బిగ్‌బాస్‌లో అవార్డుల పంట!

బిగ్‌బాస్‌లో అవార్డుల పంట!
x
Highlights

బిగ్ బాస్ నాలుగో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇక శనివారం వచ్చిందటే చాలు మన్మధుడి కోసం చాలామంది ఎదురు చూస్తారు. అయితే ఈ వీకెండ్‌లో మాత్రం నాగార్జున కనిపించలేదు. దీంతో షో ప్రేక్షకులలో కొంత నిరాశ అలముకుంది.

బిగ్ బాస్ నాలుగో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇక శనివారం వచ్చిందటే చాలు మన్మధుడి కోసం చాలామంది ఎదురు చూస్తారు. అయితే ఈ వీకెండ్‌లో మాత్రం నాగార్జున కనిపించలేదు. దీంతో షో ప్రేక్షకులలో కొంత నిరాశ అలముకుంది. అయినా షో మజాగా సాగించారు. ఇక ప్రేమ మొదలైంది అనే సినిమా నిర్మించిన బిగ్ బాస్... శనివారం రోజు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ పంచారు. ఇంటి సభ్యులు పాటలు, డ్యాన్స్‌లతో అదరగొట్టారు.

బ్లాక్‌బస్టర్ టాస్క్‌కు కొనసాగింపుగా జరిగిన అవార్డు ఫంక్షన్లో సెలబ్రిటీలందరూ అందంగా ముస్తాబయ్యారు. హాట్ స్టార్‌గా అరియానా.. ఐటెం రాణిగా హారిక.. బెస్ట్ విలన్‌గా మెహబూబ్.. ఇలా బిగ్‌బాస్‌లో అవార్డుల పంట పండింది. ఇక గత ఎపిసోడ్‌లో మోనాల్‌కు ఎలా ప్రపోజ్‌ చేయాలో అఖిల్‌కు నేర్పించిన అభి... ఈ ఎపిసోడ్‌లో ప్రసంశించాడు.

ఈ బీబీ స్టార్ అవార్డ్స్ వేడుకలో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులంతా తమ పెర్ఫార్మెన్స్‌లతో అదరగొట్టారు. జంటలుగా వేదికపై స్టెప్పులేశారు. టాలీవుడ్ లెజెండ్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబుకు పాటలకు డ్యాన్స్ చేసి అదరగొట్టారు. దుమ్మురేపే స్టెప్పులతో ఇంటి సభ్యులు మాస్‌గా అలరించారు.

మొత్తంగా వీకెండ్ షో మాత్రం ఆద్యంతం సరదాగా సాగిపోయినట్టు కనిపించింది. ఈ శనివారం ఎపిసోడ్‌ను నాగార్జున లేకుండానే అవార్డ్స్ ఫంక్షన్‌తో నడిపించేశారు. ఈ ఆదివారం షో కోసం నాగార్జున అందుబాటులో లేకపోవడం వల్ల సమంత అక్కినేని హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 'ఈ వారం నాతో ఎంజాయ్‌మెంట్ మాములుగా ఉండదు" అనే సామ్ డైలాగ్ ప్రోమో ఇప్పటికే విడుదలైంది. దీంతో అటు బుల్లితెర ప్రేక్షకులు.. ఇటు అక్కినేని అభిమానులు సమంతా హోస్టింగ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ఈ సన్‌డే మరింత ఫన్‌డే కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories