Bigg Boss 4 Telugu: అమ్మా.. కెప్టెనా..మజాకానా! కొత్త నిబంధనలతో చుక్కలు చూపిస్తున్న మాస్టర్!!

Bigg Boss 4 Telugu: అమ్మా.. కెప్టెనా..మజాకానా! కొత్త నిబంధనలతో చుక్కలు చూపిస్తున్న మాస్టర్!!
x

Bigg Boss 4 Telugu episode 61 Highlights (images:Star Maa Promo)

Highlights

Bigg Boss Telugu 4: బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. రింగులో రంగు టాస్క్ లో అమ్మ రాజశేఖర్ విన్నర్ అయ్యాడు. దాంతో కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు. అతను కెప్టెన్ కాగానే, అవినాష్ ను స్టోర్ మేనేజర్ గా ఎంపిక చేసుకున్నాడు.

Bigg Boss 4 Telugu Episode 61 Highlights : బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. రింగులో రంగు టాస్క్ లో అమ్మ రాజశేఖర్ విన్నర్ అయ్యాడు. దాంతో కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు. అతను కెప్టెన్ కాగానే, అవినాష్ ను స్టోర్ మేనేజర్ గా ఎంపిక చేసుకున్నాడు. ఇక అమ్మ రాజశేఖర్ కెప్టెన్ కాగానే, హౌస్ మేట్స్ పై తనకున్న ప్రతీకారాన్ని తీర్చుకోవడం మొదలు పెట్టాడు. అందర్నీ ఒక ఆట ఆడుకున్నాడు. మ‌రి 61వ రోజు బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో చూద్దామా...?

రాజశేఖర్ కెప్టెన్ అయ్యాడు..

"రింగులో రంగు" అనే కెప్టెన్సీ టాస్క్ లో మాస్ట‌ర్.... హారిక మీద ప‌డి ఆమె టీషర్ట్‌ను ఎరుపురంగు మ‌యం చేశాడు. అరియానా మీద కూడా రంగు ప‌డింది. అస‌లు రంగు ప‌డ‌కుండా త‌ప్పించుకున్న అమ్మ రాజ‌శేఖ‌ర్ కెప్టెన్ అయ్యాడు. ఒక్కొక్క‌రికి త‌న త‌డాఖా చూపిద్దామ‌ని ఫిక్స‌య్యాడు. ఇంగ్లీషులో మాట్లాడితే జైలులో వేస్తాన‌న్నాడు. అలా అన్నాడో లేదో బిగ్‌బాస్ జైలు తాళాలు పంపించ‌డం గ‌మ‌నార్హం. అవినాష్‌ను రేష‌న్ మేనేజ‌ర్‌గా నియ‌మించాడు.

కొత్త కెప్టెన్.. కొత్త నిబంధనలు..

కెప్టెన్ అమ్మ రాజ‌శేఖ‌ర్ ఇంట్లో కొత్త నిబంధ‌న‌లు ప్ర‌వేశ‌పెట్టాడు. మూలిగే న‌క్క మీద తాటికాయ ప‌డ్డట్టు ప‌ని చేసేవాళ్ల‌కు మ‌రిన్ని ప‌నులు అప్ప‌గించాడు. అరియానాను ఏ ప‌నీ చేయ‌నీయ‌కుండా త‌న‌ అసిస్టెంటుగా నియ‌మించుకున్నాడు.

ఓవైపు గొడవలు వద్దని అంటూనే మాస్ట‌ర్ కావాల‌ని అభిజిత్‌ను టార్గెట్ చేసి త‌గాదా పెట్టుకున్నాడు. తన విలనిజం ప్రదర్శించడానికి మాస్టర్ కి టైం బాగా కలిసొచ్చినట్లుంది. అభిజీత్ బిగ్ బాస్ వద్ద బుక్కయ్యాడు. అదెలాగో చూద్దాం.

అభి త‌న టీమ్‌తో మాట్లాడుతూ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ఫ్ర‌స్టేష‌న్‌లో పొర‌పాటున‌ రెండు ఇంగ్లీషు ముక్క‌లు మాట్లాడాడో లేదో తెలుగులో మాట్లాడాల‌ని బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చాడు. అది వినిపించ‌డంతోనే బుస‌లు కొడుతున్న పాములా మాస్ట‌ర్ వెంట‌నే లేచి చ‌ప్ప‌ట్లు కొడుతూ విల‌నిజం ప్ర‌ద‌ర్శించాడు. త‌ను చెప్పేంత‌వ‌ర‌కు నిల‌బ‌డ‌మ‌ని ప‌నిష్మెంట్ ఇచ్చాడు.

మ‌రోవైపు మాస్ట‌ర్ రూల్స్ వ‌ల్ల సోహైల్‌, మెహ‌బూబ్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయి. అయితే వాటిని తేలిక‌గా తీసుకున్న సోహైల్ స్నేహితుడికి చాక్లెట్ చేయికందించాడు. కానీ మెహ‌బూబ్ మాత్రం నీ ఫ్రెండ్‌షిప్‌ వ‌ద్దు అనేసరికి సోహైల్‌కు తిక్క లేచింది. చేతికి అందిన వ‌స్తువున‌ల్లా విసిరిపారేశాడు. దీంతో అఖిల్.. సోహైల్‌ ద‌గ్గ‌ర‌కు వెళ్లి బుజ్జ‌గించి ఇద్ద‌రి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశాడు.

మైకుల బ్యాట‌రీ కోసం బ‌జ‌ర్ మోగిన‌ప్పుడు స్టోర్ రూమ్‌లోకి చిట్ట చివ‌ర వ‌చ్చిన‌వారి గుడ్డు మొద‌ట అడుగు పెట్టిన వాళ్ల ఖాతాలోకి వెళుతుంద‌ని చెప్పుకొచ్చాడు. ఈ రూల్స్ చూసి ఇంటిస‌భ్యులు గుడ్లు తేలేశారు. త‌ర్వాత మైక్‌ బ్యాట‌రీలు మార్చుకోమ‌ని బ‌జ‌ర్ మోగింది. ఎక్క‌డ గుడ్డు పోతుందోన‌ని ఇంటిస‌భ్యులు ప‌రుగెత్తుకుంటూ వెళ్లారు. మొద‌ట అవినాష్ వెళ్ల‌గా, చివ‌ర‌గా అమ్మ రాజ‌శేఖ‌ర్ తాపీగా న‌డుచుకుంటూ వెళ్లడంతో ఎపిసోడ్ ముగిసింది.

ఇక ఈరోజు శనివారం..నాగార్జున వస్తారు.. రేపు ఆదివారం ఎలిమినేషన్ ఉంటుంది. ప్రస్తుతం హౌస్ లో పది మంది ఉన్నారు. వారిలో అమ్మ రాజశేఖర్, హారిక, అవినాష్, మోనాల్, అభిజిత్ నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో ఎవరు ఈవారం సేవ్ అవుతారో.. ఎవరు బయటకు వెళతారో వేచి చూడాల్సిందే!

Show Full Article
Print Article
Next Story
More Stories