Top
logo

Bigg Boss 4 Telugu Updates: బిగ్‌బాస్ తెలుగు హౌస్‌లో ఇంటిలో హోస్ట్‌గా సమంత అక్కినేని

Bigg Boss 4 Telugu Updates: బిగ్‌బాస్ తెలుగు హౌస్‌లో ఇంటిలో హోస్ట్‌గా సమంత అక్కినేని
X
Highlights

Bigg Boss 4 Telugu: సమంత బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ కు హోస్ట్ గా వచ్చారు. ఆమె తొ పాటు అఖిల్ అక్కినేని, హైపర్ ఆది సందడి చేశారు.

బిగ్‌బాస్ షోలో హోస్ట్‌గా మామ స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు స‌మంత రంగంలోకి దిగారు. తెలుగులో ఆక‌ట్టుకునేలా మాట్లాడుతూ కంటెస్టెంట్లకే కౌంట‌ర్లు విసురుతు సందడి చేసింది. ఇక ద‌స‌రా పండ సంబ‌రాల‌ను రెట్టింపు చేసేందుకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ హీరో అఖిల్ కూడా వచ్చేశాడు. ఇంట్లో అమ్మాయిలను బుట్ట‌లో పడేసేందుకు ఇంటిస‌భ్యులు నానాతంటాలు పడ్డారు. ఇక హైపర్ ఆది హంగామా ఓ రేంజ్‌లో సాగింది. పలువురు సెల‌బ్రిటీల‌ను ఒకే స్టేజీ మీద‌కు తీస‌కువ‌చ్చి ద‌స‌రా వినోదాన్ని రెట్టింపు చేస్తూ కన్నుల పండ‌గలా సాగిన బిగ్‌ బాస్‌ ఎపిసోడ్‌లోని హైలెట్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ద‌స‌రా స్పెష‌ల్ మ‌హా ఎపిసోడ్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన సమంత షో ప్రారంభం నుంచే ముద్దు ముద్దు మాట‌ల‌తో సంద‌డి మొద‌లు పెట్టేసింది. కంటెస్టెంట్లుకు చాలేంజింగ్‌ టాస్కులు ఇచ్చి ఓ ఆట ఆడేసుకుంది. ఇక సమంత అందించిన స్పెష‌ల్ గిఫ్ట్‌కు ఇంటి సభ్యులు కంటతడి పెట్టారు. హోస్ట్‌గా వ్యవహరించిన సమంత కంటెస్టెంట్లు ఒక్కొక్క‌రి గురించి త‌న అభిప్రాయాల‌ను చెబుతూ అంద‌రినీ తిక‌మ‌క పెట్టింది ఇక అబ్బాయిలు ఫీలైనా స‌రే వాళ్ల గురించి చెప్ప‌న‌ని తేల్చి చెప్పింది. దీంతో వాళ్లే వాళ్ల గురించి చెప్పుకున్నారు.

బిగ్‌బాస్ హౌస్‌లో స‌మంత స్వ‌యంవ‌రం ప్ర‌క‌టించింది. ఇది మూడు రౌండ్లు ఉంటుంద‌ని తెలిపింది. హారిక‌, అరియానా, దివి, మోనాల్‌ల‌ను మెప్పించేందుకు మేల్ కంటెస్టెంట్లు డ్యాన్సుల‌తో రఫ్ఫాడిస్తూ కండ‌ల ప్ర‌ద‌ర్శ‌న కూడా చేస్తున్నారు. ఇక అఖిల్ మాత్రం త‌న సింగింగ్ ట్యాలెంట్ ప్ర‌ద‌ర్శించాడు. అఖిల్‌ను పాటకు అమ్మాయిలు ఇంప్రేస్‌ అవ్వడంతో అత‌నికి ఓ స్పెష‌ల్ గిఫ్ట్ అంటూ అఖిల్ ఇంటిస‌భ్యులు మాట్లాడిన వీడియోను చూపించారు.

ఆ తర్వాత మోనాల్‌, నోయోల్‌ను ఫ్యామీలిని చూపించారు. ఇక ఇంటిలో ఈ వారం నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లను సేవ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో అరియానా సేఫ్ అయిన‌ట్లు స‌మంత వెల్ల‌డించింది. స్వ‌యంవ‌రంలో 'ఎవ‌డు పోటుగాడు' అని రెండో రౌండ్ మొద‌లైంది. ఈ రౌండ్‌లో కూడా అఖిలే గెలిచాడు. ఒక్క పాయింట్ కూడా రాని సోహైల్ ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత సోహైల్, అమ్మ రాజ‌శేఖ‌ర్, దివి ఇంటిస‌భ్యులు మాట్లాడిన వీడియోను చూపించారు.

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ అఖిల్ అక్కినేని గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అఖిల్, సమంత మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది. ఇక ఇంటిలో నిర్వహించిన స్వయంవరంలో విజేతలను ఎంపిక చేశాడు. అంతేకాకుండా బిగ్‌బాస్ పెట్టిన రూల్స్‌ను అఖిల్‌ మార్చేశాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ అఖిల్ షో‌లోకి వ‌చ్చాడు. స్వయంవరంలో ఫైనల్‌కు చేరిన నాలుగు జంటల్లో వరస్ట్ జంట ఏమిటో డిసైడ్ చేయమని అఖిల్‌ను అడిగితే అందుకు అఖిల్ నో చెప్పాడు. చెత్త జంట అని అనడం నా వల్ల కాదు. బెస్ట్1, బెస్ట్ 2, బెస్ట్3, బెస్ట్4 జంట అని అంటానని అఖిల్ అన్నాడు. చివరిగా స్వయంవరం గేమ్‌లో భాగంగా నిర్వహించిన డ్యాన్స్‌ పోటీ ఆధారంగా అఖిల్ విజేతలను నిర్ణయించారు.

ఇక చివర్లో దసరా పండుగ నేపథ్యంలో ఇంటి సభ్యులకు తెచ్చిన గిఫ్టులను అఖిల్ అందించారు. బిగ్‌బాస్‌తో మా కుటుంబంలో మీరు సభ్యులుగా మారిపోయారని చెప్పాడు అఖిల్‌ . అనంత‌రం స్వ‌యంవ‌రంలో మెహ‌బూబ్‌- అరియానాల‌ను టాప్ జోడీగా ప్ర‌క‌టిస్తూ స్నేహ‌మాల వేయించి మెహ‌బూబ్‌తో ఆమెకు రింగు తొడిగించాడు. త‌ర్వాత‌ మోనాల్‌, అభిజిత్ సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక బెస్ట్ ఆఫ్ లక్ అంటూ అఖిల్ షో నుంచి నిష్క్రమించారు.

బిగ్‌బాస్ ఇంటిలో హైపర్ ఆది హంగామా టాప్ రేంజ్‌లో సాగింది. సహజంగా మాటలు తూటాలను పేల్చాడు. ఇంటి సభ్యులతో కలిసి ఫన్ క్రియేట్ చేశాడు. వేదికపైకి వచ్చిన అతిథులను కూడా ఆటపట్టిస్తూ డిటెక్టివ్‌గా అదరగొట్టాడు. పండగ స్పెషల్‌ రౌండ్‌లో అభి సేవ్‌ అయ్యాడు. ఆ తర్వాత లాస్య, అభి, హారిక ఇంటి సభ్యుల మీడియో చూశారు.

ఇక హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్‌, డిటెక్టివ్‌గా హైప‌ర్ ఆది ఎంట్రీ ఇచ్చారు. వ‌చ్చీరాగానే కంటెస్టెంట్లపై పంచులు విసిరాడు. త‌న పేరు కూడా ఏతో మొద‌ల‌వుతుంద‌ని మోనాల్‌కు అప్లికేష‌న్ పెట్టుకున్నాడు. అనంత‌రం నోయ‌ల్ సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక మిగిలిన ఇద్దరిలో త‌ర్వాత దివి ఎలిమినేట్ అని ప్ర‌క‌టించ‌డంతో మాస్ట‌ర్ కంట‌త‌డి పెట్టుకున్నాడు.

నీ త‌ర్వాతి సినిమాలో దివికి ఓ మంచి పాత్ర ఇవ్వు అంటూ స‌మంత షోకు విచ్చేసిన కార్తికేయ‌ను అభ్య‌ర్థించ‌గా అత‌డు ఓకే చెప్పాడు. మ‌రి మీతో ఒక సినిమా చేయాల‌నుంది అని కార్తికేయ మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్ట‌గా సామ్ అందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఇక‌ వారం రోజుల పాటు ఒక్క‌రే వంట చేయాల‌న్న బిగ్‌బాంబ్‌ను దివి లాస్య‌పై వేసింది. త‌న‌కు అసిస్టెంటుగా లాస్య అభిజిత్‌ను ఎన్నుకుంది.

ఏదేమైనా బిగ్‌బాస్ తెలుగు హౌస్‌లో ఇంటిలో హోస్ట్‌గా సమంత అటూ అక్కినేని ప్రేక్షకులను, ఇటు బిగ్‌ బాస్‌ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. అద్భుతంగా షోను ప్రజెంట్ చేయడంలో సమంత ఆకట్టుకుంది. ఇంటి సభ్యులతో మాట, ముచ్చట కలిపేసి వారికి చేరువైంది. వారిలోని ఎమోషన్స్ బయట పెట్టేందుకు తనదైన శైలిలో రాణించింది. మొత్తంగా బిగ్ బాస్ షో దసరా స్పెషల్‌లో మాత్రం దుమ్ము లేచిపోయింది.

Web TitleBigg boss 4 Telugu episode 50 October 25th highlights Samantha Akkineni Hosted dasara special episode and divi eliminated from the bigg boss house
Next Story