Bigg Boss 4 Telugu: సూర్యకిరణ్.. నీ టాలెంట్ సూపరో సూపర్! ఎలిమినేషన్లో అదరగొట్టిన దర్శకుడు!!

Bigg Boss 4 Telugu: సూర్యకిరణ్.. నీ టాలెంట్ సూపరో సూపర్! ఎలిమినేషన్లో  అదరగొట్టిన దర్శకుడు!!
x
Bigg Boss 4 telugu Surya Kiran elimination 
Highlights

Bigg Boss 4 : హౌస్ లో ఉన్నంత సేపూ విసిగించారు.. బయటకు వచ్చిన వెంటనే అబ్బో అనిపించారు.. మొదటి వారమే సామాను సర్దేసిన దర్శకుడు సూర్యకిరణ్!

కొంతమంది తమ ఫీలింగ్స్ అసలు దాచుకోలేరు. తాము ఎక్కడ వున్నామనే విషయాన్నీ మర్చిపోయి.. చటుక్కున ఏదో ఒకటి చేసేసి గబుక్కున దొరికిపోతారు. అదిగో..అలాంటి వారే డైరెక్టర్ సూర్యకిరణ్! బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లోకి అట్టహాసంగా ఎంట్రీ ఇచ్చిన సూర్యకిరణ్ ఒక్క వారంలోనే బయటకు వచ్చేశారు నిరాశగా. మొదటి రోజు నుంచీ ప్రేక్షకులకు సూర్యకిరణ్ నచ్చలేదు. కొద్దిగా అందరినీ డామినేట్ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది అందరికీ. హౌస్ లో ప్రతి విషయంలోనూ వేలు పెడుతున్నట్టు కనిపించింది. హౌస్ మేట్స్ కూడా చాలా సార్లు ఆయనను విసుక్కున్నారు మొహం మీదే. అయితే, సూర్యకిరణ్ తను ఆడటానికి వెళ్ళిన విషయాన్ని మర్చిపోయినట్టు కనిపించింది. ఆ విషయం ఆయనకు అర్ధం అయ్యేటప్పటికి బయట నాగార్జున పక్కన ఉన్నారు. ఆయన తాను ఎలిమినేట్ అయ్యాను అనే విషయాన్ని కూడా వెంటనే నమ్మలేకపోయారు. చాలా నిరాశతో నాగార్జున దగ్గరకు వచ్చారు. ఇక వీకెండ్ మసాలా కోసం నాగార్జున బయటకు వెళుతున్న వారితో ఎదో ఒక ఫిటింగ్ పెట్టిస్తారుగా అదే చేశారు. కొన్ని జంతువుల ఫోటోలు పెట్టి.. వాటిని హౌస్ లో ఉన్నవారితో అన్వయించమని చెప్పారు. అయితే కారణం కూడా చెప్పమన్నారు.

ఇదీ సూర్యకిరణ్ టాలెంట్!

ఇక్కడ సూర్యకిరణ్ అసలు ఏమాత్రం తడబడలేదు. ఎంతో ప్రాక్టీస్ చేసిన వాడిలా..చాలా సులువుగా ఒక్కో జంతువుకూ ఒక్కోరి పేరు ధనాధనా తగిలించేశారు. ఆ పేర్లు తగిలించడం గొప్పకాదు కానీ.. ఎందుకు ఆ జంతువుతో వారిని పోల్చారనే విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా స్పస్తంగా చెప్పారు. అదీ అందరినీ పడేసిన విషయం. ఎవరినైనా కుక్కతో పోలిస్తే ఎంత నొచ్చుకుంటారు? ఇంకెవరినైనా పాముతో కంపేర్ చేస్తే ఎంత బాధపడతారు? నక్క అని ఎవరినైనా అంటే ఎంత కోపం వస్తుంది.. కోతి అని అంటే ఎవరినైనా అంటే ఎలా రియాక్ట్ అవుతారు.. కచ్చితంగా అలా పోల్చినవాడిని బండ బూతులు డైరెక్ట్ గానే తిడతారు. అంతే కాదు ఎదురుకుండా ఉంటె మీదపడి కరిచేస్తారు.. కానీ అలాంటి పని చేసి కూడా అందరితో సూపర్ అనిపించుకున్నారు సూర్యకిరణ్. ఆయన ఎలా ఒక్కో జంతువునూ సమర్ధించుకుంటూ వచ్చారంటే..

మొదట మోనాల్ ను నేమలితో పోల్చారు. నెమలి వర్షం వచ్చినపుడు వస్తుందనీ.. కన్నీరు కారుస్తూనే ఉంటుందనీ అన్వయిస్తూ మోనాల్ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి రాగాలు తీస్తున్న విషయాన్ని చెబుతూ అందుకే నేమలితో పోల్చానని చెప్పారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో గ్రేటెస్ట్ సెలబ్రిటీ గంగవ్వ ను చీమతో పోల్చారు. దానికి రీజన్ ఆయన ఇలా చెప్పారు.. ''చీమ తనకన్నా 30 రెట్ల బరువు మోస్తుంది. నువ్వు కూడా నీ జీవితంలో 30 రెట్ల కష్టాల్ని మోశావు కదవ్వా.. ఒక చీమ ముందు దారి చూపిస్తుంటే తరువాత చీమలన్నీ దానిని అనుసరిస్తాయి. అలా నీవు మహిళలందరికీ..మార్గదర్శివి గంగవ్వా అని చెప్పాడు. ఇక ఇంతవరకూ కొంచెం పాజిటివ్ గా భావించే జంతువులే కదా సులువుగా చెప్పేశారని అనుకోవద్దు. లాస్యను గాడిదతో పోల్చారు. లాస్య షాక్.. దానిని సూర్య ఎలా సమర్ధించారో తెలుసా.. హౌస్ కి కెప్టెన్ వి కదా..అది ఎంత బరువు? గాడిదలా ఆ బరువును బాధ్యతగా మోయాలి కదా న్నారు. అంతే అందరూ ప్లాట్, ఇక జోర్దార్ సుజాత ను కుక్కతో పోల్చారు. ఇక ఆ జడ్జిమెంట్ కి ఇచ్చిన కవరింగ్ కి నాగార్జునా పడిపోయారు. కుక్కకు విశ్వాసం ఎక్కువ. అదేవిధంగా అందరికీ పెంపుడు జంతువు. హౌస్ లో సుజాత అందరికీ ఇష్టమైన పెట్ అంటూ బిస్కట్ వేశారు. నాగార్జున అమ్మా సుజాతా జాగ్రత్త బిస్కట్లకు పడిపోకు అంటూ కౌంటర్ వేశారు. కల్యాణి ని కోతితో పోల్చారు సూర్యకిరణ్. ఎందుకంటే కోటి ఒక చోట స్థిరంగా ఉండదట. ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టుకి ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టుకు దూకుతూ ఉంటుందట. కల్యాణి కూడా అలాగే ఎప్పుడూ ఒకరిని నమ్మదంటూ చెప్పుకొచ్చారు సూర్యకిరణ్. ఇక నోయల్ ను నక్క తో పోల్చారు. అతిగా ఆలోచించడం నక్క లక్షణం అది నోయల్ కు బాగా ఉంది అని చెప్పారు. తరువాత హారిక ను పాముతో పోల్చారు. పాములా చురుకైన దానివి కానీ.. విషం మాత్రం ఎవరిమీదా చిమ్మకు అంటూ పంచ్ వేశారు. మెహబూబ్ ను గద్దతోనూ, అభిజిత్ ను పిల్లితోనూ సోహైల్ ను ఎలుకతోనూ పోల్చి కవరింగ్ ఇచ్చిన సూర్యకిరణ్.. దేవి నాగావల్లిని మొసలితో పోల్చారు. మొసలి లా దేవి చాలా సస్ట్రాంగ్ అంట. ఒక విషయం నమ్మి పట్టుకుంటే మొసలి లా వదలదని చెప్పారు సూర్యకిరణ్. విష్ణుమూర్తి వచ్చినా సరే ఎటువంటి పరిస్థితిలోనూ నమ్మిన దానిమీదే స్టాండ్ అయి ఉండేంత స్ట్రాంగ్ దేవి అని కితాబు ఇచ్చారు సూర్యకిరణ్. ఇక చివరగా తన మిత్రుడు అమ్మ రాజశేఖర్ ను సింహంతో పోల్చి తన మిత్ర ధర్మాన్ని చాటి చెప్పారు.

మొత్తమ్మీద సూర్యకిరణ్ వెళుతూ వెళుతూ ప్రేక్షకులకు కొంత పంచ్ వేశారనే చెప్పాలి. ఆదివారం ఎపిసోడ్ లో ప్రేక్షకులకు ఉత్సుకత రేకెత్తించిన పార్ట్ సూర్యకిరణ్ ఎలిమినేషన్ తరువాత మాట్లాడిన విధానమే అని చెప్పాలి. తనకున్న దర్శకత్వ ప్రతిభ.. స్క్రిప్ట్ ప్రతిభను అప్పటికప్పుడు బయటకు తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. హౌస్ లో ఉన్నంత వరకూ ఆయన తన పంతాతో అందర్నీ విసిగించారు. కానీ, వెళ్ళే చివరి క్షణాల్లో తనలోని రెండో కోణంతో అందరినీ ఒక్క క్షణం ఔరా అనిపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories