Bichagadu 2: వెయిటర్ గా బిచ్చగాడు 2 హీరో.. ఎందుకంటే?

Bichagadu Actor Vijay Antony Turns Waiter at Hyderabad
x

Bichagadu 2: వెయిటర్ గా బిచ్చగాడు 2 హీరో..ఎందుకంటే?

Highlights

*బిచ్చగాడు2 విడుదలకు ముందు ప్రచారాన్ని సంప్రదాయ పద్ధతిలో చేసినా విజయ్ ఆంటోని ...సినిమాకు హిట్ టాక్ రావడంతో ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు.

Bichagadu 2: సినిమా రిలీజ్ చేయడం ఒక ఎత్తు..ఆ సినిమాని ప్రమోట్ చేయడం మరోఎత్తు..ఇందులో భాగంగానే ప్రీరిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లను ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇవన్నీ ఒకప్పటి మాట..ఇప్పుడు ట్రెండ్ మారింది. అందుకే, ప్రజల్లోకి నేరుగా వెళ్లేందుకు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. హీరో గోపీచంద్ రామబాణం ప్రమోషన్స్ లో భాగంగా పాల ప్యాకెట్ల మీద తన కొత్త సినిమా రామబాణం పోస్టర్లు వేసి ప్రమోట్ చేశాడు. ఇక విశ్వక్ సేన్ సైతం తన దాస్ కా ధమ్కీ ప్రమోషన్స్ లో భాగంగా వెయిటర్ గా మారి...హోటల్ లో సందడి చేశాడు. కట్ చేస్తే ఇప్పుడు ఇదే రూట్ ని ఫాలో చేసేస్తూ విజయ్ ఆంటోనీ తన బిచ్చగాడు 2 ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నాడు..

హైదరాబాద్ మణికొండలోని 1980 మిలటరీ హోటల్ లో విజయ్ ఆంటోని సందడి చేశాడు. కస్టమర్స్ గుర్తు పట్టకుండా మాస్క్ ధరించి వారికి స్వయంగా వడ్డించారు. కాసేపటికి అసలు విషయం తెలుసుకున్న కస్టమర్స్ విజయ్ ఆంటోనిని చూసి ఆశ్చర్యపోయారు. స్వయంగా హీరో వడ్డించడం పై ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ క్రేజీ మూమెంట్ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక గత శుక్రవారం విడుదలైన బిచ్చగాడు2 తొలుత మిక్డ్స్ టాక్ తెచ్చుకున్నా..ప్రస్తుతం హిట్ దిశగా దూసుకుపోతోంది. మొదటి వారాంతం పూర్తయ్యే సరికి 80 శాతం బ్రేక్ ఈవెన్ సాధించింది. మరో 2-3 రోజుల్లో ఈ సినిమా బయ్యర్లకు లాభాలు అందించడం గ్యారెంటీ. ఇక ఇదే ఊపులో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు3ని ప్రకటించారు. మొత్తంగా విడుదలకు ముందు ప్రచారాన్ని సంప్రదాయ పద్ధతిలో చేసినా...సినిమాకు హిట్ టాక్ రావడంతో ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories