Top
logo

మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ 4 సీజన్ ముగింపు.. ట్రోఫీ రేసు నుంచి త‌ప్పుకున్న హారిక‌ ?

మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ 4 సీజన్ ముగింపు.. ట్రోఫీ రేసు నుంచి త‌ప్పుకున్న హారిక‌ ?
X
Highlights

బిగ్ బాస్ 4 సీజన్ చివరిదశకు వచ్చేసింది. మరికొన్ని గంటల్లోనే సీజన్ 4 పూర్తి కానుంది. ఎలిమినేట్ అయిన‌వాళ్ల‌ను...

బిగ్ బాస్ 4 సీజన్ చివరిదశకు వచ్చేసింది. మరికొన్ని గంటల్లోనే సీజన్ 4 పూర్తి కానుంది. ఎలిమినేట్ అయిన‌వాళ్ల‌ను తిరిగి హౌస్‌లో చూస్తున్నందుకు ఓప‌క్క సంతోషం అలాగే, త‌ర్వాతి రోజు నుంచి హౌస్ ఉండ‌ద‌న్న బాధ మ‌రో వైపు కంటెస్టెంట్లను ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో హౌస్‌లో చివ‌రి రోజు కొంత ఎమోష‌న‌ల్‌గా సాగింది. రీయూనియ‌న్ పార్టీ కోసం మొదట గంగ‌వ్వ హౌస్ లోపలికి వచ్చింది. అవ్వ పిలుపు విన‌గానే అఖిల్ ఉత్సాహం ఉర‌క‌లెత్తింది. ఆమెను చూడ‌గానే పిల్లాడిలా సంబ‌ర‌ప‌డిపోయాడు.

తర్వాత సుజాత తనను ఇంప్రెస్ చేస్తే కంటెస్టుల ఇంటి నుంచి వ‌చ్చిన మెస్సేజ్‌ను చూపిస్తాన‌‌ని బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. దీంతో అభిజిత్, సోహైల్ పోటీప‌డుతూ ఇంట్లోకి ప‌రుగెత్తారు. ఈ క్ర‌మంలో అభి మొద‌ట‌గా కాఫీ మ‌గ్గు తీసుకొచ్చాడు. త‌ర్వాత సోహైల్ ప్లేటు మీద ఐ ల‌వ్ యూ అని రాసుకొచ్చి మ‌రీ అందించాడు. సమయం అయ్యిపోవాడవంతో గంగవ్వ, సుజాతలు హౌస్ నుంచి బయటికి వెళ్లిపోవాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. మనసు బాధతో వారిద్దరు బయటికి రావల్సి వచ్చింది. అంతకు ముందు అందరూ హుషారెక్కడానికి ఓ పాటకు డాన్స్ చేసారు. తర్వాత ఫైన‌లిస్టులంద‌రికీ కుటుంబ స‌భ్యులు మాట్లాడిన‌ వీడియోలు చూపించి గంగ‌వ్వ‌, సుజాత వీడ్కోలు తీసుకున్నారు.

రీయూనియ‌న్ పార్టీకి వ‌చ్చిన‌ నోయ‌ల్‌ ర్యాప్‌తో ఊపేస్తూ కంటెస్టెంట్ల సంతోషాన్ని రెట్టింపు చేశాడు. అలాగే "నోయ‌ల్ టైటిల్ గెలిచేందుకు అర్హుడు" అంటూ నోయల్ ను ఉద్దేశించి అభి ఓ గిఫ్ట్ ను అందించాడు. హౌస్ లోకి ఎంటర్ అయిన నోయల్ చేతికి అభి అందించిన బాటిల్ పై 'నోయ‌ల్ టైటిల్ గెలిచేందుకు అర్హుడు' అని ఉంది. ఈ సందర్భంగా నోయల్ హౌస్‌ను మిస్స‌వ‌లేదు, కానీ మిమ్మ‌ల్ని మిస్ అవుతున్నానని పేర్కొన్నాడు. ఈ బిగ్‌బాస్ త‌న‌కు ఎంతో ఇచ్చింద‌ని, కానీ త‌ను ఏమీ తిరిగివ్వ‌లేక‌పోతే క్ష‌మించండి అంటూ హౌస్‌కు గుడ్‌బై చెప్పాడు.

త‌ర్వాత హౌస్ లో మెహ‌బూబ్‌ను చూడ‌గానే సోహైల్ తెగ ఎగ్జైట్ అయ్యాడు. అనంత‌రం త‌న జిగిరీ దోస్తులు సోహైల్‌, అఖిల్‌, అభిజిత్‌తో క‌బుర్లు చెప్పాడు. అటు అఖిల్ మాత్రం దీపిక పదుకొణెలా ఉన్నావంటూ దివిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. చాలా బాగున్నావంటూ అభిజిత్ కూడా మెచ్చుకున్నాడు. మ‌రోప‌క్క మెహ‌బూబ్‌, సోహైల్ భావోద్వేగానికి లోనై క‌న్నీళ్లు పెట్టుకున్నారు. అనంత‌రం ఫైన‌లిస్టులు అన్ని హార్ట్ దిండుల‌ను మెహ‌బూబ్‌, దివికి బ‌హుమ‌తిగా ఇచ్చారు. చివరికి హౌస్ లో ఉన్న ఐదుగురు కంటెస్టులను ఉద్దేశించి ఐదుగురు విన్న‌ర్లే అన్న విష‌యాన్ని గుర్తు పెట్టుకోండ‌ని మెహ‌బూబ్ ప‌దే ప‌దే చెప్తూ సెల‌వు తీసుకున్నాడు.

రీయూనియ‌న్ పార్టీకి దేవి నాగ‌వ‌ల్లి, సూర్య కిర‌ణ్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్ మినహా అందరూ హాజరయ్యారు. వచ్చిన వారంతా హౌస్ లోని కంటెస్టెంట్లతో వారి జ్ఞాపకాలను నెమరేసుకుని ఎమోషన్ కు గురయ్యారు. త‌ర్వాత అవినాష్ ఎంట్రీ ఇవ్వ‌డంతో అరియానా ఆనందంతో గెంతులేసింది. కానీ ఆ వెంట‌నే నిన్ను మిస్ అవుతున్నానంటూ గుక్క‌పెట్టి ఏడ‌వటంతో ఆమెను ఓదార్చాడు. తర్వాత తన స్టైల్ లో అందరిని ఎంట‌ర్‌టైన్ చేసి ఉత్సాహపరిచాడు. అనంత‌రం అంద‌రికి హౌస్‌కు గుడ్‌బై చెప్తూ అక్క‌డి నుంచి నిష్క్ర‌మించాడు. త‌ర్వాత ఫైన‌లిస్టులు డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు.

అయితే తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం హారిక‌కు త‌క్కువ ఓట్లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో అరియానా, సోహైల్‌, అభిజిత్‌, అఖిల్.. ట్రోఫీ కోసం పోటీప‌డ‌నున్నారు. అయితే హాట్‌స్టార్ ఓట్లు అంద‌రూ వేస్తారు, కానీ మిస్‌డ్ కాల్స్ కూడా చేసే ఓపిక చాలా త‌క్కువ మందికే ఉంటుంది. ఈ మిస్‌డ్ కాల్స్ ఓట్లే విన్న‌ర్‌, ర‌న్న‌ర్‌ను డిసైడ్ చేయ‌నున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇక‌ ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆదివారం సాయంత్రం ఆరు గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు మరికొందరు ప్రముఖులు కూడా హాజరవుతారని సమాచారం.

Web TitleBigg boss 4 Telugu: Harika get least votes
Next Story