Bichagadu 2 1st Review: సైన్స్, సెంటిమెంట్ తో గుండెలు పిండేలా బిచ్చగాడు 2

Bichagadu 2 with Science and Sentiments
x

Bichagadu 2 1st Review: సైన్స్, సెంటిమెంట్ తో గుండెలు పిండేలా బిచ్చగాడు 2

Highlights

*చిన్న సినిమాగా విడుదలైన బిచ్చగాడు ఎంత పెద్ద హిట్టయిందో మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ మూవీకి సీక్వెల్ గా బిచ్చగాడు 2 బాక్సాఫీస్ ముందుకొచ్చేందుకు రెడీ అయింది.

Bichagadu 2 1st Review: 2016 లో వచ్చిన బిచ్చగాడు మూవీ ఎంత పెద్ద హిట్టయిందో మనందరికీ తెలిసిందే..ఈ సినిమా రిలీజ్ సమయంలో ఇదేం టైటిల్ రా బాబు అని విమర్శించిన వారే ఆ తర్వాత థియేటర్ కు వెళ్లి సినిమా చూశారంటే అతిశయోక్తి కాదు. తెలుగు బాక్సాఫీస్ దగ్గర బిచ్చగాడు ఒక సంచలనంగా నిలిచింది. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. మే 19న బిచ్చగాడు 2 ప్రేక్షకుల ముందుకు వస్తుండగా ఈ సందర్భంగా అటు చెన్నైలో ఇటు మన హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రివ్యూ వేశారు.

ఈ షో చూసినవారందరూ బిచ్చగాడు 2 పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. బిచ్చగాడు సినిమా కంటే సీక్వెల్ ఎంతో బాగుందని, విజయ్ ఆంటోని మరోసారి తన నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్లాడని కాంప్లిమెంట్లు కురిపిస్తున్నారు. బ్రెయిన్ మార్పిడి పై జరిపే ప్రయోగం కారణంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేదే ఈ చిత్ర కథ అని చెబుతున్నారు. డబ్బు మరియు ఎమోషన్స్ చుట్టూ సాగే ఈ కథలో ప్రతీ ఒక్కరూ జీవించేశారని చెప్తున్నారు. సినిమాలోని సెంటిమెంట్ సీన్స్ హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుందంటున్నారు.

మొత్తానికి., మొదటి భాగంలో తల్లి సెంటిమెంట్ ని ప్రధానంగా ఫోకస్ చేస్తే రెండవ భాగంలో చెల్లి సెంటిమెంట్ తో తెరకెక్కించారు. రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న బిచ్చగాడు2 ప్రేక్షకులకు ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుందో తెలియాలంటే మరో రోజు ఆగాలి. అయితే, రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ రావడం ఈ సినిమాకు బాగా కలిసి వస్తోంది. మరి, బాక్సాఫీస్ దగ్గర బిచ్చగాడు 2 ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories