Bhola Shankar: అనుకున్న సమయానికే వచ్చేస్తున్న మెగాస్టార్..

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా మూవీ భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టైన వేదాళం మూవీకి రీమేక్ గా తెరకెక్కుతోంది.

Arun Chilukuri
Published on: 31 May 2023 12:43 PM IST
Bhola Shankar: అనుకున్న సమయానికే వచ్చేస్తున్న మెగాస్టార్..
X

Bhola Shankar:అనుకున్న సమయానికే వచ్చేస్తున్న మెగాస్టార్ 

Bhola Shankar:మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా మూవీ భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టైన వేదాళం మూవీకి రీమేక్ గా తెరకెక్కుతోంది. షాడో తర్వాత దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ మెగా ఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్..మెగా స్టార్ చిరంజీవి సోదరిగా కనిపించనుంది.

భోళా శంకర్ మూవీని ఆగస్ట్ 11న రిలీజ్ చేస్తామని నిర్మాతలు గతంలో ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ కానుందని తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో భోళా శంకర్ మేకర్స్ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అనుకున్న సమయానికే వస్తామని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు త్వరలోనే మ్యూజికల్ జర్నీ ప్రారంభిస్తామని తెలుపుతూ మెగాస్టార్ డాన్స్ మూమెంట్ లుక్ తో పోస్టర్ ను రిలీజ్ చేశారు.

భోళా శంకర్ మూవీ కోసం మెహర్ రమేష్ ప్రత్యేకించి చిరుపై కొన్ని సీన్లను ప్లాన్ చేశాడట. శంకర్ దాదా ఎంబీబీఎస్ తరహాలో కామెడీ ఉంటుందని చెబుతున్నారు. సినిమా మెయిన్ ప్లాట్ సిస్టర్ సెంటిమెంట్ తో సాగినా..మెగా స్టార్ మార్క్ కామెడీ పుష్కలంగా ఉంటుందని టాలీవుడ్ ఇన్ సైడర్స్ గ్యారెంటీ ఇస్తున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ తన సినిమాల్లో హీరోలను ఎంత స్టైలిష్ గా చూపిస్తాడో మనకు తెలిసిందే కదా..భోళాశంకర్ లో సైతం మెగాస్టార్ చిరంజీవిని అల్ట్రా స్టైలిష్ లుక్ లో ప్రెజెంట్ చేయబోతున్నాడు.

భోళా శంకర్ మూవీతో హిట్టు కొట్టాలని మెహర్ రమేష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు వాల్తేరు వీరయ్యలో వింటేజ్ లుక్ లో దర్శనం ఇచ్చి భారీ హిట్ కొట్టిన చిరంజీవి అదే ఊపును కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. మొత్తంగా ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న భోళా శంకర్ మూవీ ఆగస్ట్ 11న రిలీజ్ కానుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story