Bigg Boss 4 Telugu:ఫన్నీ రివెంజ్ టాస్క్.. అవినాష్ ను ఎత్తిపారేసిన అరియానా!

Bigg Boss 4 Telugu:ఫన్నీ రివెంజ్ టాస్క్.. అవినాష్ ను ఎత్తిపారేసిన అరియానా!
x
Highlights

బిగ్ బాస్ 4 తెలుగు రియాల్టీ షో ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఐదువారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రోజు రోజుకూ వినోదాన్ని పంచుతూ సాగుతోంది.

బిగ్ బాస్ 4 తెలుగు రియాల్టీ షో ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఐదువారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రోజు రోజుకూ వినోదాన్ని పంచుతూ సాగుతోంది. ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ సందర్భంగా నాగార్జున హౌస్ మేట్స్ తో సరదా ఆటలు ఆడించారు. ఇందులో భాగంగా కెప్టెన్సీ టాస్క్ కోసం గతవారం ఇచ్చిన బీబీ హోటల్ టాస్క్ లో భాగంగా జరిగిన విషయాలను గుర్తు చేశారు నాగార్జున. ఆ టాస్క్ సందర్భంగా అతిధుల టీమ్.. హోటల్ సిబ్బంది టీమ్ ను విపరీతంగా ఇబ్బంది పెట్టింది. అమ్మ రాజశేఖర్ ను మెహబూబ్ వంద సార్లు స్విమ్మింగ్ పూల్ లోకి దిగి పైకి రావాలని టాస్క్ ఇచ్చాడు. అయితే, రాజశేఖర్ 73 సార్లు మాత్రమే అలా చేయగలిగాడు. ఇలానే అరియానా అవినాష్ కు పిచ్చి టాస్క్ లు ఇచ్చి ఏడిపించింది. దీంతో వాళ్ళుపెట్టే హింసా భరించలేక ఆతిధ్య టీమ్ ఓటమి పాలైంది.

నిన్న ఎలిమినేషన్ సందర్భంగా నాగార్జున ఈ విషయాలను గుర్తు చేస్తూ.. అతిధి టీమ్.. ఆతిధ్య టీమ్ రివర్స్ అయి టాస్క్ లు చేయాలని చెప్పారు. దీంతో రివెంజ్ తీర్చుకునే అవకాశం వచ్చిందని అందరూ హంగామా మొదలెట్టేసారు.

ఈ రివెంజ్ ఆటలో భాగంగా మెహబూబ్..సుజాతను ఎత్తుకుని 50 గుంజీళ్లు తీసి ఆశ్చర్యపరిచాడు. ఇక అరియానా అవినాష్ ను ఎత్తుకుని హౌస్ లో గిరగిరా తిరిగి కింద పాడేసింది. ఇక సోహెల్ ను కోడిలా అరుస్తూ హాల్ చుట్టూ కోడిలా తిరగాలని చెప్పారు. దీంతో సోహెల్ అలా తిరిగాడు. మొత్తమ్మీద ఈ రివెంజ్ టాస్క్ హౌస్ లో నవ్వులు పూయించింది. నాగార్జున కూడా ఈ టాస్క్ లను బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఐదో వారంలో శనివారం ఆరోగ్య కారణాల దృష్ట్యా గంగవ్వను హౌస్ నుంచి ఎలిమినేట్ చేసి పంపించారు. అయితే, ఆదివారం జోర్దార్ సుజాత ను ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. దీంతో సుజాత హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories