బిగ్‌బాస్ ట్రోఫీ గెలుచుకునేందుకు హోరాహోరీగా పోరు : రేస్ టు ఫినాలే‌కి శంఖం పూరించిన..

బిగ్‌బాస్ ట్రోఫీ గెలుచుకునేందుకు హోరాహోరీగా పోరు : రేస్ టు ఫినాలే‌కి శంఖం పూరించిన..
x
Highlights

ఫినాలే వీక్‌కు మధ్యలో ఒకే వారం గ్యాప్ ఉండటంతో ఆటలో వేగాన్ని పెంచాడు బిగ్‌ బాస్‌. అందుకు ఫినాలే టిక్కెట్ టాస్కును ప్రారంభించేశాడు. షోలో ఫినాలే టాస్క్...

ఫినాలే వీక్‌కు మధ్యలో ఒకే వారం గ్యాప్ ఉండటంతో ఆటలో వేగాన్ని పెంచాడు బిగ్‌ బాస్‌. అందుకు ఫినాలే టిక్కెట్ టాస్కును ప్రారంభించేశాడు. షోలో ఫినాలే టాస్క్ రచ్చ రచ్చగా మారింది. టాస్క్‌లో సత్తా చాటేందుకు హౌస్‌లో ఉన్న ఏడుగురు సభ్యులు పోటీ పడ్డారు. అసలే ఫైనల్ కదా అందుకే ఆ టెంపో కూడా కంటెస్టెంట్స్‌లో కనిపించింది. ఈ ఫినాలే టాస్కులో ఎవరు బాగా ఆడతారు.. ఎవరు గెలిచారన్న విషయాన్ని పక్కన పెడితే అవినాష్ ఫ్రస్ట్రేషన్, అరియానా అసహనం, గ్రూపులుగా మారి ఆటలు ఆడటంపై ఇంట్లో గొడవలు జరిగాయి. మరి సొహైల్-అఖిల్ కంబైండ్‌గా ఆడి లెవల్ టుకి వెళ్లారా?? అభిజిత్ ఈ ఫిజికల్ టాస్క్‌లో సత్తా చాటాడా?? అవినాష్ తనని ఎలిమినేట్ చేసి పారేయండని ఎందుకు ఆగ్రహించాడన్న ముచ్చట్లు 87వ ఎపిసోడ్‌లో చూద్దాం.

ఇంటిలో ఫినాలేకు తొందరతొందరగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో ఫినాలేకు మార్గం వేసిన బిగ్‌బాస్ 86వ రోజున రోడ్ టూ ఫినాలే అనే గేమ్‌ను ఇంటి సభ్యుల ముందుకు తెచ్చాడు. ఇంటిలోని లాన్‌లో ఆవు బొమ్మను ప్రతిష్టించిన నిర్వాహకులు దాని నుంచి వచ్చే పాలు పట్టుకొని అత్యధికంగా సీసాల్లో నింపాలని, తక్కువగా వచ్చిన వారు లెవెల్ టూ నుంచి బయటకు వెళ్తారని సూచించాడు. అయితే గేమ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

ఇంట్లో రేస్ టు ఫినాలే మొదలైంది. రేస్ టు ఫినాలే... లెవెల్ 1లో ఇంటి సభ్యులు ఆవు పొద నుంచి వచ్చే పాలను పట్టుకొనేందుకు ప్రయత్నించారు. ఎవరెక్కువ బాటిల్స్ పాలు పడతారో వారు తర్వాతి రౌండ్ కి క్వాలిఫై అవుతారు. దీంతో తమ వద్ద క్యాన్స్‌లలో పాలు నింపుకొనేందుకు ఇంటి సభ్యులు తంటాలు పడ్డారు. ఒకరినొకరు తోసుకొంటూ క్యాన్లలో పాలు నింపుకొనేందుకు గొడవ పడ్డారు. పాలు పట్టుకునేటప్పుడు అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాలు పట్టుకొనేందుకు ప్రయత్నిస్తుండగా తనను మోనాల్ కాలితో తన్నిందంటూ అవినాష్ గట్టిగా అరిచాడు.

మరోవైపు తమ వద్ద క్యాన్లలో పాలు నింపుకొనే క్రమంలో అఖిల్, సోహెల్, అవినాష్‌కు మధ్య గొడవ జరిగింది. గేమ్ ఆడనంటూ అవినాష్ మొండికేశాడు. అంద‌రూ క‌లిసి త‌న‌కు ద‌క్కకుండా పాలు ప‌ట్టుకుంటున్నార‌ని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వ్యక్తిగ‌తంగా కాకుండా టీమ్‌గా ఏర్పడి ఆడుతున్నార‌ని అస‌హ‌నంతో ఊగిపోయాడు. అంద‌రూ స‌పోర్ట్ చేసుకుంటూ ఆడుతున్నారు క‌దా‌, నాకు సపోర్ట్‌ చెయ్యవా అని అరియానా అడిగితే అవినాష్‌ శివాలెత్తిపోయాడు. చివరికి ఆడనంటూ బయటకు వెళ్లిపోయాడు.

