logo
సినిమా

జోరుగా సాగుతున్న ఫినాలే వీక్.. బిగ్‌బాస్ ఎప్పుడు ఆహ్వానిస్తాడా అని ముగ్గురు కంటెస్టెంట్ల ఆతృత

జోరుగా సాగుతున్న ఫినాలే వీక్.. బిగ్‌బాస్ ఎప్పుడు ఆహ్వానిస్తాడా అని ముగ్గురు కంటెస్టెంట్ల ఆతృత
X
Highlights

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇన్నిరోజులు ఓ లెక్క ఇప్పుడో లెక్క అన్నట్లు ఫినాలే షో సాగుతోంది. అదిరిపోయే సెట్టింగ్‌ల్లో...

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇన్నిరోజులు ఓ లెక్క ఇప్పుడో లెక్క అన్నట్లు ఫినాలే షో సాగుతోంది. అదిరిపోయే సెట్టింగ్‌ల్లో ఊహించని ట్విస్ట్‌లతో ఇంటిసభ్యులను అవాక్కయ్యేలా చేస్తున్నాడు బిగ్‌బాస్. ఇన్నాళ్లు టాస్కులతో పరీక్షించిన బిగ్‌బాస్ నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటిసభ్యులు లైఫ్‌లాంగ్‌ గుర్తుంచుకునేలా షాకింగ్‌ సప్రైజ్‌ ఇచ్చారు. కంటెస్టెంట్లకే కాదు చూస్తున్న ఆడియన్స్‌ను కూడా మైస్మరైజ్‌ చేశాడు. మరీ బిగ్‌బాస్ ప్రదర్శించిన ఆ సప్రైజ్‌ ఎంటో మనం కూడా వీక్షిద్దామా..

అభిజిత్‌కు డ్యాన్స్ అంటే నచ్చదని మరోసారి ప్రూ అయ్యింది. 101 రోజు వేకప్‌ సాంగ్‌ మొదలవ్వగానే ఫైనలిస్ట్‌లంతా నిద్రమత్తులోనే ఫుల్‌ ఎనర్జిటిక్‌గా చిందులేశారు. కానీ అభి మాత్రం ఇదేమి పట్టనట్లు సైలెంట్‌గా వాష్‌రూంలోకి వెళ్లి బ్రెష్ చేసుకున్నాడు.

బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టగానే పరిచయాలు మొదలవుతాయి. స్నేహాలు కుదిరిపోతాయి. ప్రేమలు చిగురుస్తాయి. కట్‌ చేస్తే బంధాలు బద్దలవుతాయి. తెగతెంపులు జరిగిపోతాయి. ఏడిపించే ఏమోషన్స్, మనసుని గాయపరిచే కయ్యాలు, నవ్వులు ఆటలు, పాటలు కొకొల్లలు. ఇలా ప్రతి కంటెస్టెంట్‌ మనసు సరస్సులో ఎన్నో జ్ఞాపకాలు పుష్పాలై వికసిస్తాయి. మరెన్నో అనుభావాలు అలలై ఉప్పొంగుతాయి. ఇంటిసభ్యులకు అలాంటి ఫీలింగ్‌నే రుచిచూపించాడు బిగ్‌బాస్‌. కంటెస్టెంట్ల వందరోజుల ప్రయాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించి కావాల్సినంత బూస్టప్‌ ఇచ్చాడు.

ఫస్ట్‌ లక్కీ చాన్స్‌ అఖిల్‌ కొట్టేశాడు. గార్డెన్ ఏరియాలోకి అడుగుపెట్టగానే అఖిల్‌ కళ్లు బైర్లు కమ్మాయి. అక్కడి సెట్టింగ్‌ చూసి షాకయ్యాడు. ఏందీ ఇదంతా అంటూ ఫుల్‌ ఖుషి అయ్యాడు. అఖిల్‌ను బిగ్‌బాస్ పొగడ్తలతో ముంచెత్తాడు. తనలో ఓ సినిమా హీరోలాంటి లక్షణాలు లక్షలకొద్ది ఉన్నాయంటూ చెప్పుకచ్చాడు. ఆ లక్షణాలను ప్రేక్షకులు వీక్షించి ఇక్కడివరకు తీసుకువచ్చారని బిగ్‌బాస్ గుర్తుచేశారు. బంధాలను, టాస్క్‌లను బ్యాలెన్స్ చేస్తూ అదరగొట్టావంటూ బిగ్‌బాస్‌ అఖిల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. బిగ్‌బాస్‌ చెబుతున్న ఒక్కోమాట అఖిల్‌ మనసుని కదిలించాయి కంటతడి పెట్టించాయి.

ఈ వందరోజుల్లో హౌస్‌లో అఖిల్‌ సాగించిన జర్నీ వీడియోను ప్లే చేశాడు బిగ్‌బాస్ ఒక్కో వీడియో క్లిప్‌ అఖిల్‌ను ఎమోషనల్‌కు గురిచేశాయి. మోనాల్‌తో గుసగుసలు, అభితో గొడవలు, సోహైల్‌ త్యాగాలను ప్రదర్శించాడు బిగ్‌బాస్‌. ఆ సీన్లను చూసిన అఖిల్‌ ఫుల్‌ హ్యాపీగా ఫీలయ్యాడు. ఏవీని చూసి అఖిల్‌ తన ఫీలింగ్‌ను ఆపుకోలేకపోయాడు. బంకమట్టిలా వచ్చామని తమను తాము బొమ్మలా మల్చుకుంటున్నామని చెప్పుకచ్చాడు. తనకు ప్రేక్షకుల ప్రేమ చాలని వేరే ప్రేమ కోరుకోవడం పూలిష్‌ నెస్ అవుతుందన్నాడు. తనకు ఓట్లు వేసిన ప్రేక్షకులకు అఖిల్ మోకరిల్లి ధన్యవాదాలు తెలిపాడు. ఏవీని చూపించడమే కాకుండా అఖిల్‌ జర్నీకి సంబంధించిన ఓ ఫోటోను కూడా బిగ్‌బాస్‌ కానుకగా ఇచ్చాడు. బాల్కనీలో బోలెడు ఫోటోలు ఉండగా అఖిల్‌ తన ఫ్రెండ్‌ సోహైల్‌ తో ఉన్న ఫోటోను సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లాడు.

