Bigg Boss 4: అలా..కుమార్ కథ ముగిసింది.. బిగ్ బాస్ నీ స్క్రీన్ ప్లే సూపర్!!

Bigg Boss 4: అలా..కుమార్ కథ ముగిసింది.. బిగ్ బాస్ నీ స్క్రీన్ ప్లే సూపర్!!
x

Bigg Boss 6th week eliminations

Highlights

Bigg Boss 4: కుమార్ సాయిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించారు.

అనుకున్నట్టే అయింది. ఏమీ ట్విస్ట్ లు లేవు. ప్రోమో లో కనిపించిన హడావుడీ లేదు. కేవలం మోనాల్-అఖిల్ మధ్య ఎదో ఉందనే భావనని మరింత పెంచడం తప్ప ఆదివారం బిగ్ బాస్ ఎపిసోడ్ లో చెప్పుకోదగ్గది ఏమీ జరగలేదు. లీకుల్లో నిన్నటి నుంచి కుమార్ సాయి హౌస్ బయటకు వచ్చేస్తారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. అదే జరిగింది. ఇకపొతే ఈరోజు బిగ్ బాస్ ప్రోమోలో మోనాల్.. కుమార్ సాయి ఇద్దర్నీ బట్టలు సర్దుకోమని నాగార్జున చెప్పినట్టు చూపించారు. దాంతో ఏదైనా ట్విస్ట్ అవుతుందని బిగ్ బాస్ అభిమానులు భావించారు. కానీ.. అటువంటిది ఏమీ లేకుండానే కుమార్ సాయి నిష్క్రమణ పూర్తి అయిపొయింది.

సన్ డే ఫన్ డే అంటూ నాగార్జున మామూలుగానే హౌస్ మేట్స్ ని.. ప్రేక్షకుల్ని పలకరించేశారు. ఇక ఆదివారం జరగాల్సిన కార్యక్రమం అదే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు పెట్టేశారు. ఫన్నీ గేమ్స్ ఆడిస్తూ నామినేషన్ లో ఉన్న అరియనా, అభిజీత్, అఖిల్, దివి లను ఒక్కొరినీ సేఫ్ అని ప్రకటించారు. ఇక చివరిగా మోనాల్, కుమార్ సాయిని డేంజర్ జోన్ లో పెట్టారు.

పాపం కుమార్ సాయి..

చివరికి మిగిలిన కుమార్ సాయి, మోనాల్ లను ఇద్దర్నీ బట్టలు సర్దుకోమని చెప్పారు నాగార్జున. దీంతో హౌస్ లో కలకలం. మోనాల్ వెళ్ళిపోతోందని అందరూ ముఖ్యంగా అఖిల్ విపరీతంగా బాధ పడ్డాడు. కన్నీళ్లు పెట్టాడు. మోనాల్ అతని దగ్గరకు వెళ్లి గట్టి హగ్ ఇచ్చి బాధ పడొద్దని చెప్పి కుమార్ సాయితో కలసి కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళింది. కుమార్ సాయి మాత్రం అందరికీ నవ్వుతూ బాయ్ చెప్పి కన్ఫెషన్ రూమ్ చేరుకున్నాడు. అక్కడ నుంచి నాగార్జున కుమార్ సాయి ని నేరుగా స్టేజి మీదకు పిలిచేశారు. దీంతో కుమార్ సాయి బిగ్ బాస్ జర్నీ ముగిసిపోయింది. వైల్డ్ కార్డు ఎంట్రీగా అడుగుపెట్టిన దగ్గరనుంచీ హౌస్ మేట్స్ అందరూ కుమార్ సాయిని టార్గెట్ చేస్తూ వచ్చారు. అన్ని సార్లు అతన్ని నామినేట్ చేశారు. ఒక్కసారి మాత్రం కుమార్ సాయి కెప్టెన్ గా గెలిచి నామినేషన్ తప్పించుకున్నాడు. హౌస్ లో కుమార్ సాయి ప్రవర్తనపై ప్రేక్షకులు పాజిటివ్ గానే ఉన్నారు. పైగా బయట జరిగిన అన్ని రకాల పోల్స్ లోనూ మోనాల్ ను హౌస్ నుంచి వెంటనే పంపించేయాలన్నంత వ్యతిరేకత వ్యక్తం అయింది. కానీ, అది బిగ్ బాస్ కదా.. ప్రేక్షకుల అభిప్రాయాలకంటే సెన్సేషన్ కె ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. మోనాల్ హౌస్ లో ఉండడం బిగ్ బాస్ కు అవసరం అంతే! పాపం.. కుమార్ సాయి అని మాత్రమే ప్రేక్షకులు అనుకోగలరు.