రంజుగా సాగుతున్న టాస్క్‌లో అవినాష్‌ అతి తెలివి ఉపయోగించాడు. ఆ అతితెలివి నీళ్లపాలైంది. టాస్కులో బాగా శ్రమించాలి అన్న బిగ్ బాస్ మాటలని బాగా సీరియస్ గా తీసుకున్న అవినాష్, ఎలాగైనా గెలవాలనే ప్రయత్నంలో అందరితో గొడవ కూడా పెట్టుకున్నాడు. అవినాష్ చేసిన పని అస‌లుకే ఎస‌రు వచ్చింది. అవినాష్‌ చేసిన పని రూల్స్‌కు వ్యతిరేకం కావడంతో బిగ్‌ బాస్‌ కీలక ఆదేశాలు జారీ చేశాడు.

ఆవు బొమ్మ వద్ద పాలు పట్టుకోవడం మానేసి తన క్యాన్‌తో ఇంటిలోకి వెళ్లాడు. దిక్కులు చూస్తూ ఎవ‌రూ త‌న‌ను చూడ‌టం లేద‌ని నిర్దారించుకున్నాక కిచెన్‌లోని పాలు, నీళ్లన్నింటినీ క్యాన్‌లో నింపుకోవ‌డం ప్రారంభించాడు. అలాగే ఫ్రిజ్‌లో పాలను తన క్యాన్‌లోకి పోసుకొని భారీగా సీసాలను పాలతో నింపేశాడు. ఇక అవినాష్‌పై అందరికి అనుమానం వచ్చింది. కంటెస్టెంట్లు ఇలా నీళ్లు కలుపుకోవచ్చా అంటూ అడగడంతో అవినాష్ చేసిన పని రూల్స్‌కు వ్యతిరేకం. కాబట్టి ఈ గేమ్ నుంచి అవినాష్‌ను తప్పిస్తున్నామంటూ బిగ్‌బాస్ ఆదేశాలు జారీ చేశాడు. త‌ను రేసు నుంచి నిష్క్రమించ‌డాన్ని అవినాష్‌ జీర్ణించుకోలేక‌పోయాడు. రేస్ టు ఫినాలే ఇలా పెడ‌తారా? అని బిగ్‌బాస్‌పై అస‌హ‌నం వ్యక్తం చేశాడు.

టాస్క్‌లో సొహైల్, అఖిల్‌లు తొలి నుంచి కండ బలం ఉపయోగించి ఒకరికొకరు హెల్ప్ చేసుకుని కంబైండ్ గేమ్ ఆడగా అభిజిత్, హారికలు ఎవరికి వారే అన్నట్టుగా గేమ్ ఆడి టాస్క్‌లో నిలిచారు. ఇక కామన్‌గా అఖిల్, అభిజిత్ మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. అరియానా గుక్కపెట్టి ఏడవడంతో నువ్వు టాప్ 5లో ఉంటావని అవినాష్ ఓదార్చాడు. పాలను నింపే క్రమంలో సోహెల్, అఖిల్ ఇద్దరు కంబైన్ట్‌గా ఆడటంపై అభిజిత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇలా గేమ్‌ను కలిసి ఆడటం సరికాదన్నాడు. ఈ నేపథ్యంలో అఖిల్, అభిజిత్ మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు హారిక మొద‌ట త‌న‌ద‌గ్గర 14 బాటిళ్లు ఉన్నాయ‌ని చెప్పింద‌ని, కానీ బిగ్‌బాస్‌కు మాత్రం 11 అని చెప్పడంతో అఖిల్‌కు అనుమానం వ‌చ్చింది.

ఫినాలే గేమ్‌లో భాగంగా తక్కువగా సీసాలో పాలు నింపిన అరియానాను ఆట నుంచి తప్పించాడు. ఈ రౌండ్‌లో అరియానా అవుట్ అవ‌డంతో ఆమె గుక్కపెట్టి ఏడ్చింది. ఫినాలేలో ఉంటానో ఉండ‌నో అని భ‌య‌మేస్తుందంటూ అవినాష్‌ను హ‌త్తుకుని బాధ‌ప‌డింది. మూడో రౌండ్‌లో త‌క్కువ బాటిళ్లు నింపిన కార‌ణంగా మోనాల్ నిష్క్రమించింది. చివరకు గేమ్‌లో హారిక దేత్తడి, అఖిల్, అభిజిత్, సోహెల్ మిగలడంతో వారిని లెవెల్‌ 2కు ప్రమోట్ చేశాడు.

మొత్తంగా ముగ్గురు కండ బలం ఉన్న మగాళ్లతో ఆడి గెలచి హారిక తన సత్తా మరోసారి చాటింది. ఇక ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవుతాడా, లేదా ఏదైనా మ్యాజిక్ జరిగి మళ్ళీ సేవ్ అవుతాడా అన్నది చూడాలి. ఇక లెవల్ 2లో భాగంగా ఈ నలుగురు సభ్యులతో పూలు విసురుడు కార్యక్రమాన్ని షురూ చేశాడు బిగ్ బాస్. ఆ రచ్చలో సొహైల్-హారికలు వార్‌కి దిగుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories