బాయ్‌ఫ్రెండ్‌ కావాలి..ఎవరైనా ఉంటే చెప్పండి..బాంబ్ పెల్చిన హీరోయిన్

Tollywood: తనకు ఒక బాయ్‌ఫ్రెండ్‌ కావాలని మనసులో మాటను బహిరంగ పరిచింది.

Sandeep Eggoju
Published on: 26 April 2021 2:10 PM IST
Big Boss Fame and Tollywood Actress Jyothi Sensational Comments
X
నటి జ్యోతి (ఫైల్ ఇమేజ్)

Tollywood: టాలీవుడ్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు ఒక బాయ్‌ఫ్రెండ్‌ కావాలని మనసులో మాటను బహిరంగ పరిచింది. అయితే జ్యోతి కొన్నాళ్లుగా సిల్వర్ స్రీన్‌పై కనిపించడం లేదు. ప్రస్తుతం వెండితెరకు, బుల్లితెరకు దూరంగా ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఎవరితోనో డేటింగ్‌ చేశారట కదా అని ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు జ్యోతి కౌంటర్ ఇచ్చింది. ఎవరితో సహజీవనం చేశానో చెప్పాలని ఎదురు ప్రశ్నించింది. అంతేకాదు అసలు తాను ఇప్పటిదాకా డేటింగ్‌కే వెళ్లలేదని కుండ బద్ధలు కొట్టేసింది.

ఇప్పుడు మాత్రం ఎందుకో డేటింగ్‌కు వెళ్లాలని అనిపిస్తోందని చెప్పుకొచ్చింది. తనకు ఒక బాయ్‌ఫ్రెండ్‌ కావాలని మనసులో మాటను బయటపెట్టింది. అలా అని ఎవరు పడితే వాళ్లను బాయ్ ఫ్రేండ్‌గా అంగీకరించను అని తేల్చి చెప్పింది. లైఫ్‌లో విజయం సాధించినవాళ్లు, తెలివైనవాళ్లు వస్తే డేటింగ్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది. ఎవరైనా మంచి కుర్రాడు ఉంటే చెప్పండని, తాను డేటింగ్‌కు రెడీగా ఉన్నానంటూ బాంబ్ పేల్చింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న జ్యోతి..వ్యక్తిగత కారణాల వల్ల కొన్నళ్లాకే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

నటి జ్యోతి హంగామా చిత్రంలో హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో అలీ సరసన హీరోయిన్ గా నటించింది. 2005లో విడుదల అయిన ఆ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆ సినిమా తర్వాత జ్యోతి ఎవడి గోల వాడిది, మహాత్మ, పెళ్లాం ఊరెళితే వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు బిగ్‌బాస్‌ తొలి సీజన్‌లోనూ పాల్గొంది. అయితే తాజాగా ప్రియుడు కావాలంటూ జ్యోతి చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story