Bigg Boss 4 Telugu: అరియానాకు హ్యాండిచ్చిన హౌజ్‌మేట్స్..కెప్టెన్ గా అవినాష్!

Bigg Boss 4 Telugu: అరియానాకు హ్యాండిచ్చిన హౌజ్‌మేట్స్..కెప్టెన్ గా అవినాష్!
x
Highlights

Bigg Boss 4 Telugu: అరియానా..అవినాష్ హౌస్ కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. ఈ పోటీలో అవినాష్ హౌస్ కెప్టెన్ గా ఎన్నికయ్యాడు.

ఆసక్తికరంగా సాగుతోన్న బిగ్ బాస్ సీజన్ 4లో ప్రస్తుతం మరో కెప్టెన్ ఎంపిక ప్రక్రియ జరిగింది. ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడదీసి లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్.. ఈ టాస్క్‌లో బెస్ట్ పెర్ఫార్మర్లుగా అవినాష్, అరియానాలను ఎంపిక చేశారు. ఇక వీరిద్దరి మధ్య పోటీపెట్టి ఒకరిని కెప్టెన్‌ను చేశారు. అయితే ఈ పోటీలో అరియానాకు హౌజ్‌మేట్స్ హ్యాండిచ్చారు. మరి ఈ కెప్టెన్ ఎంపిక విధానం ఎలా జరిగింది, బిగ్ బాస్ హౌజ్‌లో హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్ షో నాలుగవ సీజన్ లో లవ్ ట్రాక్ ల హవా కొనసాగుతూనే ఉంది. అఖిల్, అవినాష్, హారిక, అరియానా, అభిజిత్, మోనాల్ ఫుల్ ఫేమస్ అయిపోయారు. ఈ మధ్య అందరిలో అఖిల్‌-మోనాల్‌, అవినాష్-అరియానా జంట బాగా సందడి చేస్తోంది.

అవినాష్ మామూలుగా అందరినీ ఫ్లర్ట్ చేస్తుంటాడు. అందులో కాస్త అరియానాను ఎక్కువగా చేస్తుంటాడు. అయితే అరియానాపై అఖిల్ చేయి వేయడంతో అవినాష్ చేయి తియ్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. చేయి తీయకపోవడంతో అవినాష్ మోనాల్‌పై చేయి వేసేందుకు ప్రయత్నించగా అఖిల్ అడ్డు చెప్పాడు. నీకు ఇద్దరు కావాలా? మాకు కనీసం ఒక్కరు కూడా లేరు అంటూ సెటైర్ వేశాడు. ఇక మోనాల్ అఖిల్‌ను స‌ర‌దాగా ఓ ఆటాడుకుంది. త‌న భ‌ర్త న‌టుడ‌ని చెప్పింది. అన్ని భాష‌ల్లో న‌టిస్తాడ‌ని సిగ్గులు ఒల‌క‌బోసింది. కానీ పేరు అడిగితే మాత్రం గుజ‌రాత్‌ లో పేరు చెప్పరంటూ త‌ప్పించుకుంది.

46వ రోజు కెప్టెన్సీ టాస్క్ జరిగింది. అప్పటికే కెప్టెన్సీకి పోటీకి ఎంపికైనా అరియానా, అవినాష్ సిద్ధమయ్యారు. ఇక బిగ్‌ బాస్‌ ఒక టాస్క్‌ను పోటీ దారుల మధ్య ఉంచారు. కెప్టెన్సీ కోసం ఇంటి సభ్యులను బతిమాలడుకొంటూ ఆ ఇద్దరు పోటీదారులు ప్రచారం చేసుకున్నారు. చివరిగా ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారో చూద్దాం.

అరియానా, అవినాష్‌కు కెప్టెన్సీ టాస్క్ కింద 'బండి తోయరా బాబు' అనే పోటీ పెట్టారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగా కెప్టెన్సీ పోటీదారులు ఇద్దరికీ గార్డెన్ ఏరియాలో చెరో స్టేషన్‌తో పాటు రెండు ట్రాలీలు ఇచ్చారు. టాస్క్ ముగిసే సమయానికి ఏ కెప్టెన్సీ పోటీదారుడు అయితే ట్రాలీ సహాయంతో తమ స్టేషన్‌లో ఎక్కువ మంది సభ్యులను ఉంచగలుగుతారో ఆ పోటీదారుడు ఇంటి కెప్టెన్ అవుతారు. ఈ క్రమంలో ఇంటి సభ్యులను ఒప్పించి తమ ట్రాలీలో ఎక్కుంచుకుని కెప్టెన్సీ పోటీదారుడు స్టేషన్‌కు వారిని తరలించాల్సి ఉంటుంది.

ఈ పోటీలో అరియానా, అవినాష్ బాగా కష్టపడ్డారు. చెరో ఐదుగురిని అరియానా, అవినాష్ తమ స్టేషన్లలో ఉంచగలిగారు. దీంతో పోటీ కాస్త టై అయ్యింది. అప్పుడు బిగ్ బాస్ మరో అవకాశం ఇచ్చారు. అవతల స్టేషన్‌లో ఉన్న సభ్యులను ఒప్పించి తమ స్టేషన్‌లోకి కెప్టెన్సీ పోటీదారుడు తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చని బిగ్ బాస్ సూచించారు. దీంతో అరియానా, అవినాష్ ఇద్దరూ గట్టి ప్రయత్నమే చేశారు. మోనాల్, అమ్మ రాజశేఖర్, నోయల్ తమ స్టేషన్ నుంచి అవతల స్టేషన్‌కు వెళ్లి మళ్లీ మనసు మార్చుకుని యథాస్థానానికి వచ్చేశారు. ఇక టాస్క్ ముగిసే స‌మ‌యానికి అవినాష్ స్టేష‌న్‌లో ఆరుగురు ఉండ‌టంతో అతడు గెలిచి కెప్టెన్ అయ్యాడు.

ఇక కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన వెంటనే అవినాష్ ఇంటి సభ్యులపై నిబంధనల కొరడా ఝులిపించారు. ఇంటి సభ్యులకు కొత్త రూల్స్‌ జారీ చేశాడు. ఆ నిబంధనలా చిట్టా విన్న లాస్య కెప్టెన్ మనకు పనిష్‌మెంట్ ఇస్తున్నారు అంటూ కామెంట్ చేసింది. కొత్తగా కెప్టెన్‌గా ఎంపికైన అవినాష్ ఇంటి సభ్యులకు కొన్ని సూచనలు చేశాడు. ఈ రూల్స్‌ని ఇంటిస‌భ్యులు ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌కుండా త‌లాడించారు. రేషన్ మేనేజర్‌గా ఎంపికైన అరియానాకు బిగ్ బాస్ ఒక పరీక్ష పెట్టారు. ఆమెను స్టోర్ రూమ్‌లోకి రమ్మని పిలిచి ఇర‌కాటంలో ప‌డేశాడు.

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ విషయంలో మెల్లగా ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారని అనిపిస్తోంది గాని మళ్ళీ ఎక్కడో తేడా కొడుతోందనే అనుమానం కూడా ఎక్కువవుతోంది. గత మూడు నాలుగు రోజులుగా బిగ్‌ బాస్‌ ఇస్తున్న టాస్కులు అన్ని వర్గాల వారిని పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అయితే షోకి క్రేజ్‌ తగ్గకుండా తీరిక లేకుండా ప్రోమోలు రిలీజ్‌ చేసి డోస్ పెంచుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories