logo
సినిమా

అఖిల్‌ ఫేక్ ఎలిమినేషన్‌..? వెక్కివెక్కి ఏడ్చిన సోహైల్‌, మోనాల్‌..

అఖిల్‌ ఫేక్ ఎలిమినేషన్‌..? వెక్కివెక్కి ఏడ్చిన సోహైల్‌, మోనాల్‌..
X
Highlights

బిగ్‌బాస్ రసవత్తరంగా మారింది. హౌస్‌లో స్ట్రాంగ్‌ ఎవరో తేల్చుకోమ్మంటూ బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చారు. దాంతో అందరూ...

బిగ్‌బాస్ రసవత్తరంగా మారింది. హౌస్‌లో స్ట్రాంగ్‌ ఎవరో తేల్చుకోమ్మంటూ బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చారు. దాంతో అందరూ కలిసి అఖిల్ పేరును ఫైనల్ చేశారు. ఇకపై ఇంట్లో అఖిల్ ఉండడు అని అర్ధమైన మోనాల్ వెక్కి వెక్కి ఏడ్చింది. అయితే రసవత్తరంగా సాగే సీక్రెట్ టాస్క్ ఈ సారి పస లేకుండా పోయినట్టు కనిపిస్తోంది. బలమైన కంటెస్టెంట్ లేకుండా టాస్క్‌ను ప్రేక్షకులు మిస్‌ అవుతున్నారు.

65 వ రోజు.. బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు పెద్ద టాస్క్ ఇచ్చారు. హౌస్‌ను లాక్‌ చేసి ఫైనల్ వరకు మీ ప్రయాణాన్ని కొనసాగించాలంటే ఒక వ్యక్తిని ఇంటి నుంచి పంపించాలంటూ కోరారు విజేతకు అడ్డుపడుతున్న వ్యక్తిని ఇంటి సభ్యులంతా కలిసి పంపించేందుకు నిర్ణయం తీసుకోవాలని బిగ్‌బాస్ కోరారు. బిగ్‌బాస్ ఇచ్చిన నిర్ణయంపై హౌస్ కంటెస్టంట్స్‌ మధ్య డీప్ డిస్కషన్ జరిగింది. సోహైల్, అవినాష్, హారికలు ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు. తనకు ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ కాదని తాను ఎవరి పేరు చెప్పలేనని అభిజీత్ చెప్పాడు. తన గురించి తాను తెలుసుకునేందుకు మాత్రమే వచ్చానని తెలిపాడు. బిగ్‌బాస్ ఇంటి సభ్యులందరి ఏకభిప్రాయంతో ఒకరి పేరు చెప్పడంతో ఎంతకూ చెప్పకపోవడంతో బిగ్‌బాస్ హెచ్చరించాడు. కొంతమంది చెప్పారు. కానీ, ఇంకొంత మంది చెప్పకపోవడంతో వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు ఇంటి సభ్యులు గార్డెన్ ఏరియాలోకి వచ్చి ఒక్కొక్కరి పేరు చెప్పారు.

స్ట్రాంగ్ కంటెస్టంట్‌గా భావించి ఇంటి నుంచి పంపించేందుకు ఒకరి పేరు చెప్పమన్న బిగ్‌బాస్‌కు హౌస్ మెంబర్స్ షాక్ ఇచ్చారు. లాస్య, అఖిల్, అభిజిత్ తమ పేర్లు తామే చెప్పుకున్నారు. హారిక అందరితో పాటు ఓకే నని చెప్పింది. మోనాల్, అరియాణా కలిసి అఖిల్ పేరు చెప్పారు. మొహబూబ్, అవినాష్ అరియాణా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పారు. దీంతో హౌస్‌లో చర్చ జరిగింది. తనకు ప్రధాన పోటీదారుడు, స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా సోహైల్ మొహబూబ్ పేరు చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వాదోపవాదలు జరిగాయి. దాంతో సోహైల్ కొద్దిగా ఎమోషన్ అయ్యాడు. అతడిని అఖిల్ ఓదార్చాడు.

ఇంటి సభ్యులంతా ఒక ఏకాభిప్రాయానికి రావడానికి ప్రయత్నించారు. సోహైల్ ఫైనల్‌గా అఖిల్ పేరు చెప్పాడు. అయితే అభిజీత్ మాత్రం ఒకరి పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. అందరు యాక్సెప్ట్ చేసిన అభిజీత్ మాత్రం అంగీకరించలేదు. అఖిల్ లాగే సోహైల్, మోనాల్ గేమ్ ఈజ్ గేమ్ అని ఆలోచించారు. చివరకు అందరూ ఏకాభిప్రాయంతో అఖిల్ పేరు ఇంటి సభ్యుల తరుపున సోహైల్ చెప్పాడు. దాంతో అఖిల్ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు ఆపుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు. అఖిల్ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. అందరూ ఏడుస్తూ సాగనంపారు.

ఇంటి సభ్యులు అఖిల్‌ బయటకు వెళ్లిపోయినట్టు భావించారు. కానీ, అఖిల్‌ను బిగ్‌బాస్ సీక్రెట్ రూంకి తరలించారు. అ‌ఖిల్ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఇంటి సభ్యులు ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. సోహైల్, మోనాల్ కన్నీళ్ల పర్యంతం అవగా అభిజీత్ మాత్రం కనీసం దగ్గరకు కూడా వెళ్లలేదు. దీనిపై లాస్య, అభి, హారిక మోనాల్ తీరు మీద చర్చలు పెట్టారు. ఆశం పాశం సాంగ్‌తో 66వ రోజు తెల్లవారింది. దాన్ని అఖిల్ టీవీలో చూశాడు. అయితే అఖిల్ ఇంటి నుంచి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేక సోహైల్, మోనాల్ ఎక్కి ఎక్కి ఏడ్చారు. అఖిల్‌ను తలుచుకుని మోనాల్ కన్నీళ్లు కార్చడం చూసి ఫీలయ్యాడు. అఖిల్ కూడా కొద్దిసేపు ఎమోషనల్‌ అయ్యాడు.

ఇక కెప్టెన్సీ టాస్క్‌లో సోహైల్ బయటకు వచ్చేయడం ఏంటని అభి హారికతో అన్నాడు. సోహైల్, మొహబూబ్, అఖిల్ గొడవ పడి పది రోజులు మాట్లాడుకోలేదు అనడంతో ఇది పెద్ద అబద్ధం మంటూ అఖిల్ లోపల నుంచే దండం పెట్టాడు. అఖిల్ ఇంటి నుంచి వెళ్లిపోయాక ఇల్లు చాలా సైలెంట్‌గా అయిపోయిందని మోనాల్ వెలితిగా ఫీలవుతుంటే తనకు మాత్రం ఎప్పిటిలాగే ఉందని అభి కౌంటర్ ఇచ్చాడు. కొన్ని కొన్ని వాటిలో ఏమోషనల్ కాకపోవడం మంచిదని అఖిల్‌ను ఉద్దేశించి అభిజిత్ వ్యాఖ్యనించారు. ఇక ప్రొమోలో మాత్రం బిగ్ బాస్ బిగ్ టాస్క్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఎవ్వరితోనూ షేర్ చేసుకుని విషయాన్ని చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించాడు.

Web TitleBigg boss 4 Telugu: Akhil fake elimination
Next Story