Kollywood: కోలీవుడ్‌లో సంచలనం.. నలుగురు స్టార్‌ హీరోలకు షాక్!

Kollywood: ధనుష్, విశాల్, శింబు, అథర్వకు.. రెడ్‌కార్డు జారీ చేయాలని నిర్ణయించిన నిర్మాతల మండలి

Jyothi
Published on: 14 Sept 2023 6:25 PM IST
Big Shock To Tamil Star Heroes Dhanush, Simbu, Vishal And Atharvaa
X

Kollywood: కోలీవుడ్‌లో సంచలనం.. నలుగురు స్టార్‌ హీరోలకు షాక్!

Kollywood: కోలీవుడ్‌ ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోలకు బిగ్ షాక్‌ ఇచ్చింది నిర్మాతల మండలి. నలుగురు హీరోలకు రెడ్‌ కార్డు జారీకి సిద్ధమైంది. హీరోలు ధనుష్, విశాల్, శింబు, అథర్వకు.. రెడ్‌కార్డు జారీ చేయాలని ఇవాళ జరిగిన సర్వసభ్య సమావేశంలో నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది.

ప్రొడ్యూసర్​ మైఖేల్‌ రాయప్పన్‌తో వచ్చిన వివాదాల నేపథ్యంలో శింబుకు రెడ్‌ కార్డు జారీ చేయనున్నారు. ఈ వివాదంపై ఇప్పటికే చర్చలు జరిపినా శింబు నుంచి మార్పు రావట్లేదని... అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతల మండలి తెలిపింది. ఇక నిర్మాతల అసోసియేషన్‌కు ప్రెసిడెంట్​గా వ్యవహరించిన సమయంలో అసోసియేషన్‌ ఫండ్స్​ను విశాల్‌ దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆయనకు రెడ్‌ కార్డు జారీ చేయాలని.. నిర్ణయం తీసుకుంది.

ఇక తెనందాల్‌ ప్రొడక్షన్ హౌస్​లో ధనుశ్​ఓ సినిమాకు అంగీకరించి 80 శాతం షూట్‌ పూర్తయ్యాక.. ఆ తర్వాత షూటింగ్ విషయంలో ఇంట్రెస్ట్ చూపలేదంట. దీంతో ఆ నిర్మాతకు నష్టాలు వచ్చినట్లు మండలి తెలిపింది. అందుకే ఆ కారణాన్ని చూపిస్తూ.. ధనుశ్​పై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇక మదియలకన్‌ ప్రొడక్షన్ హౌస్‌తో అథర్వ ఓ చిత్రానికి ఓకే చేయగా.. షూటింగ్‌ విషయంలో ఆయన ఏమాత్రం సహకరించడం లేదంటూ అథర్వకు రెడ్‌ కార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది.

Jyothi

Jyothi

Next Story