అఖిల్‌ తర్వాత అభిజిత్‌ గార్డెన్‌ ఏరియాలోకి అడుగుపెట్టాడు. అభి రాగానే బిగ్‌బాస్‌ పొగడ్తల వర్షం కురిపించారు. హౌస్‌లో కూల్‌ పర్సనంటూ బిగ్‌బాస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేశాడు. అపోహాలు, అపర్థాలు ఎన్ని ఎదురైనా దృఢసంకల్పంతో ముందుకు వచ్చారని కొనియాడారు. మర్యాద ఇవ్వడంలో పుచ్చుకోవడంలో మీకు మీరే సాటి అంటూ చెప్పుకచ్చారు. బిగ్‌బాస్‌ వాయిస్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడంతో అభిజిత్‌ తెగ మురిసిపోయాడు.

గార్డెన్‌ ఏరియాలోకి రాగానే అభిజిత్‌ రోబో టాస్క్‌లోని వస్తువులను తనివీతీరా ఆస్వాదించాడు. ఆ గేమ్‌లో వేసుకున్న డ్రెస్సులను పట్టుకొని అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఇంట్లోకి యంగ్ చామింగ్ బాయ్‌లా ఎంట్రీ ఇచ్చి, మెచ్చూర్డ్ మ్యాన్‌ ఆఫ్‌ ద హౌస్‌గా నిలిచావని అభిజిత్‌ను బిగ్‌బాస్ మెచ్చుకున్నాడు. వేరేవాళ్ల గురించి ఆలోచించకుండా నీ ప్రయత్నం నువ్వు చేయడం నీ మంచి ప్రవర్తన తీరుకు అద్దం పడుతుందన్నారు. ఇలాంటి తెలివైన కంటెస్టెంట్‌ హౌస్‌లో ఉన్నందుకు గర్వపడుతున్నట్లు బిగ్‌ బాస్ ప్రకటించాడు. బిగ్‌ బాస్ ఈ మాట చెప్పగానే అభిజిత్‌ రెండు చేతులు జోడించి తన ఫీలింగ్స్‌ను చెప్పుకచ్చాడు. బిగ్‌బాస్‌ హౌస్‌కి రావాలనే తన డెసిజన్ హండ్రెడ్ పర్సంట్‌ కరెక్ట్‌ అని గుర్తుచేసుకున్నాడు.

అభి జర్నీకి సంబంధించిన వీడియో ప్లే చేయగానే అతగాడు మైమరిచిపోయాడు. ఈ వీడియో క్లిప్పుల్లో మోనాల్‌ అభి పెట్టిన ముచ్చట్లనే ఎక్కువగా చూపించారు. తర్వాత మోనాల్‌ తో దూరమైన సన్నివేశాలు, అఖిల్‌తో గొడవలు, నామినేషన్ల పర్వాలను రక్తికట్టించారు. హారిక స్నేహాన్ని కూడా అక్కడక్కడ యాడ్ చేశారు. ఈ సీన్స్‌ను చూసిన అభి ఎంతో ఆనందించాడు. తర్వాత తనకు నచ్చిన ఫోటో తీసుకెళ్లు అని బిగ్‌ బాస్‌ ఆదేశించగా అభిజిత్‌ కేవలం తాను సింగల్‌గా ఉన్న పిక్‌ ను సెలక్ట్‌ చేసుకున్నాడు. ఇక గార్డెన్‌ ఏరియా నుంచి హౌస్‌లోపలికి వచ్చిన అభిజిత్ తన ఫీలింగ్స్‌ని తోటి ఇంటిసభ్యులతో షేర్‌ చేసుకొని తెగ సంబురపడ్డాడు.

బిగ్‌బాస్‌ సీజన్‌కు నాలుగు రోజుల్లో ఎండ్ కార్డ్ ప‌డ‌నుంది. ఐనా టామ్‌ అండ్ జెర్రీలు మాత్రం తగ్గడం లేదు. మళ్లీ కీచులాడుకోబోయారు. అరియానా గట్టిగా పోరా అంటూ అరవడంతో పాపం సోహైల్‌ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అఖిల్‌, అభిజిత్ ఏవీ ప్రదర్శన ముగిసింది. ఇక మిగిలింది హారిక, సోహైల్, అరియానా బిగ్‌బాస్‌ ఎప్పుడెప్పుడు పిలుస్తాడా ఈ ముగ్గురు తెగ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అఖిల్‌, అభిజిత్‌ను బిగ్‌బాస్ పొగడ్తలతో ముంచెత్తాడు. మరీ వీళ్లపై బిగ్‌బాస్‌కి ఎలాంటి ఒపీనియన్ ఉందో.

Web TitleBigg Boss 4 Telugu: On the Wednesday episode in the Bigg Boss house
Next Story