Top
logo

50 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ సీజన్-4

50 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ సీజన్-4
X
Highlights

బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు 50 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఇక సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ వేడిగా సాగింది.

బిగ్‌ బాస్ సీజన్-4 ఆఫ్ సెంచరీ కొట్టేసింది. సోమవారం నాటికి 50 షోలు పూర్తి చేసుకుంది. ఈ షో రోజు రోజుకి హీట్ పుట్టిస్తోంది. ఎవరుంటారు ఎవరు వెళ్తారని ఉత్కంఠను రేపుతోంది. ఐపీఎల్ పోటీని తట్టుకొని రికార్డు స్థాయి వ్యూవర్‌షిప్‌ సాధిస్తోంది. వివాదాలు పెంచుతూ వినోదాలు పంచుతూ బిగ్ బాస్ షో అందరిని అలరిస్తోంది ఆకట్టుకుంటోంది.

బిగ్‌బాస్ గతంలో ఇచ్చిన టాస్క్‌లో అభిజిత్ తన బట్టలను త్యాగం చేశాడు. ఇక అప్పటి నుంచి అభి ఒంటిమీద ఉన్న బట్టలతోనే బండి లాగుతున్నాడు. అప్పుడప్పుడు తన తోటి ఇంటిసభ్యుల డ్రెస్సులు వేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నాడు. అయితే హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన సమంత బిగ్ బాస్‌కి రిక్వెస్ట్ చేసి మరీ అభిజిత్‌కి బట్టలు ఇప్పించింది. దీంతో అభి ఎంతో హ్యాపీగా సమంతకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.

నిద్రలేవగానే ఎక్సర్‌సైజులు చేస్తాం. లేదంటే కాఫీ లాగించి మళ్లీ ఓ కునుకేస్తాం కానీ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉంటే మాత్రం లేవగానే స్టెప్పులేయాలి. 50రోజులుగా ఇదే అలవాటైన ఇంటిసభ్యులు కాస్త మ్యూజిక్ రాగానే నిద్ర మత్తులోనే చిందేస్తున్నారు. ఇక సోమవారం ఎపిసోడ్‌లో రత్తాలు రత్తాలు సాంగ్ కు రఫ్ఫాడించారు ఇంటిసభ్యులు.

సద్దుల బతుకమ్మ సందర్భంగా లాస్య, అవినాష్, అరియానా, మోనల్ బతుకమ్మ ఆడారు. ముక్కు అవినాష్ బతుకమ్మ పాటలు కూడా అందుకున్నాడు. చివరకు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న స్విమ్మింగ్‌ ఫూల్ లోనే బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మార్నింగ్ మస్తీలో భాగంగా హౌస్‌మేట్స్‌కి స్మాల్ టాస్క్‌ ఇచ్చారు బిగ్‌బాస్. ఈ టాస్క్ లో అభిపై పాజిటివ్ గా రాశాడు అఖిల్. త‌న‌తో మాట్లాడుతున్న‌ప్పుడు బాగా క‌నిపిస్తావు, కానీ డైటింగ్ మానేసి తిన‌డం మొద‌లెట్టు అని సలహా ఇచ్చాడు. దీంతో వారి మ‌ధ్య స్నేహం మొద‌లైంద‌ని చెప్ప‌క‌నే చెప్పాడు అఖిల్.

స్ట్రాంగ్ కంటెస్టెంట్ దివి బిగ్‌బాస్ హౌస్‌లోంచి బయటకు వచ్చేసింది. ఇంటి సభ్యుల్లో కలవరం మొదలైంది. ఎలాగైన టైటిల్ విన్నర్ అవ్వాలని అందరు తహతహలాడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎవరికి వారు టఫ్ ఫైట్ ఇస్తున్నారు. నువ్వా నేనా అన్నంత రేంజ్ లో పోటీ పడుతున్నారు. 8వారం నామినేషన్ ప్రక్రియ మొదలవ్వగానే రచ్చ షురు అయ్యింది. అఖిల్, మాస్టార్ మధ్యమాటల యుద్ధం చెలరేగింది. అరియానాకు స్నేహితులే శ‌త్రువుల‌య్యారు. మోనల్ మళ్లీ ఏడవకతప్పలేదు.

అప్పటి వరకు సాఫీగా జరిగిన నామినేషన్ ప్రక్రియ ఒక్కసారిగా యుద్ధవాతావరణాన్ని తలపిచింది. ఒకరిపై ఒకరు విరుచకపడ్డారు. నువ్వే తప్పు చేశావు అంటే నీదే తప్పు అంటూ అరుచుకున్నారు. మొత్తానికి సిల్లీ సిల్లీ రీజన్స్ కూడా మనసుల్ని గాయం చేస్తాయని ఈ ఎపిసోడ్ చూసినవాళ్లకు ఇట్టే అర్థమైపోతోంది. మొత్తానికి ఈ వీక్ నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. అమ్మరాజశేఖర్, అరియానా, మెహబూబ్, లాస్య, అఖిల్, మోనల్ నామినేషన్ వలలో చిక్కుకున్నారు. మరీ ఇందులోంచి ఎవరు బయటపడతారో ఎవరు సెఫ్ గా ఉంటారో వీకెండ్ వరకు వేచి చూడాల్సిందే.

Web TitleBigg boss 4 Telugu episode 51 October 26th highlights
Next Story