Bichagadu 2: సిస్టర్ సెంటిమెంట్ తో బిచ్చగాడు2.. ట్రైలర్ వేరే లెవల్..

Bichagadu 2 Movie with Sister Sentiment
x

Bichagadu 2: సిస్టర్ సెంటిమెంట్ తో బిచ్చగాడు2.. ట్రైలర్ వేరే లెవల్..

Highlights

Bichagadu 2: సిస్టర్ సెంటిమెంట్ తో బిచ్చగాడు2..ట్రైలర్ వేరే లెవల్..

Bichagadu 2: ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన బిచ్చగాడు మూవీ మన బాక్సాఫీసుల దగ్గర దుమ్ము దులిపేసింది. రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. తొలి భాగంలో అమ్మ సెంటిమెంట్ తో సినిమా నడిస్తే..రెండవ భాగాన్ని విజయ్ ఆంటోని సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కించాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. కంప్లీట్ కమర్షియల్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఉన్న ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

బిచ్చగాడు ఫస్ట్ పార్ట్ లో బిలియనీర్ గా, బిచ్చగాడిగా కనిపించిన విజయ్ ఆంటోని రెండవ భాగంలో ఇద్దరిలా కనిపిస్తూ క్యూరియాసిటీని పెంచేశాడు. ఈ మూవీలో విజయ్ ఆంటోని యాంటీ బికిలిగా కనిపించబోతున్నాడు. బికిలి అంటే పేదవారిని ఆర్థికంగా దోపిడీ చేసే అత్యాశపరుడని అర్థం. దేశంలోనే సంపన్నుడిగా ట్రైలర్ లో కనిపించిన విజయ్ ఆంటోని ప్రమాదానికి గురికావడం..ఇందుకు యాంటీ బికిలి కారణమంటూ విజయ్ ఆంటోనీయే మళ్లీ పరిచయం కావడం సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఇక ఫ్లాష్ బ్యాక్ లో అన్నా చెల్లెల్ల ఎపిసోడ్ ఉన్నట్లు చూపించాడు. ఇక ఈ సినిమా మొత్తం బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంట్ చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది. మొత్తంగా మే19న విడుదలౌతున్న ఈ సినిమాతో విజయ్ ఆంటోని మరో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories