Kaushal - Sunil: టీజర్ తో ఆకట్టుకున్న బిగ్ బాస్ విన్నర్ సినిమా

Kaushal - Sunil: ప్రముఖ కమెడియన్ తో చేతులు కలిపిన బిగ్ బాస్ విన్నర్

admin1
Published on: 7 Dec 2021 12:41 PM IST
Bigg Boss 2 winner Kaushal Acting  with Famous Comedian Sunil
X

 టీజర్ తో ఆకట్టుకున్న బిగ్ బాస్ విన్నర్ సినిమా (ఫైల్-ఫోటో)

Kaushal - Sunil: ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "అతడు ఆమె ప్రియుడు". బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ అయిన కౌశల్ మరియు ప్రముఖ కమెడియన్ సునీల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రవి మరియు రామ్ తుమ్మలపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ ని విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

యండమూరి రాసిన నవలలు కొన్ని సినిమాలుగా విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. "అతడు ఆమె ప్రియుడు" సినిమా కూడా అలాగే మంచి హిట్ అవుతుందని దర్శకనిర్మాతలు నమ్ముతున్నారు. ఒక థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అనుక్షణం ఉత్కంఠ భరితంగా ఉంటుందని తెలుస్తుంది. అలాగే సునీల్ మరియు కౌశల్ పాత్రలు కూడా ఈ సినిమాలో చాలా వైవిధ్యంగా ఉండబోతుందట. ఈ చిత్ర టీజర్ కి మంచి స్పందన లభిస్తోంది.

admin1

admin1

Next Story