Bhumika Chawla: హ్యాట్రిక్ భూమిక.. ఆ విషయంలో ఆమెదే పైచేయి..

Bhumika Chawla
x

హ్యాట్రిక్ భూమిక.. ఆ విషయంలో ఆమెదే పైచేయి..

Highlights

* రీ రిలీజ్ కి సిద్ధమైన మరొక భూమిక సినిమా

Bhumika Chawla: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగానే నడుస్తుంది. ఒకప్పుడు థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలు ఇప్పుడు మళ్లీ ఏదో ఒక అకేషన్ లో మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ అవుతున్నాయి. మహేష్ బాబు "అతడు" సినిమా నుంచి పవన్ కళ్యాణ్ "ఖుషి" సినిమా వరకు ఇప్పటికే చాలా వరకు సూపర్ హిట్ సినిమాలు థియేటర్లలో మళ్ళీ విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు కూడా అందుకున్నాయి. తాజాగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఒక సినిమా కూడా రెండోసారి విడుదల కి సిద్ధమవుతోంది. అదే "సింహాద్రి".

"స్టూడెంట్ నెంబర్ వన్" సినిమా తర్వాత ఎన్టీఆర్ మరియు రాజమౌళి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన రెండవ సినిమా అది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నిజానికి ఈ సినిమాతోనే రాజమౌళి కి కూడా కమర్షియల్ డైరెక్టర్ అనే ట్యాగ్ వచ్చింది. 2003లో విడుదలైన ఈ సినిమాని మళ్లీ ఇన్నాళ్లకు రీ రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పటిదాకా విడుదలయిన అన్ని సినిమాలలో పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ "ఖుషీ" సినిమా అత్యధిక కలెక్షన్లను అందుకుంది.

కేవలం రీ రిలీజ్ తోనే ఈ సినిమా ఏకంగా 4.50 కోట్లు వసూలు చేసింది. భూమిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక మహేష్ బాబు ఒక్కడు సినిమా లో కూడా భూమిక హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా ఈ మధ్యనే రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు త్వరలో రీ రిలీజ్ కాబోతున్న సింహాద్రిలో కూడా భూమికనే హీరోయిన్గా నటించింది. ఇలా ఒకే హీరోయిన్ కి సంబంధించి మూడు సినిమాలు రీ రిలీజ్ అవ్వటం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories