logo
సినిమా

రంజుగా మారిన నామినేషన్స్ : అఖిల్‌కు మోనాల్‌ దిమ్మతిరిగే షాక్!

రంజుగా మారిన నామినేషన్స్ : అఖిల్‌కు మోనాల్‌ దిమ్మతిరిగే షాక్!
X
Highlights

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌కు సంబంధించిన 13వ వారం నామినేషన్ ప్రక్రియలో గందరగోళం నెలకొన్నది. ఈ వారం కీలకంగా...

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌కు సంబంధించిన 13వ వారం నామినేషన్ ప్రక్రియలో గందరగోళం నెలకొన్నది. ఈ వారం కీలకంగా మారడంతో ఇంటి సభ్యులు తమ గేమ్‌పై ఫోకస్ పెట్టారు. గ్రాండ్ ఫినాలే‌లో చోటు సంపాదించుకొనేందుకు తమ వ్యూహాలను సిద్దం చేసుకొన్నారు. ఇక నామినేషన్ ప్రక్రియలో ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిందే. వాళ్ల మిత్రులైనా కూడా అభిప్రాయం చెప్పాల్సిందే. దీంతో నామినేషన్ ప్రక్రియ సందర్భంగా వాడివేడి వాదనలు వినిపించారు. ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియలో షాకుల మీదు షాకులు కనిపించాయి. షో ముగింపుకు చేరుకోవడంతో ఇప్పటి వరకు జోడి కట్టి సేఫ్ గేమ్ ఆడిన కంటెస్టెంట్లు వారిలో కలర్స్‌ను తమ తోటి కంటెస్టెంట్లకు చూపించారు. ఎన్నో ట్విస్టులు, మ‌రెన్నో వింత‌లు నామినెషన్‌ ప్రక్రియ‌లో చోటు చేసుకున్నాయి.

బిగ్ బాస్ హౌజ్ లో ఎవరైనా సరే ఎలిమినేషన్స్ కి వచ్చేసరికి శత్రువులుగా మారిపోవాల్సిందే. ఇంతకుముందు అంటే హౌజ్ లో చాలా మంది ఉండేవాళ్ళు కాబట్టి ఒక్కరితో అయినా స్నేహంగా ఉండాల్సిన పరిస్థితి. ఇక ఇప్పుడు మిత్రులుగా ఉన్న ఇద్దరు కూడా శత్రువులు అయ్యే సమయం ఆసన్నమైంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ నెవర్ బిఫోర్ అనేలా స్టార్ట్ చేశాడు.

ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా సేవ్ కావడంపై అవినాష్ అసంతృప్తిగా కనిపించాడు. అయితే అతడికి క్లారిటీ ఇవ్వడానికి సోహెల్, అఖిల్ ప్రయత్నించారు. ఇక కీలకమైన 13వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను షురూ చేశారు బిగ్ బాస్. హారిక దేత్తడి నామినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అవినాష్‌ను, అభిజిత్‌ను నామినేట్ చేసింది. ఇక అభిజిత్, హారికల మధ్య నాగార్జున పెట్టిన చిచ్చుకు ఫలితం దక్కినట్లు తెలుస్తోంది. టాస్క్ ను టాస్క్ లాగానే చూడాల్సింది అంటూ అభిజిత్‌ని నామినేట్ చేసి షాక్ ఇచ్చింది.

అఖిల్, మోనాల్‌ను అవినాష్ నామినేట్ చేశాడు. మోనాల్‌ను వీక్ అంటూ నామినేట్ చేశాడు. దీంతో నేను వీక్ కాద‌ని జ‌నాలు నిరూపించారు, అది మ‌ళ్లీ చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని మోనాల్ చెప్పింది. ఆ తర్వాత అఖిల్‌, అవినాష్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది.

నామినేషన్స్ పక్రియ రసవత్తరంగా మారింది. బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో అంద‌రిలో ఆస‌క్తి రేకెత్తించిన ట్రయాంగిల్ స్టోరీ ఎన్నో మ‌లుపులు తిరుగుతూ ఉంది. మోనాల్ కోసం కొట్టుకు చచ్చిన అఖిల్‌, అభిజిత్ ఇప్పుడు ఆమెనే పెద్ద స‌మ‌స్యగా భావిస్తున్నారు. హారికను అభి నామినేట్ చేసి షాకిచ్చాడు. ఏదేమైనా నామినేష‌న్ ప్రక్రియ‌తో జంట‌ల‌ను విడ‌గొట్టాల‌నుకున్న బిగ్‌బాస్ ప‌థ‌కం విజ‌య‌వంత‌మైన‌ట్లే కనిపిస్తోంది.

అవినాష్‌ను, మోనాల్‌ను అఖిల్ నామినేట్ చేశాడు. నీకు ఓవ‌ర్ కాన్ఫిడెంట్ ఉందంటూ అవినాష్‌ను, గేమ్‌లో ఎఫ‌ర్ట్స్ త‌క్కువ‌గా ఉన్నాయ‌ని మోనాల్‌ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత మోనాల్‌ను, హారికను అభిజిత్ నామినేట్ చేశాడు. మొద‌టి రోజు నుంచీ నీవ‌ల్ల నేను ఎమోష‌న‌ల్‌గా హ‌ర్ట్ అవుతున్నా అని మోనాల్‌ను నామినేట్ చేశాడు. టాస్కు చేయ‌క‌పోవ‌డం నాకు త‌ప్పు. కానీ ఎందుకు చేయ‌లేద‌నే విష‌యం నీకు బాగా తెలుసు. నువ్వే అర్థం చేసుకోక‌పోతే ఎవ‌రూ అర్థం చేసుకోలేరు' అంటూ హారిక‌ కంటైన‌ర్‌లో అతి త‌క్కువ రంగు నీళ్లు పోసి నామినేట్ చేశాడు.

ఆ తర్వాత మోనాల్ కంటెస్టెంట్లకు గ‌ట్టి కౌంట‌ర్లు ఇచ్చింది. అవినాష్, అభిజిత్, అఖిల్‌ను నామినేట్ చేసింది. ముందుగా అవినాష్‌ను నామినేట్ చేస్తూ ఇక్కడున్న అంద‌రూ స్ట్రాంగే అని చెప్పింది. త‌ర్వాత టాస్క్ ఆడ‌నందున‌ అభిని నామినేట్ చేస్తూ మీరు నా వ‌ల్ల ఇబ్బంది ప‌డుతున్నారు. నేను కూడా మీకు దూరంగానే ఉంటున్నాను అని క్లారిటీ ఇచ్చింది. ఇక త‌న క్లోజ్ ఫ్రెండ్ అఖిల్‌ను సైతం నామినేట్ చేసి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మ‌ధ్య మాటలు తుటాల పేలాయి.

మోనాల్‌తో అరియానా క‌య్యానికి కాలు దువ్వింది. చెత్త కెప్టెన్ అనడానికి కారణాలు చెప్పాలని నిలదీసింది. దీంతో వాయిస్‌ పెంచిన మోనాల్‌ నువ్వు నా బాస్‌ కాదని కడిగేసింది. తెలుగులో మాట్లాడండని సలహా ఇచ్చిన అవినాష్ పై భగ్గుమంది. మధ్యలో మాట్లాడకు అని అరిచేసింది. ఇక మోనాల్‌ను వీక్‌ అనొద్దని అవినాష్‌కు సూచించిన సోహైల్‌ గుజరాతి గుమ్మ కన్నీళ్లు తుడిచాడు.

ఇక అరియానా త‌నను వ‌ర‌స్ట్ కెప్టెన్ అన్నందుకు హారిక‌, మోనాల్‌‌, సోహైల్‌ను నామినేట్ చేసింది. మోనాల్‌తో భారీ వాగ్వాదం జరిగింది. తనను చెత్త కెప్టెన్ అనడానికి కారణాలు చెప్పాలని మోనాల్‌ను అరియానా నిలదీసింది. దీంతో ఒత్తిడి చేయడానికి నీవు నాకు బాస్ కావు అంటూ అరియానాకు మోనాల్ ఝలక్ ఇచ్చింది. ఇక అవినాష్ తెలుగులో మాట్లాడు అని చెప్పగా మ‌ధ్యలో మాట్లాడ‌కు అని మోనాల్ హెచ్చరించింది. అవినాష్‌ను సోహైల్‌ నామినేట్ చేస్తూ మోనాల్ కూడా స్ట్రాంగ్ అయింద‌ని, ఆమెను వీక్ అనొద్దని సూచించాడు. తర్వాత అరినాయను నామినేట్‌ చేశాడు. తర్వాత మోనాల్ క‌న్నీళ్లు తుడిచాడు. ఇక ఈవారం అభిజిత్‌, అవినాష్‌, మోనాల్‌, అఖిల్‌, హారిక నామినేట్ అయ్యారు.

మొత్తంగా నామినేషన్‌ ప్రక్రియతో ఇంట్లో నిప్పులు రాజుకున్నాయి. అత్యంత గందరగోళం, అసహనాల మధ్య జరిగిన నామినేషన్ ప్రక్రియ ఇంటి సభ్యుల మధ్య ఓ క్లారిటీని తెచ్చిపెట్టింది. ఒకరికొకరు తమ గేమ్ ప్లాన్‌ను సెట్ చేసుకొన్నట్టు కనిపించింది. గేమ్ విషయంలో కొత్తగా వ్యూహాలు పన్నుకొంటున్నారనేది స్పష్టమైంది. మరి ఈ గోడవలతో కంటెస్టెంట్స్ హౌజ్ లో ఎలా ముందుకు సాగుతారో చూడాలి.

Web TitleBigg Boss 4 Telugu: these contestants are nomination list in the 13th week
Next Story