అలీ రెజాకి బిగ్ ఛాన్స్

ali reza
x
ali reza
Highlights

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మరాఠీ చిత్రం అయిన ‘నట సామ్రాట్’ ని ‘రంగమార్తాండ' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మరాఠీ చిత్రం అయిన 'నట సామ్రాట్' ని 'రంగమార్తాండ' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా, రమ్యకృష్ణ మరో ముఖ్యపాత్రలో నటిస్తుంది. చిత్ర షూటింగ్ కూడా ఇటివలే విశాఖపట్నంలో మొదలైంది.

అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో తెలుగు బిగ్ బాస్ 3కి గ్రీకువీరుడు అనిపించుకున్న అలీ రెజా ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్‌కి సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక అలీ రెజా బిగ్ బాస్ 3 లో పాల్గొని మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. షో చివరివరకు ఉండి టాప్ 5 లో నిలిచి షో నుండి నిష్క్రమించాడు..

రంగమార్తాండ విషయానికి వస్తే మరాఠీలో 'నట సామ్రాట్' గా విడుదలైన ఈ సినిమాలో లో నానా పటేకర్ హీరోగా నటించారు. అక్కడ ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమాని కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ చేస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణలతో పాటు బ్రహ్మానందం ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.. ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories