ పాపం మోనాల్‌ పట్టుకోలేకపోయింది. చివరకు 30 నిమిషాల సమయాన్ని సరిగ్గా గెస్‌ చేయలేకపోయింది.

నెక్ట్స్ గేమ్ స్ట్రార్ట్ చేసిన అరియానా హడావుడి చేస్తూనే పర్ఫెక్ట్ పర్పామెన్స్ ఇచ్చింది. బట్టలు సర్దుతూ. తొక్క తీస్తూ ఇంటిసభ్యులు అడిగిన క్వచన్స్ కి అన్సర్స్‌ చెబుతూ 30మినెట్స్ టైంని ఓ మోస్తారుగా గెస్‌ చేసి ఈ బేబీ ది బెస్ట్ అనిపించుకుంది. అరియానా, హారిక టాస్కు పూర్తయ్యాక అభి రంగంలోకి దిగాడు. ఈ హౌస్‌లో శివగామి ఎవరూ.? అని హారిక వేసిన ప్రశ్నకు టపీమని అభి అన్సర్ ఇచ్చాడు. శివగామిలో అందం మోనాల్‌కు, టెర్రర్ అరియానాకు, ప్రేమ హారికకు ఉందంటూ ఒకేసారి ముగ్గురికి పులిహోరా కలిపేశాడు అభి.

ఇక టాస్క్‌లోకి వచ్చిన సోహైల్‌ తనకు కాబోయే భార్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పేశాడు. ఈయనగారి అవలక్షణాలన్ని భరించే లక్షణమైన అమ్మాయి కావాలంటా. ఎక్కడ ఎప్పుడు, ఎలా దొరుకుతుందో చూడాలి. ఈ టాస్క్‌లో ఎవ‌రూ స‌రిగ్గా స‌మ‌యాన్ని గెస్‌ చేయలేకపోయారు. అరియానా మాత్రం అందరికంటే బెటర్‌గా 37 నిమిషాలు గెస్ చేసి విన్నర్‌గా నిలిచింది. గోల్డెన్ మైక్ చేత ప‌ట్టుకొని మరోసారి ప్రేక్షకులతో ముద్దుగా మాట్లాడింది అరియానా. తనను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న అందరికి థ్యాంక్యూలు, ఐలవ్‌యూలు చెప్పేసింది.

ఫైట్‌ సీక్వెన్స్ ఆడిషన్స్ అంటూ బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు మరో ఫన్నీ టాస్క్‌ ఇచ్చారు. ఈ టాస్క్‌లో ఇంటిసభ్యులంతా ఎలాంటి గొడవలకు తావులేకుండా చాలా కూల్‌గా ఆట ముగించేశారు. అయితే జేమ్స్‌తో పోరాడాల్సిన ఫైట్‌ సీన్స్‌లో ఎవరు బెస్ట్‌ పర్ఫామెన్స్ ఇచ్చారో చెప్పాల్సిందిగా అభిజిత్‌కు అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఫస్ట్‌ రౌండ్‌లో హారిక, అఖిల్‌ జేమ్స్‌గా సోహైల్‌ జేమ్స్ కిల్లర్‌గా రంగంలోకి దిగారు. సోహైల్‌ జేమ్స్‌తో ఓ ఆటఆడుకొని చివరకు జేమ్స్ నోట్లో స్ప్రే చేసి, వాటిని చంపేశాడు.

ఇక జేమ్స్ ని చంపేందుకు అరియానా స్ర్పే చేతపట్టుకొని నానా అల్లరి చేసింది. తెగ అరుస్తూ ఎట్టకేలకు జేమ్స్‌ని చంపేసింది. తర్వాత జేమ్స్ అంతుచూడటానికి మోనాల్‌ చీపురు పట్టుకుంది. చీపురుతో జేమ్స్‌ను తరిమికొట్టింది. దొరికిందే చాన్స్ అంటూ అఖిల్‌ను కాలుతో తంతు పరుగెట్టించింది. మోనాల్ అల్లరి ఈ సందర్భంలో కాస్త చూడముచ్చటగా అనిపించింది. ఈ టాస్క్‌లో జడ్జిగా అభిజిత్‌ ఎవరూ ఊహించనట్టుగా సోహైల్‌ను విజేతగా ప్రకటించాడు. నిజానికి హౌస్‌లో సోహైల్‌కు అభికి అంతగా పొసగదు అని అందరికీ తెలిసిందే ఒక్కసారిగా సోహైల్‌ విజేత అని అభి ప్రకటించడంతో మిగితా ఇంటిసభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోహైల్‌ పర్ఫామెన్స్ తనకు నచ్చిందంటూ క్లారిటీ ఇచ్చాడు అభి.

గురువారం నాటి ఎపిసోడ్‌లో అరుచుకోవడాలు లేవు ఆవేశాన్ని ప్రదర్శించడాలు లేవు. కానీ అలక సీన్లు మాత్రం కావాల్సినన్ని కనిపించాయి. ఎవరిస్థాయిలో వారి అలక పాన్పు ఎక్కేశారు. టాస్క్‌ల తర్వాత అఖిల్‌-మోనాల్‌ మధ్య అఖిల్‌- సోహైల్‌ మధ్య సోహైల్‌ అరియానా మధ్య భారీ డిస్కషన్స్‌ జరిగాయి. మోనాల్‌ అఖిల్ మధ్య కామెడీగా ప్రారంభమైన కాన్వర్జేషన్‌ సీరియస్‌గా యూటర్న్‌ తీసుకుంది. పెద్ద రాద్దంతామే జరిగినా చివరకు రాజీకచ్చారు. ఇక అఖిల్‌ సోహైల్‌ కూడా సారీలు చెప్పుకొని కలిసిపోయారు. కానీ అరియానా సోహైల్‌ మధ్య సాగుతున్న వార్‌ మాత్రం అలానే కొనసాగుతోంది.

అఖిల్‌ వేరే అమ్మాయిలతో చనువుగా ఉంటున్నాడనే టాపిక్‌ను మోనాల్‌ తీసుకువచ్చింది. ఒక అమ్మాయితో కాకుండా ఎంతమందితో ఉంటారని క్వచన్‌ రేజ్‌ చేసింది. ఒక‌మ్మాయిని ఫ్రెండ్‌గా తీసుకుంటే త‌ప్పేమీ కాద‌ని అఖిల్ కవర్ చేస్తుండగా మధ్యలో పులిహోర అంటూ పాట అందుకున్నాడు సోహైల్‌. మోనాల్‌, అఖిల్‌ మధ్య ఫన్నీగా మొదలైన మాటలు వాదనలకు దారితీశాయి. రెస్పెక్ట్‌ ఎందుకు పొగొట్టుకుంటున్నావని మోనాల్‌ అనడంతో అఖిల్‌కు మండిపోయింది. కాస్త కోపగించుకోవడంతో మోనాల్‌ బాగానే హర్ట్‌ అయ్యింది.

వేరే అమ్మాయిలతో క్లోజ్‌గా ఉంటున్నావని అఖిల్‌ని కడిగేసింది మోనాల్. వాళ్లు తన సిస్టర్స్‌తో సమానమని రెస్పెక్ట్‌ పోతుందని ఎందుకు అన్నావని వాధించాడు అఖిల్‌. ఇలా వారి మధ్య సాగిన వాదనలు వారి ప్రేమలను బయటపెట్టేశాయి. సోహైల్‌ - అరియానా మధ్య వార్‌ మామాలుగా చలి కాలం మంటలా మండుతూనే ఉంది. అయితే సోహైల్‌ ఈ గొడవలకు పుల్‌స్టాప్‌ పెట్టేందుకు అరియానాతో సంధికి వచ్చాడు. కానీ, అరియానా కాంప్రమైజ్ కాలేదు. దీంతో సోహెల్ మరింత ఫీలయ్యి అఖిల్‌పై అరిచేశాడు. సోహైల్‌కు అరియానా ఫియర్‌ బాగానే పట్టుకుంది. తను నన్ను ఏం చేయాలనుకుంటుదో అని అఖిల్‌తో చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సోహైల్. సోహైల్‌ను కూల్‌చేసేందుకు అఖిల్‌ శతవిధాలా ప్రయత్నించాడు.

మొత్తానికి గురువారం నాటి బిగ్‌బాస్‌ షో ఎలాంటి రచ్చ లేకుండా సాఫీగా ప్రశాంతంగా సాగింది. అరియానా రాజీకి రాకపోవడంతో సోహైల్‌ కాస్త కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది. మరీచూద్దాం ఇప్పటికైన అరియానా మనసు కరుగుతుందో. సోహైల్‌తో ఫ్రెండ్‌షిప్‌ చేస్తుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories