Top
logo

బిగ్ బాస్ నుంచి కుమార్ సాయి బయటకు..? ఆమెను రక్షించేందుకేనా?

బిగ్ బాస్ నుంచి కుమార్ సాయి బయటకు..? ఆమెను రక్షించేందుకేనా?
X

Boss Boss 4 Telugu 6th week eliminations

Highlights

Bigg Boss 4 : బిగ్ బాస్ 4 ఆరోవారం హౌస్ నుంచి కుమార్ సాయి ఎలిమినేట్ కానున్నట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్ నుంచి ఈ వారం బయటకు ఎవరు వెళతారు? ఈ ప్రశ్న చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్ లో మిగిలిన వాళ్ళు.. కుమార్ సాయి, మోనాల్, అభిజిత్, అఖిల్, దివి, అరియానా మొత్తం ఆరుగురు. వీరిలో అఖిల్, అభిజిత్, దివి లకు ఓటింగ్ బాగా వచ్చిందని తెలుస్తోంది. వీరు ముగ్గురూ ఓటింగ్ ప్రారంభం అయిన దగ్గరనుంచీ వీరు సేఫ్ జోన్ లో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన వారిలో కుమార్ సాయి, మోనాల్, అరియానా.. వీరి మధ్య ఎలిమినేషన్ కి పోటీ జరిగింది. అయితే, వీరి ముగ్గురి లోనూ మోనాల్ కు అతి తక్కువ ఓట్లు వస్తున్నట్టు చెబుతున్నారు. హౌస్ లో ఓటింగ్ ఎలా ఉందనేది ఎవరికీ తెలిసే అవకాశం లేదు. కానీ, బయట వివిధ సోషల్ మీడియాల్లో జరిగిన ఓటింగ్ ల్లో మోనాల్ బయటకు వెళ్లిపోవాలనే అభిప్రాయాన్ని అత్యధికులు వెల్లడించారు. అరియానా, కుమార్ సాయి మాత్రం ఆమె కంటె చాలా దూరంలోనే ఉన్నారు.

పాపం కుమార్ సాయి..

అయితే, ఈవారం బిగ్ బాస్ మాత్రం పెద్ద ట్విస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మోనాల్ కచ్చితంగా ఎలిమినేట్ అయ్యే పరిస్థితులు ఉన్నా ఆమెను సేవ్ చేశారని తెలుస్తోంది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం.. బయటకు లీక్ అయిన విషయాల ప్రకారం మోనాల్ హౌస్ లో ఉండాలని నిర్ణయించిన టీం కుమార్ సాయి మీద వేటు వేసినట్టు తెలిసింది.

కుమార్ సాయి ఈ ఆదివారం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంతవరకూ అందిన సమాచారం ప్రకారం మోనాల్ ను రక్షించడానికి కుమార్ సాయిని బయటకు పంపించారు. మరి ఇది ఎంత వరకూ నిజమో తేలాలంటే కొద్ది గంటలు ఎదురు చూడాల్సిందే. నిజంగా కుమార్ సాయి ఎలిమినేట్ అయితే మాత్రం అతనికి తీవ్రమైన అన్యాయం జరిగిన విధంగానే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే కుమార్ సాయి పద్ధతైన ఆట తీరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు. ఈ దశలో అతన్ని బయటకు పంపించేస్తే అది అన్యాయమే అవుతుందని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

శనివారం ఇలా అయింది..

వారాంతంలో బిగ్ బాస్ మజా వేరు. ఆదివారం ఒక హౌస్ మేట్ ఇంటినుంచి వెళ్ళిపోతారు. దానికి ప్రిపరేషన్ శనివారం మొదలవుతుంది. నాగార్జున వస్తారు ఎలిమినేషన్ కి నామినేట్ అయిన వారిలో ముగ్గురు.. నలుగురిని సేవ్ అయినట్టు ప్రకటిస్తారు. గత వారం టాస్క్ లో తప్పు ఒప్పులు ఎత్తి చూపిస్తారు. ఈ వారమూ అదే జరిగింది. నిజానికి నాగార్జున ఈ వారం బిగ్ బాస్ లో కనిపించరంటూ రెండు రోజులుగా ప్రచారం జరిగింది. కానీ, శనివారం నాగార్జునే హోస్ట్ గా వచ్చారు. వచ్చీ రాగానే టాస్క్ లో రెచ్చిపోయిన అవినాష్ కి తన తప్పు ఏమిటో చెప్పారు. తరువాత సోహైల్ కోపాన్ని బాగా తగించుకున్నాడు అంటూ ప్రశంసించారు. ఇక హౌస్ మేట్స్ ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారో చెప్పించారు. వీటి మధ్యలో నామినేషన్ లో ఉన్న ఒక్కోరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు. ఈ వారం నామినేషన్స్ లో లాస్య, అభిజిత్, మోనాల్, అఖిల్, కుమార్ సాయి, దివి, హారిక, నోయల్, అరియానా తొమ్మిది మంది ఉన్నారు.

వారిలో మొదటగా లాస్యను సేఫ్ అని ప్రకటించారు నాగార్జున. తరువాత నోయల్ సేవ్ అయినట్టు ప్రకటించారు. తరువాత ఎవరు సేఫ్ అయితే బావుంటుంది అని నోయల్ ను అడిగారు నాగార్జున. హారిక అయితే బావుంటుంది అని చెప్పాడు నోయల్. దీంతో నాగార్జున స్విమ్మింగ్ పూల్ లో ఉన్న కాయిన్ తీసుకు రమ్మని నోయల్ కు చెప్పారు. ఆ కాయిన్ పై హారిక ఫోటో ఉంది. దీంతో ఆమె సేఫ్ అయినట్టు ప్రకటించారు..

అమ్మ రాజశేఖర్.. అరియానా త్యాగం..

గత వారం టాస్క్ సందర్భంగా మోనాల్ తొ వేయించిన డ్రెస్ మార్చుకునే అవకాశం ఇచ్చారు నాగార్జున. ఆరు రోజులుగా అదే డ్రస్ తో ఉన్న మోనాల్ డ్రస్ మార్చుకోవాలంటే.. ఆమె టీం లో వేరే ఎవరైనా ఒక్కరోజు పాటు ఆ డ్రస్ వేసుకోవాలని చెప్పారు నాగార్జున. అరియానా ఆ పని చేయడానికి ముందుకు వచ్చింది. దాంతో మోనాల్ డ్రస్ మారింది. ఇక హాఫ్ షేవ్ టాస్క్ ను అందరూ రిజెక్ట్ చేశారు అప్పట్లో. దానిని ఇప్పుడు చేయాలని నాగార్జున చెప్పారు. ఎవరు ఆ టాస్క్ చేస్తే వారికి వచ్చే వారం నామినేషన్స్ నుంచి వెసులుబాటు ఉంటుంది అని చెప్పారు. దీంతో అమ్మ రాజశేఖర్ ఆ టాస్క్ చేయడానికి సిద్ధం అయ్యారు. దివి ఆ టాస్క్ చేస్తున్నందుకు చాలా ఎమోషనల్ అయింది. మొత్తమ్మీద ఎమోషన్స్ మధ్యలో అమ్మ రాజశేఖర్ కు నోయల్ అరగుండు చేశాడు. ఈ టాస్క్ చేసినందుకు గాను అమ్మ రాజశేఖర్ కు వచ్చే వారం ఇమ్యునిటీ లభించింది.

మొత్తమ్మీద మరో వారం అమ్మ రాజశేఖర్ కు లైఫ్ వచ్చింది అని చెప్పవచ్చు. ఇప్పటికే బయట ప్రేక్షకుల్లో అమ్మ రాజశేఖర్ పై వ్యతిరేకత వస్తోంది. వచ్చేవారం నామినేట్ అయితే ఆయన బయటకు వెళ్ళడానికి వీలుగా ఓటింగ్ ఎక్కువ జరుతుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో బిగ్ బాస్ ఆయనకు మరో వారం లైఫ్ ఇచ్చినట్టు అయింది.

Web TitleBigg Boss 4 Telugu Bigg Boss 6th week eliminations rumors spreading that Kumar sai get eliminated from the house for safeguard monal
Next Story