Top
logo

Bigg Boss 4 Telugu:సోహైల్ స్నేహగీతం.. మెహబూబ్ సేఫ్! కథలు పడుతున్న మోనాల్!!

Bigg Boss 4 Telugu:సోహైల్ స్నేహగీతం.. మెహబూబ్ సేఫ్! కథలు పడుతున్న మోనాల్!!
X

Bigg Boss 4  Telugu Highlights (Image curtsy Hot star) 

Highlights

వారంలో ఆరు రోజులు ఓ లెక్క..సోమవారం మరో లెక్క.. బిగ్ బాస్ లో హౌస్ మేట్స్ పరిస్థితి ఇలా ఉంటుంది. మిగిలిన...

వారంలో ఆరు రోజులు ఓ లెక్క..సోమవారం మరో లెక్క.. బిగ్ బాస్ లో హౌస్ మేట్స్ పరిస్థితి ఇలా ఉంటుంది. మిగిలిన రోజుల్లో టాస్క్ లు.. ఒకరి తో ఒకరికి హగ్గులు..పంచులు..స్నేహితాలు. కానీ, సోమవారం ఎలిమినేషన్ కి నామినేషన్ ప్రక్రియ మొదలైన వెంటనే పరిస్థితి మారిపోతుంది. అంతకు ముందు వరకూ ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకున్న వారే.. ఎదో పనికిరాని విషయాన్ని హైలైట్ చేసి దానితో ఎలిమినేషన్ కి నామినేట్ చేసేస్తారు. వాతావరణం ఒక్కసారే వేడెక్కిపోతుంది. అదిగో అదే ఈ సోమవారమూ జరిగింది.

బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు ఎపిసోడ్ 37 లో ఆరవ వారం ఎలిమినేషన్ కి నామినేషన్ ప్రక్రియ చేపట్టారు. దానికి ముందు హౌస్ లో ఏం జరిగిందంటే..

అభిజిత్ బర్త్ డే.. మోనాల్ విషాదం!

అభిజిత్.. అఖిల్.. మోనాల్ మధ్య ఏం జరుగుతుందో స్పష్టంగా అర్ధంకాని పరిస్థితి. శనివారం నాగార్జునతో అఖిల్, అభిజిత్ ఇద్దరిదీ నా విషయంలో తప్పే అని చెప్పింది మోనాల్. ఆ ఇష్యూ మీద అభిజిత్ మోనాల్ తో ఆమీ తూమీ తేల్చుకోవాలని అనుకున్నట్టున్నాడు. మోనాల్ ను డైరెక్ట్ గా 'నీ బెడ్‌ రూమ్‌లో కూర్చొని అఖిల్‌ తప్పని అన్నావు. నాగ్‌ సర్‌ ముందు ఏమో ఇద్దరి తప్పు అని అంటావా? మా ఇద్దరితో బ్యాలెన్స్‌గా మూవ్‌ అవుదామని అనుకుంటున్నావు' అంటూ నిలదీశాడు. దానికి మోనాల్ ఒక అమ్మాయి కోణం నుంచి ఆలోచించు అంటూ ఎదో చెప్పబోయింది. దీంతో 'ఇది ఒక వుమెన్‌ ఇష్యూలాగా నిలబెట్టకు.. అఖిల్‌కి నిజంగా నీ మీద అంత ప్రేమ ఉంటే నామినేషన్‌ ప్రక్రియలో నీ పేరు ఎందుకు తీశాడు? నీకు ఇష్టం ఉన్నప్పుడు ఒక తీరు ఉంటావు.. అది నీకు సూట్‌ కానప్పుడు ఇంకోతీరు ఉంటావు'అంటూ మోనాల్‌పై సీరియస్‌ అయ్యాడు. ఇక ఆ మాటలకు మోనాల్ తన ట్రేడ్ మార్క్ ఏడుపు బయటకు తీసింది.

ఇదిలా ఉంటె అభిజిత్ బర్త్ డే అని అరియానా కేక్ తయారు చేసి కట్ చేయించింది. అందరూ వచ్చినా అఖిల్..మోనాల్ రాలేదు. అయితే, మోనాల్ ఆరోగ్యం బాలేకపోవడంతో సెలైన్ ఎక్కించినట్టు బిగ్ బాస్ ప్రకటించాడు. తరువాత మోనాల్ చేతికి సూదితో ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే..అఖిల్ కు హాగ్ ఇచ్చేసింది. మోనాల్ కథ ఏమిటో ఎవరికీ అర్ధం కావడం లేదు.

సోహైల్ తిప్పలు..

సుజాత బయటకు వెళుతూ.. వెళుతూ సోహైల్ పై బిగ్ బాంబ్ వేసిపోయింది. దీంతో ఇంట్లో పాత్రలన్నీ తోమే పని సోహైల్ కు పడింది. వాటిని తోమలేక తిప్పలు పడుతున్నాడు సోహైల్. ఈ బాధలో ఉంటె అరియానా వచ్చి ఎదో విషయంపై సోహైల్ ను పొగరు అంటూ అరిచింది. దీంతో ఇద్దరి మధ్య రచ్చ మొదలైంది. వీరి గొడవ ఇలా ఉండగా.. మధ్యలో సోహైల్ కు కుమార్ సాయి ఎదో చెబుతూ వేలు చూపించాడు. ఆ చిన్న విషయంపై వేలు దించు అంటూ సీరియస్ అయ్యాడు సోహైల్. దానికి కుమార్ సాయి ఎక్కడా తగ్గలేదు. చెయ్యి కొంచెం దించి ఇది సరిపోతుందా అంటూ చురకలు వేశాడు.

ఘాటు నామినేషన్..

నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఒక్కో హౌస్ మెట్ ఇద్దర్ని నామినేట్ చేయాలి. నామినేట్ చేసిన ఇంటి సభ్యుడి మేడలో మిరపకాయల దండ వేసి ఎందుకు నామినేట్ చేస్తున్నారో చెప్పాలి..

నామినేషన్ లో భాగంగా అరియానా గ్లోరీ - మెహబూబ్, మోనాల్.. దివి - నోయల్, మెహబూబ్.. నోయల్ - దివి, అభిజిత్.. హారిక - అరియానా, కుమార్ సాయి.. అభిజిత్ - మెహబూబ్, అఖిల్.. లాస్య - మెహబూబ్, దివి.. మెహబూబ్ - దివి, అరియానా.. సొహైల్ - అరియానా, కుమార్ సాయి.. రాజ శేఖర్ మాస్టర్ - లాస్య, అభిజిత్.. అవినాష్ - దివి, అభిజిత్.. మోనాల్ - అరియానా, దివి.. అఖిల్ - అభిజిత్, అరియానా.. కుమార్ సాయి - హారిక, సొహైల్.. లను నామినేట్ చేశారు.

బిగ్ ట్విస్ట్..

హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్నసొహైల్‌ కి బిగ్ బాస్ ప్రత్యేక అధికారం ఇచ్చాడు. నామినేట్ అయిన సభ్యుల్లో ఒకర్ని సేవ్ చేయొచ్చని చెప్పాడు. దీంతో సోహైల్ తన ఫ్రెండ్ మెహబూబ్‌ని సేవ్ చేశాడు. ఇక ఈవారం అరియానా, అభిజిత్, మోనాల్, కుమార్ సాయి, దివి, అఖిల్, నోయల్, లాస్య, హారిక‌లు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.

మొత్తమ్మీద హాట్ హాట్ గా సాగిన ఈ నామినేషన్ ప్రక్రియలో తనకు కెప్తెన్సీ విషయంలో సహాయం చేసిన మెహబూబ్ ను నామినేట్ కాకుండా రక్షించి ఋణం తీర్చేసుకున్నాడు సోహైల్!

ఈవారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు?

ఇది అధికారిక పోల్ కాదు.. మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం మాత్రమే! గమనించగలరు!! మరిన్ని బిగ్ బాస్ విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Web TitleBigg Boss 4 Telugu episode 37 October 12th Monday 6th week nominations are very hot
Next Story