Top
logo

Bigg Boss 4 Telugu: వినోదం డోస్ పెంచనున్న బిగ్ బాస్..జబర్దస్త్ అవినాష్ ఎంట్రీ?

Bigg Boss 4 Telugu: వినోదం డోస్ పెంచనున్న బిగ్ బాస్..జబర్దస్త్ అవినాష్ ఎంట్రీ?
X

Bigg Boss Telugu 4 Jabardasth Avinash entry

Highlights

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ లో వినోదం డబుల్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. తాజా ప్రోమోలో మరో ఎంటర్టైన్మెంట్ స్టార్ ఎంట్రీ ఇస్తున్నట్టు కనిపించింది.

అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగులో నాలుగో సీజన్ మెల్లగా వినోదం బాట పట్టింది. మొదటి వారంలో నీరసంగా సాగిన షో రెండోవారంలోకి వచ్చేసరికి పూర్తి వినోదాత్మకంగా ఉండేటట్టు చర్యలు తీసుకున్నారు. బీబీ టీవీ పేరుతో హౌస్ మేట్స్ తో కామెడీ..డాన్స్ లు చేయిస్తూ కాస్త వినోదాన్ని పంచుతున్నారు. అంతే కాకుండా.. బిగ్ బాస్ లో కచ్చితంగా ఉండే పులిహోర ప్రేమ కథ కూడా ప్రారంభం అయింది. ముక్కోణపు ప్రేమకథను ఆసక్తి కరంగా ప్లే చేస్తున్నారు. రెండో వారం తొలి అర్థభాగంలో బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగిందనే చెప్పాలి. ఈసారి ఎలిమినేషన్స్ కి ఏకంగా 9 మందిని నామినేట్ చేశారు. ఇందులో అందరూ మంచి కంటెస్టంట్ లే ఉండడంతో ఈ వారం ఎలిమినేషన్ మరింత ఉత్సుకత రేకెత్తిస్తోంది.

గంగవ్వ వెళ్లిపోతుందా?

బిగ్ బాస్ హౌస్ ఈ సీజన్ లో స్పెషన్ ఎట్రాక్షన్ గంగవ్వ. పెద్ద వయసున్న గంగవ్వ.. తన కంటె చిన్నవాళ్ళతో సర్దుకుపోవడం కాస్త కష్టమే. అయినా సరే, ఒక ప్రత్యెక అతిథిలా గంగవ్వను చూస్తూ వస్తున్నారు. తరచు గంగవ్వ వెళ్ళిపోవాలని ఉన్నట్టు చెప్పుకోస్తోంది. మరోవైపు ఆమెకు ఉన్న ప్రేక్షకాదరణ దృష్ట్యా ఎలాగైనా గంగవ్వ ను కొన్ని రోజులు కొనసాగించాలని బిగ్ బాస్ టీం చూస్తోంది. కానీ, అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. మొదటి వారంలో ఉన్నంత హుషారుగా ఈ వారంలో గంగవ్వ కనిపించడం లేదు. దీంతో ఆమె ఈవారం కాకపోయినా వచ్చేవారం అయినా వెళ్ళిపోతుంది అనిపిస్తోంది.

జోకర్ వస్తున్నాడు!

తాజా ప్రోమోలో హౌస్ లోకి కొత్తగా ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. అకస్మాత్తుగా లోపలి వచ్చిన ఆ వ్యక్తి తనను తాను జోకర్ గా చెప్పుకుంటూ పరిచయం చేసుకోవడం కనిపించింది. జబర్దస్త్ అవినాష్ మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. అంటే ఈవారంలో ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చినట్లు. ఇప్పటికే మొన్న కుమార్ సాయి బిగ్ బాస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ ల కంటె వినోదాత్మక కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే హౌస్ లో గ్లామర్ కు తక్కువేమీ లేదు. అదేవిధంగా ఓ లవ్ స్టోరీని పట్టాలు ఎక్కించారు. రెండో స్టోరీ వండుతున్నారు. మొదటిది ముక్కోణపు స్టోరీ.. దీనిలో అభిజిత్, అఖిల్, మోనాల్ తమ వంతు పులిహోర బాగానే కలుపుతున్నారు. ఇక రెండో జంటను సిద్ధం చేసే పనిలో బిగ్ బాస్ టీం ఉన్నట్టు కనిపిస్తోంది. కొన్నిరోజులు ఆగితేనే కానీ ఈ విషయం తేలదు. ఇక అవినాష్ వచ్చాడు కాబట్టి కామెడీ స్కిట్లతో షో నడిపించే అవకాశం కనిపిస్తోంది!

ఈవారం ఇద్దరు ఎలిమినేట్ అవుతారా?

బిగ్ బాస్ హౌస్ లో మొత్తం 16 మంది ఉన్నారు. మొదటి వారం ఎలిమినేట్ అయిన సూర్యకిరణ్ స్థానంలో వెంటనే కుమార్ సాయి వచ్చేశాడు. దాంతో 16 మంది ఉన్నట్టు అయింది. ఇప్పుడు జబర్దాస్త్ అవినాష్ ఎంట్రీ ఇస్తుండడంతో ఈసారి ఇద్దరు బయటకు వెళతారని అనుకుంటున్నారు. అయితే, ఆ అవకాశాలు తక్కువే. కానీ, పోటీ గట్టిగా ఉన్న నేపధ్యంలో ఎవరు బయటకు వెళతారు అనేది ఈసారి అంచనా అంత తేలిక కాదు. కానీ ఇప్పటి వరకూ ఉన్న సమాచారం మేరకు కరాటే కల్యాణి దాదాపుగా బయటకు వెళ్ళే చాన్స్ ఉంది. ఆమెతో పాటు ఇంకొకరు బయటకు వెళ్ళే అవకాశాలు కొట్టిపారేయలేం. అయితే అది గంగవ్వే కావచ్చనేది ఇన్సైడ్ టాక్. మొదటి వారంతో పోలిస్తే ఈవారం గంగవ్వకు ఈవారం తక్కువ ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. అదీకాక ఆమె గట్టిగా బయటకు వెళ్ళిపోవాలని కోరుకుంటోంది. దీంతో ఆమెను ఈవారం బయటకు పంపిస్తారా.. లేదా వచ్చేవారం వరకూ ఉంచుతారా అనేది ఆసక్తికరంగానే ఉంది.

మొత్తమ్మీద బిగ్ బాస్ లో ఎగస్ట్రా ఎంటర్టైన్మెంట్ అవినాష్ అందిస్తాడని బిగ్ బాస్ టీం నమ్ముతున్నట్టు ఉంది. ఆ నమ్మకాన్ని అవినాష్ నిలబెట్టుకుంటాడని ఆశిద్దాం!

ఈవారం బిగ్ బాస్ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోతారని అనుకుంటున్నారు...మీ అభిప్రాయం చెప్పండి

ఇది బిగ్ బాస్ అధికారిక పోల్ కాదు. కేవలం మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసమే! మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!!

Web TitleBigg Boss 4 Telugu Jabardasth Avinash wild card entry today give entertainment boost to show
Next Story