Bangarraju Movie: నాగార్జున చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన భూమిక

Bangarraju Movie: నాగార్జున నూతన సినిమా 'బంగార్రాజు' సినిమాలో భూమిక ఛాన్స్ కొట్టేసింది.

Kranthi
Updated on: 13 March 2021 3:12 PM IST
Bhumika Selected as Heroine in Nagarjuna Bangarraju Movie
X

ఇమేజ్ సోర్స్:(ది హన్స్ ఇండియా)

Bangarraju Movie: ఒకప్పటి టాలీవుడ్ అగ్ర హీరోయిన్స్ లో ఒకరు భూమిక చావ్లా. ఈ భామ అటు గ్లామర్ నాయికగా.. ఇటు అభినయం ప్రదర్శించగల నటిగా కూడా పేరుతెచ్చుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఈ అమ్మడు ఒక్కడు సినిమాలో నటించింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలించింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఖుషి సినిమాలో నటించింది. ఈ సినిమాకూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సింహాద్రి సినిమాలో నటించింది. ఈ సినిమాకూడా సంచలన విజయం నమోదు చేసుకుంది. ఇలా వరుస విజయాలను అందుకుంటూ భూమిక అతితక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా నిలించింది.

ధోని అంటోల్డ్ స్టోరీ మూవీలో సుశాంత్ అక్కగా...

ఆతర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరమయ్యారు. దివంగత నటుడు సుశాంత్ నటించిన ధోని అంటోల్డ్ స్టోరీ సినిమాలో సుశాంత్ అక్కగా నటించి ఆకట్టుకుంది. ఆతర్వాత తెలుగులో నాని నటించిన ఎంసీఏ సినిమాలో నాని వదినగా నటించి అలరించింది భూమిక. అక్కినేని నాగార్జునతో సరసన 'స్నేహమంటే ఇదేరా' సినిమాలో నటించింది. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు నాగార్జున సినిమాలో భూమిక ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.

'బంగార్రాజు' చిత్రంలో ఓ కీలక పాత్ర...

నాగార్జున హీరోగా వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలోని బంగార్రాజు పాత్ర బాగా పాప్యులర్ అయింది. దాంతో ఆ పాత్ర పేరునే టైటిల్ గా తీసుకుని నాగార్జున మరో సినిమా చేస్తున్నారు. 'సోగ్గాడే చిన్ని నాయనా' దర్శకుడు కల్యాణ్ కృష్ణ దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ 'బంగార్రాజు' చిత్రంలో ఓ కీలక పాత్రకు భూమికను ఎంపిక చేసినట్టు, ఆమె పాత్ర నెగటివ్ టచ్ తో సాగుతుందని తెలుస్తోంది.

Kranthi

Kranthi

Next Story