Divi New Web Series: నాగార్జున డైరెక్టర్ తో వెబ్ సిరీస్ చేయనున్న దివి

admin1
Published on: 7 Aug 2021 1:28 PM IST
Divi Got Chance in Director Kalyan Krishna Produced New Web Series
X

దివి (ట్విట్టర్ ఫోటో)

Divi New Web Series: 'మహర్షి' సినిమా లో మెరుపుతీగలా మెరిసిన దివి బిగ్బాస్ సీజన్ 4 ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈమెకు సినిమా ఆఫర్లు పెద్దగాలేనప్పటికీ ఓటిటి ఆఫర్లు మాత్రం బాగానే వస్తున్నాయి. ఈ మధ్యనే "క్యాబ్ స్టోరీస్" అనే ఒక లిమిటెడ్ సిరీస్లో కనిపించిన దివి తాజాగా మరొక ఓటీటీ ఆఫర్ ను అందుకుంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఒక వెబ్ సిరీస్ కోసం దివి సంప్రదించినట్లు సమాచారం. "సోగ్గాడే చిన్ని నాయన" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ తాజాగా నాగార్జున తో "బంగార్రాజు" సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.

కళ్యాణ్ కృష్ణ సమర్పిస్తున్న ఒక వెబ్ సిరీస్ లో దివి హీరోయిన్ గా నటించనుంది. కళ్యాణ్ కృష్ణ అసోసియేట్ అయిన నవీన్ గాంధీ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించనున్నారు. నిజానికి దివి నాగార్జున నటిస్తున్న ఒక సినిమాలో కీలక పాత్ర పోషించిన ఉందని గతంలో కొన్ని పుకార్లు వినిపించినప్పటికీ అందులో ఏమీ నిజం కాలేదు. అయితే ఈ వెబ్ సిరీస్ లో ఆఫర్ రావడానికి మాత్రం నాగార్జున రికమెండేషనే కారణం అని కొందరు అంటున్నారు. మరోవైపు ఈ వెబ్ సిరీస్ గురించిన మరిన్ని వివరాలు మరియు అధికారిక ప్రకటన త్వరలో వెలువడనున్నాయి.

admin1

admin1

Next Story