మోనాల్ సంబరం.. హౌస్ లోకి వచ్చిన మోనాల్ హగ్గులు సంబరం జరిపింది. మొత్తం హౌస్ లో ఉన్న అందరికీ హగ్గులు పంచిపెట్టింది. అయితే, అఖిల్ కు మాత్రం ప్రత్యేకంగా హగ్ లు పంచిందని వేరే చెప్పక్కర్లేదు. వారి మధ్య కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే రొమాన్స్ కంటే ఎక్కువగా కనిపించింది.

బిగ్ బాంబ్ అమ్మ రాజశేఖర్ మీద..

వెళుతూ వెళుతూ కుమార్ సాయి బిగ్ బాంబ్ అమ్మ రాజశేఖర్ మీద వేసి పోయాడు. దాని ప్రకారం వచ్చే వారం అంతా రాజశేఖర్ వాష్ రూమ్స్ క్లీన్ చేయాలి. ఇక హౌస్ మేట్స్ ని కూరగాయలతో పోల్చ మన్నారు నాగార్జున. దానికి కుమార్ సాయి.. అరియానా ను ఉల్లిపాయ తోనూ, అవినాష్ ను అరటిపండు తోనూ, అఖిల్ ను కరివేపాకు తోనూ, రాజశేఖర్ ను కాకరకాయ తోనూ, అభిజీత్ ను కీరదోస తోనూ, లాస్యను మొక్క జొన్న తోనూ, నోయల్ ను క్యాబేజీ తోనూ, సోహెల్ ను వేరుశెనగ తోనూ, దివి ని పైనాపిల్ తోనూ, హారిక ను వంకాయ తోనూ చివరగా మెహబూబ్ ను బాయిల్డ్ ఎగ్ తోనూ పోల్చాడు.

మూడింటిలో రెండు తీరలేదు.. చివరిది మీ చేతుల్లోనే..

కుమార్ సాయి నాగార్జున తో మాట్లాడుతూ ''నేను హౌస్ లోకి వెళ్లేముందు మీకు నావి మూడు కోరికలు అని చెప్పాను. మొదటిది నేను గెలవాలని వచ్చాను, రెండోది నేను బయటకు వచ్చేసరికి కరోనాకి వ్యాక్సిన్ వచ్చేయాలి.. రెండూ తీరలేదు. చివరిది మీకు కథ చెప్పే అవకాశం కావాలని అనుకున్నాను. ఇదైనా తీరుతుందా.. మీరు ఎప్పుడైనా వినడానికి ఛాన్స్ ఇవ్వండి సార్'' అని అడిగాడు. దానికి నాగార్జున ఒకే అని చెప్పారు. దీంతో కుమార్ సాయి సంబరానికి హద్దుల్లేకుండా పోయాయి. ఇక హౌస్ మేట్స్ అందరూ కుమార్ సాయిని డాన్స్ చేయమని అడిగారు. దానికి నాగార్జున సమక్షంలో డాన్స్ చేసి అదరగొట్టాడు కుమార్ సాయి.

మొత్తమ్మీద ఆరోవారం అలా కుమార్ సాయిని బలి చేశాడు బిగ్ బాస్. ఇక ఇప్పుడు మోనాల్-అఖిల్ కథని ఏ రేంజిలో వాడుకుంటాడో.. నోయల్ లోని ఒరిజినాల్టీని ఎలా బయటకు రప్పిస్తాడో అభిజీత్ ని గెలిపించడానికి ఎలాంటి ట్రిక్కులు చేస్తాడో.. మరి లాస్య..అవినాష్ లు ఎన్నిరోజులు ఉంటారో.. చివరిగా అయినా ముఖాయమైనది ప్రేక్షకులకు పరమ బోర్ పుట్టిస్తూ.. బిగ్ బాస్ కి ప్రియుడిగా నామినేషన్ నుంచి తప్పించుకున్న అమ్మ రాజశేఖర్ ఎన్ని వారాలు తప్పించుకుంటాడో తెలుసుకోవాలనుంటే బిగ్ బాస్ చూస్తూనే ఉండండి!

Show Full Article
Print Article
Next Story
More Stories