Bigg Boss Divi: హగ్గులతో, ముద్దులతో అభిమానులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ దివి

* నయీం డైరీస్ ప్రోమోలో బిగ్ బాస్ దివి బోల్డ్ యాక్టింగ్

Sandeep Reddy
Published on: 7 Dec 2021 4:52 PM IST
Bigg Boss 4 Contestant Divi Vadthya Playing Bold Role in Nayeem Diaries Movie
X

Bigg Boss Divi: హగ్గులతో, ముద్దులతో అభిమానులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ దివి

Bigg Boss Divi: బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టంట్.. సొట్ట బుగ్గల సుందరి దివి.. బిగ్ బాస్ పూర్తైన తరువాత వరుస హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు "నయీం డైరీస్" సినిమాలోని తన పాత్రతో మరోసారి కుర్రకారును అలరించబోతుంది. బిగ్ బాస్ సీజన్ తో ఇప్పటికే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న దివి.. తాజాగా ఈ సినిమాలో ఒక బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది.

హగ్గులతో, ముద్దులతో ఇటీవలే విడుదలైన "నయీం డైరీస్" ప్రోమోలో దివిని చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తాము బిగ్ బాస్ లో చూసిన దివికి.. "నయీం డైరీస్" సినిమాలో ఉన్న దివికి ఎంతో తేడా ఉందని.. బిగ్ బాస్ హౌస్ లో హోమ్లీగా ఉన్న దివి.. ఈ సినిమాలో ఇంత బోల్డ్ గా కనిపిస్తుండటంతో కొంతమంది కన్నుల పండుగ చేసుకుంటుండగా, మరి కొంత మంది వరుస సినిమా ఆఫర్ల కోసమే ఇలా దివి తన అందాలు ఆరబోస్తుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

గ్యాంగ్ స్టార్ నయీం జీవితకథ ఆధారంగా దాముబాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వశిష్ట ఎన్ సింహ, యజ్ఞ శెట్టి, దివి, సంయుక్త ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. డిసెంబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story