Top
logo

Biggboss 4: అమ్మాయిల నైట్ పార్టీ..నోయల్ కోపం..అలా జరిగింది !

Biggboss 4: అమ్మాయిల నైట్ పార్టీ..నోయల్ కోపం..అలా జరిగింది !
X
Highlights

రియల్‌ లైఫ్‌ కష్టాలు - మిడ్‌నైట్‌పార్టీలు కుమార్‌సాయితో గొడవ - టాస్క్ నుంచి తప్పుకున్న నోయల్‌. అరియానాతో...

రియల్‌ లైఫ్‌ కష్టాలు - మిడ్‌నైట్‌పార్టీలు కుమార్‌సాయితో గొడవ - టాస్క్ నుంచి తప్పుకున్న నోయల్‌. అరియానాతో డేట్‌కు వెళ్తానంటున్న అభిజిత్. తక్కువ చేసి మాట్లాడుతున్నారని బాధపడుతున్న అఖిల్‌. ఫైనల్‌గా రేసర్‌ ఆఫ్‌ ద హౌస్‌గా నిలిచిన మోహబూబ్‌. ఇలా బిగ్‌బాస్‌ నాల్గవ సీజన్‌ నలభై రోజులకు చేరింది.

కెప్టెన్‌ నోయల్‌ తనకు టాస్కులో పాల్గొనే అవకాశం వచ్చినప్పటికీ కుమార్‌తో గొడవ కారణంగా ఆట నుంచి వైదొలగాడు. అయితే ఈవారంతో పాటు వచ్చేవారంలోనూ నామినేషన్‌లో ఉన్న నోయల్‌ టాస్క్‌ ద్వారా తన సత్తా చూపించుకునే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకుని పెద్ద తప్పే చేశాడు.

యధావిధిగా వేకప్‌ సాంగ్‌తోనే ఇంటిసభ‌్యులను నిద్రలేపారు బిగ్‌బాస్‌. ''బద్రినాథ్‌'' సినిమాలోని ఓపాటకు సోహైల్‌, మెహబూబ్‌ బెడ్‌రూమ్‌లో డ్యాన్స్‌ చేయగా మోనాల్‌, లాస్య, అరియానాతోపాటు మరికొందరు గార్డెన్‌ ఏరియాలో కాలుకదిపారు. దివి పని చేయట్లేదని,ఇంట్లో సరిగా ఊడవట్లేదని అవినాష్‌, అరియానా చర్చించుకున్నారు.

బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు రేసర్ ఆఫ్‌ ద హౌస్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో రెండు రౌండ్లు ఉండగా అమ్మాయిలందరూ మొదటి రౌండ్‌ మధ్యలోనే చేతులెత్తేశారు. ఇక పుషప్స్‌ చేసేటప్పుడు మధ్యలో ఆగావని నోయల్‌ కుమార్‌ను తప్పుపట్టాడు. లేదని బుకాయిస్తున్న కుమార్‌ను నిజాయితీగా ఉండమని ఘాటు సలహా ఇచ్చాడు. ఇక ఈ విషయంలో చిరాకు తెచ్చుకున్న నోయల్‌ టాస్క్‌లో ఆడనంటూ తప్పుకున్నాడు. టాస్క్‌లో నోయల్‌ స్థానంలో దిగిన అవినాష్‌ సరిగా ఆడలేక కింద పడిపోయాడు. మోహబూబ్‌ మాత్రం రేసుగుర్రంలా 49 సెకండ్లలో టాస్క్‌ పూర్తి చేసి రేసర్‌ ఆఫ్‌ ద హౌస్‌గా నిలిచాడు. కుమార్‌, అఖిల్‌, సోహైల్‌ స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు.

అమ్మాయిలకు బిగ్‌బాస్‌ స్పెషల్‌ ఆఫర్‌ ప్రకటించాడు. వారికి మిడ్‌నైట్‌ పార్టీ చేసుకునేందుకు అవకాశం కల్పించాడు. పనిలో పనిగా పార్టీలో అబ్బాయిలను ర్యాగింగ్‌ కూడా చేశారు. సోహైల్‌ ఉన్నదున్నట్టుగా మాట్లాడటంతో తమను పొగడలేదని చింతించిన అమ్మాయిలు ఇస్మార్ట్‌ లుంగీ లాగారు. 101 పుషప్స్‌ చేస్తే దాని గురించి మోహబూబ్‌ తక్కువ చేసి మాట్లాడాడని అఖిల్‌ ఫీలయ్యాడు. ఆకోపం సోహైల్‌ మీద తీశాడు. ఈ విషయం తెలుసుకుని మోహబూబ్‌ అఖిల్‌కు సారీ చెప్పాడు. కానీ అఖిల్‌ మాత్రం మోహబూబ్‌ అన్న మాటలు తన మనసును గాయపరిచాయని బాధపడ్డాడు.

బిగ్‌బాస్‌ అమ్మాయిలకు నైట్‌ ఔట్‌ పార్టీ చేసుకునే అవకాశన్నిచ్చాడు. అయితే పనిలో పనిగా అబ్బాయిలను ఆడుకునేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో అభిజిత్‌ను పిల్చుకుని మరీ పొగిడించుకున్నారు. అటు మాస్టర్‌ను అమ్మాయిలా డ్యాన్స్‌ చేయమంటూ కాసేపు టీజింగ్‌ చేశారు. తర్వాత సోహైల్‌ ఒక్కటిచ్చుకోవడంతో దివి షాకై తాను కూడా సోహైల్‌కు ఒక్కటిచ్చింది. ఇక అక్కడున్న అమ్మాయిలందరి గురించి తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చాడు సోహైల్‌. దీంతో మరీ ఉన్నదున్నట్టుగా చెప్పాడే తప్ప ఎక్కడా పొగడలేదని చింతించిన అమ్మాయిలు చితకబాది లుంగీ లాగారు. ఇక మీకు అన్నదమ్ముల్లేరా అని అతడు ప్రశ్నించడంతో హారిక లుంగీ లాగడం వదిలేసింది.

39రోజు రియల్‌ లైఫ్‌ కష్టాలు చెప్పుకుంటూ బాధపడ్డ కంటెస్టెంట్లు 40వరోజున పార్టీ చేసుకుని మనసు తేలిక చేసుకున్నారు. మోనాల్‌, అవినాష్‌ మాత్రం అందరూ నిద్రపోయాక కూడా సాల్సా డ్యాన్స్‌ చేశారు. ఇష్టమొచ్చినట్లు చిందేసిన ఇద్దరూ మనసు హాయిగా ఉందని సంతోషంలో మునిగి తేలారు.

అఖిల్‌ లోనికి రావడంతోనే మోనాల్‌ సంబరపడిపోయింది. కొత్తగా పెళ్లైన అమ్మాయిగా నటించమని అఖిల్‌కు అరియానా టాస్క్‌ ఇచ్చింది. అటు అఖిల్‌ అమ్మాయిలా ముగ్గు వేస్తుంటే పక్కింటి అబ్బాయిగా హారిక లైనేసింది. అదే సమయంలో భర్త పాత్రపోషించిన అరియానా కాఫీ ఇవ్వమని కేకేయడంతో పరుగు పరుగున వెళ్లి కాఫీ ఇచ్చాడు. దీంతో అరియానా అతడిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నట్లు నటించింది.

నైట్‌ ఔట్‌ పార్టీలో అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు అందరూ కలిసి చిందులేశారు. ఇందులో మోహబూబ్‌, సోహైల్‌ డ్యాన్స్‌ ఇరగదీయగా దివి మాత్రం కుమార్‌ సాయి, మాస్టర్‌, అవినాష్‌తో కలిసి స్టెప్పులేసింది. ఫైనల్‌గా మోనాల్‌, అవినాష్‌ మాత్రం అందరూ నిద్రపోయాక కూడా ఇద్దరూ సాల్సా డ్యాన్స్‌ చేశారు. యూ ఆర్‌ మై ఎవ్రీథింగ్‌.. అంటూ ఇష్టమొచ్చినట్లుగా చిందేశారు. ఇప్పుడు మనసుకు హాయిగా ఉందని ఇద్దరూ సంతోషంగా మునిగితేలారు.

Web TitleBigg boss 4 Telugu 42 nd episode October 16th highlights girls knight party Noyal fires on Kumar Sai
Next Story