Top
logo

రాహుల్ సిప్లిగంజ్..పునర్నవి.. మధ్యలో శ్రీముఖి!

రాహుల్ సిప్లిగంజ్..పునర్నవి.. మధ్యలో శ్రీముఖి!
X
Rahul, Punarnavi and Sreemukhi (images from Rahul and Sreemukhi Instagram)
Highlights

రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి స్నేహబంధం మధ్యలో శ్రీముఖి వచ్చి చేరినట్టు కనిపిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

బిగ్ బాస్ సీజన్ 3 లో నువ్వా నేనా అంటూ పోటీపడి మరీ శ్రీముఖిని వెనక్కి నెట్టి రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. ఇది అందరికీ తెలిసిందే. ఇక ఆ షోలో.. పునర్నవి..రాహుల్ మధ్య సాగిన కథ కూడా అందరికీ బాగా పరిచయమే. అదేవిధంగా శ్రీముఖి..రాహుల్ ల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమన్నట్టుగా జరిగిన సంఘటనలూ అందరూ చూశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రాహుల్-పునర్నవి ల మధ్య ఏం జరుగుతోందో ఏమో కానీ.. శ్రీముఖి, రాహుల్ ల మధ్య మాత్రం పాత విరధానికి పుల్ స్టాప్ పడి మళ్ళీ కొత్తగా ఘాటు సాన్నిహిత్యం మొదలైంది.

ఈ విషయాల్ని ద్రువీక్రించేలా రెండు రోజుల నుంచి రెండు సంఘటనలు నేట్టింట్లో ట్రేండింగ్ మారాయి. ఒకటి పునర్నవి ని ఉద్దేశించి రాహుల్ చేసిన ట్వీట్ అయితే, రెండోది శ్రీముఖి రాహుల్ తో కల్సి తానున్న ఫోటోను షేర్ చేస్తూ చేసిన వ్యాఖ్యానం.

పున్నూ ఇక చాలు!

బిగ్ బాస్ షో లో రాహుల్-పునర్నవి జంట ఎంత పాప్యులర్ అయిందో చెప్పనవసరం లేదు. వీరిద్దరి మధ్య ఎదో ఉందన్నట్టు చాలా హడావుడి నడిచింది. షో అయిపోయిన తరువాత కూడా ఇదే హవా నడుస్తూ వస్తోంది. వీరిద్దరూ కల్సి చాలా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. వాటిలో కూడా వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన బంధం ఉంది అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఫాన్స్ కూడా దానికి ఫిక్స్ అయిపోయారు. రాహుల్-పునర్నవి విడివిడిగా ఎక్కడికి వెళ్లినా కూడా వారిని రెండో వారి గురించి ఆరాతీయడం కామన్ అయిపొయింది. ఇద్దరూ కల్సి ఉన్నపుడైతే ఆ హంగామా సంగతి చెప్పక్కర్లేదు.

అయితే, ఇటీవల రాహుల్ ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశారు. అదిప్పుడు హాట్ టాపిక్ అయింది..

''నిజంగా నాకు ఒక మంచి స్నేహితురాలిగా మారిన అపరిచితురాలు. నా మొత్తం బిగ్ బాస్ 3 ప్రయాణంలో నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. నన్ను ఎప్పటికీ సంతోషపెట్టే జ్ఞాపకాలను నువ్వు నాకు ఇచ్చావ్ పునర్నవి. ఇంక సాలు తియ్! మస్తయింది ఇగ సల్లవడు నవీ!'' అంటూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాహుల్ రాసుకొచ్చాడు. దీంతో రాహుల్ కో పునర్నవికి మధ్య ఎదో జరిగిందని నెటిజన్లు ఫీలైపోయారు. అభిమానులు కూడా ఇదే విషయంలో రకరకాల కామెంట్లతో పోస్ట్ లు పెడుతూ వచ్చారు.

ఇదిలా ఉంటె.. ఇక్కడ బిగ్ బాస్ షో లో మరో ముఖ్యమైన వ్యక్తి.. చివరి వరకూ రాహుల్ కు పోటీ ఇచ్చిన కంటెస్టెంట్ శ్రీముఖి. రాహుల్-శ్రీముఖిల మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. వారి కుటుంబ సభ్యులకూ ఈ విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో బద్ధ శత్రువులుగా మారిపోయారు. చివరి వరకూ ఒకరిని ఒకరు దూషించుంటూనే ఉన్నారు. బిగ్ బాస్ ఫైనల్స్ లో రాహుల్ గెలిచిన తరువాత కూడా ఈ వైరం నడిచింది. చాలా సందర్భాల్లో రాహుల్ ను శ్రీముఖి గురించి ప్రశ్నించినా కూడా ఆమె తన ఫోన్ కు అందుబాటులో లేదని చెప్పుకుంటూ వచ్చారు. దాంతో వీరిద్దరి మధ్య వైరం కొనసాగుతోందని భావించారు.

మా రిలేషన్షిప్ ఇప్పుడే మొదలైంది!

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక శ్రీముఖి, రాహుల్ఎ వరిదారిలో వారు బిజీ అవుతూ వచ్చారు. రాహుల్ తన పాటలతో బిజీ అయిపోతే, శ్రీముఖి కొత్త ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా చేస్తూ హంగామా సృష్టిస్తోంది. షో అయిపోయాక పబ్లిక్ లోకి శ్రీముఖి రాలేదు. అభిమానులను కలుస్తానని చెప్పినా ఇప్పటివరకూ కలవలేదు. ఇక బిగ్ బాస్ పోటీదారులు అందరూ కలసి చేసుకున్న పార్టీలోనూ శ్రీముఖి జాడ లేదు. దీంతో రాహుల్, శ్రీముఖి వార్ నడుస్తోందని అభిప్రాయం అందరిలో వచ్చింది. అయితే, తాజాగా వీరిద్దరూ కలిసిపోయారు. ఓ పార్టీలో కలిసి సందడి చేశారు. దీనికి సంబందించిన ఓ వీడియోను వితిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా రాహుల్ తో ఉన్న ఫోటోను శ్రీముఖి తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి `గతం గత:! అసలు రిలేషన్షిప్‌ ఇప్పుడు మొదలైంది!' అంటూ పోస్ట్ పెట్టింది. వీరిద్దరి తిరిగి కలిసిపోవటంతో వీరిద్దరి ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి రెండూ రెండు కథలు కానీ.. వీటి మధ్యలో చాలా సంబంధం ఉందని అభిమానులు అనుకుంటున్నారు. పునర్నవిని ఉద్దేశించి ఇక చాలు.. అని రాహుల్ వ్యాఖ్యానించడం.. మా అసలు రిలేషన్షిప్ ఇప్పుడే మొదలైంది అని శ్రీముఖి ఫోటో షేర్ చేయడంతో అందరూ రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. పునర్నవి..రాహుల్ మధ్యలో శ్రీముఖి బాంబు పేలిందని వ్యాఖ్యానిస్తున్నారు. పుంనూ-రాహుల్ రిలేషన్షిప్ ని శ్రీముఖి బ్రేక్ చేసేస్తోంది ఆ జంట ని అభిమానించే వారు కామెంట్ చేస్తుంటే.. కెరీర్ కోసం ఎవరి తిప్పలు వాళ్ళు పడుతున్నారని కొందరు తేల్చేస్తున్నారు.

మొత్తమ్మీద బిగ్ బాస్ షో ముగిసిపోయినా.. ఆ షో రేపిన సవ్వడి మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇదే బిగ్ బాస్ సీజన్ 3 విజయమనే చెప్పొచ్చేమో!

Web TitleBigg boss 3 winner Rahul Sipliganj, Punarnavi and Sreemukhi Latest relation started
Next Story